Mad Square : యూత్ ఫుల్ ఎంటర్టైనర్ గా ఉగాది కానుకగా విడుదలైన ‘మ్యాడ్ స్క్వేర్'(Mad Square) చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద ఏ రేంజ్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిల్చిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. బయ్యర్స్ ఆశించిన స్థాయిలో వసూళ్లు అయితే రాబట్టలేకపోతుంది కానీ, అందరూ లాభాల్లోనే ఉన్నారు. వంద కోట్ల రూపాయిల గ్రాస్ ని కచ్చితంగా కొల్లగొడుతుంది అనుకుంటే, ఇంకా 60 కోట్ల గ్రాస్ వద్దనే ఆగింది. ఓవర్సీస్ లో ఈ వీకెండ్ తో పూర్తి స్థాయిలో బ్రేక్ ఈవెన్ అయ్యింది. ఇకపోతే రీసెంట్ గానే హైదరాబాద్ లో ఈ సినిమాకు సంబంధించిన సక్సెస్ సెలెబ్రేషన్స్ ని శిల్ప కళా వేదికలో జరపగా, జూనియర్ ఎన్టీఆర్(Junior NTR) ముఖ్య అతిథిగా హాజరై మంచి పవర్ ఫుల్ స్పీచ్ ఇచ్చిన సంగతి తెలిసిందే. సరిగ్గా శుక్రవారం రోజున ఈ ఈవెంట్ ని ఏర్పాటు చేసారు.
Also Read : మ్యాడ్ స్క్వేర్’ 9 రోజుల వరల్డ్ వైడ్ వసూళ్లు..ఇక కష్టమే!
ఎందుకంటే వీకెండ్ లో కలెక్షన్స్ కి మళ్ళీ బూస్ట్ వస్తుందనే స్ట్రాటజీ ని నిర్మాత నాగవంశీ(Nagavamsi) ఉపయోగించాడు అన్నమాట. ఆ స్ట్రాటజీ బాగా వర్కౌట్ అయ్యిందనే చెప్పాలి. ఎందుకంటే 8వ రోజు ఈ చిత్రానికి వచ్చిన వసూళ్లు కేవలం 79 లక్షలు మాత్రమే. కానీ శనివారం రోజున ఈ చిత్రానికి ఏకంగా కోటి 26 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. ఈ రేంజ్ జంప్ కి వీకెండ్ అడ్వాంటేజ్ ఎంతోకొంత ఉపయోగపడినా, జూనియర్ ఎన్టీఆర్ ప్రసంగం కూడా ఈ సినిమా వసూళ్లు పెరగడానికి మంచి బూస్ట్ ని ఇచ్చింది అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఇకపోతే బాక్స్ ఆఫీస్ వద్ద విజయవంతంగా పది రోజుల థియేట్రికల్ రన్ ని పూర్తి చేసుకున్న ఈ చిత్రం, పదవ రోజున ఏకంగా కోటి 60 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు కేవలం తెలుగు రాష్ట్రాల నుండి వచ్చింది. ఒక్కసారి ప్రాంతాల వారీగా ఈ సినిమాకు ఎంత వసూళ్లు వచ్చాయో ఒకసారి పరిశీలిద్దాం.
ట్రేడ్ పండితులు అందిస్తున్న సమాచారం ప్రకారం ఈ చిత్రానికి నైజాం ప్రాంతం లో పది రోజులకు గాను 12 కోట్ల 50 లక్షల రూపాయలకు పైగా షేర్ వసూళ్లు రాగా,సీడెడ్ ప్రాంతం లో మూడు కోట్ల 80 లక్షల రూపాయిల షేర్, ఉత్తరాంధ్ర ప్రాంతం లో 3 కోట్ల 52 లక్షల షేర్ వసూళ్లు వచ్చాయి. అదే విధంగా 2 కోట్ల 16 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు ఈస్ట్ గోదావరి జిల్లా నుండి రాగా, కోటి 13 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వెస్ట్ గోదావరి నుండి వచ్చాయి. అదే విధంగా గుంటూరు జిల్లాలో 2 కోట్లు, కృష్ణ జిల్లాలో కోటి 70 లక్షలు, నెల్లూరు జిల్లాలో కోటి రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. ఓవరాల్ గా ఈ చిత్రానికి పది రోజులకు గాను రెండు తెలుగు రాష్ట్రాలకు కలిపి 27 కోట్ల 81 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు రాగా, 44 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ఓవరాల్ గా వరల్డ్ వైడ్ గా ఓవర్సీస్+ కర్ణాటక+ రెస్ట్ ఆఫ్ ఇండియా కలిపి ఈ చిత్రానికి 36 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు, 64 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి.
Also Read : ‘మ్యాడ్’ ఫేమ్ లడ్డు సినిమాల్లోకి రాకముందు అలాంటి పనులు చేసేవాడా?