https://oktelugu.com/

Mad Square Collections : మ్యాడ్ స్క్వేర్’ 4 రోజుల వరల్డ్ వైడ్ వసూళ్లు..దెబ్బ మామూలుగా పడలేదు!

Mad Square Collections : ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఘన విజయం సాధించిన విషయం వాస్తవమే కానీ, వసూళ్లు మాత్రం ఊహించిన రేంజ్ లో లేవని ట్రేడ్ వర్గాల్లో వినిపిస్తున్న మాట. 'టిల్లు స్క్వేర్' చిత్రం గత ఏడాది ఇదే సీజన్ లో విడుదలై దాదాపుగా 70 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు, 130 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. 'మ్యాడ్ స్క్వేర్' కూడా అదే రేంజ్ లో వసూళ్లను రాబడుతుందని అంతా అనుకున్నారు.

Written By: , Updated On : April 1, 2025 / 06:43 PM IST
Mad Square Closing Collections

Mad Square Closing Collections

Follow us on

Mad Square Collections : యూత్ ఆడియన్స్ లో భారీ అంచనాలను ఏర్పాటు చేసుకున్న ‘మ్యాడ్ స్క్వేర్'(Mad Square) చిత్రం ఉగాది కానుకగా విడుదలై బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ తో ముందుకు దూసుకుపోతుంది. కేవలం నాలుగు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ మార్కుని దాటేసిన ఈ చిత్రం, నేటి నుండి లాభాల్లోకి అడుగుపెట్టిందని ఆ చిత్ర నిర్మాత నాగవంశీ నేడు మీడియా సమావేశం లో చెప్పుకొచ్చాడు. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఘన విజయం సాధించిన విషయం వాస్తవమే కానీ, వసూళ్లు మాత్రం ఊహించిన రేంజ్ లో లేవని ట్రేడ్ వర్గాల్లో వినిపిస్తున్న మాట. ‘టిల్లు స్క్వేర్’ చిత్రం గత ఏడాది ఇదే సీజన్ లో విడుదలై దాదాపుగా 70 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు, 130 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. ‘మ్యాడ్ స్క్వేర్’ కూడా అదే రేంజ్ లో వసూళ్లను రాబడుతుందని అంతా అనుకున్నారు.

Also Read : అడల్ సెన్స్ వెబ్ సిరీస్ ఎందుకంత ఫేమస్ అయింది.. అసలు అందులో ఏముంది?

కానీ ఫుల్ రన్ లో 40 కోట్ల రూపాయిల షేర్ అయినా వస్తుందా లేదా అన్నట్టుగా తయారైంది పరిస్థితి. అనుకున్న రేంజ్ లో వసూళ్లను రాబట్టలేకపోవడానికి ఒక కారణం కూడా ఉంది. విడుదలైన మొదటి రోజే HD క్వాలిటీ తో ప్రింట్ పైరసీ జరగడమే. దీని వల్ల వంద రూపాయిలు రాబట్టాల్సిన సినిమా, కేవలం 50 రూపాయిలను మాత్రమే రాబడుతుంది. దీనిపై నిర్మాత నాగవంశీ స్పందిస్తూ, పైరసీ ఈ మధ్య కాలం లో చాలా పెద్ద సమస్య గా మారిపోయిందని, తాము ఓవర్సీస్ సెన్సార్ కోసం పంపిన ప్రింట్ ఆన్లైన్ లో లీక్ అయ్యిందని, అక్కడే ఎక్కడో పొరపాటు జరుగుతుందని నేడు మీడియా సమావేశంలో చెప్పుకొచ్చాడు. దీనిని ఎలా అరికట్టాలి అనేది ఫిలిం ఛాంబర్ తో, ప్రభుత్వాలతో మాట్లాడి ఒక నిర్ణయం తీసుకోవాలని, లేకపోతే భవిష్యత్తులో చాలా పెద్ద దెబ్బ ఎదురుకోవాల్సి ఉంటుందని అన్నాడు. ఇకపోతే ఈ చిత్రానికి ప్రాంతాల వారీగా నాలుగు రోజుల్లో ఏ రేంజ్ వసూళ్లు వచ్చాయి అనేది ఇప్పుడు చూద్దాం.

నైజాం ప్రాంతంలో ఈ చిత్రానికి నాలుగు రోజుల్లో 9 కోట్ల 56 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు రాగా, సీడెడ్ లో రెండు కోట్ల 74 లక్షలు, ఉత్తరాంధ్ర లో రెండు కోట్ల 60 లక్షలు, తూర్పు గోదావరి జిల్లాలో కోటి 68 లక్షలు, పశ్చిమ గోదావరి జిల్లాలో 81 లక్షలు, గుంటూరు జిల్లాలో కోటి 51 లక్షలు, కృష్ణ జిల్లాలో కోటి 21 లక్షలు, నెల్లూరు జిల్లాలో 68 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. ఓవరాల్ గా తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రానికి 20 కోట్ల 79 లక్షల రూపాయిలు రాగా, కర్ణాటక + రెస్ట్ ఆఫ్ ఇండియా కి కలిపి కోటి 55 లక్షలు, ఓవర్సీస్ లో 5 కోట్ల 15 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. ఓవరాల్ గా వరల్డ్ వైడ్ గా ఈ చిత్రానికి 27 కోట్ల 50 లక్షల రూపాయిల షేర్, 48 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి.

Also Read :