Mad Square Collection: ఉగాది కానుకగా విడుదలైన యూత్ ఫుల్ ఎంటర్టైనర్ ‘మ్యాడ్ స్క్వేర్'(Mad Square Movie) చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద భారీ వసూళ్లను నమోదు చేసుకుంటూ ముందుకు దూసుకుపోతున్న సంగతి అందరికీ తెలిసిందే. ఓవర్సీస్ లో తప్ప, విడుదలైన మూడు రోజుల్లోనే అన్ని ప్రాంతాల్లో బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకున్న ఈ చిత్రం, కచ్చితంగా వంద కోట్ల రూపాయిల గ్రాస్ మార్కుని అందుకుంటుందని ఆశించారు కానీ, ఆ రేంజ్ కి వెళ్లడం కష్టమే అని అదాదాపుగా ఖరారు అయిపోయింది. కానీ శనివారం కావడం తో ఈ సినిమాకి వసూళ్ల విషయం లో భారీ జంప్ చోటు చేసుకుంది. ఒక్క శనివారం రోజునే ఈ సినిమాకు బుక్ మై షో(Book My Show) లో దాదాపుగా 38 వేల టికెట్స్ అమ్ముడుపోయాయి. సక్సెస్ ఈవెంట్ కి జూనియర్ ఎన్టీఆర్(Junior NTR) ముఖ్య అతిథి గా రావడం కూడా ఈ సినిమాకు బాగా కలిసొచ్చింది.
Also Read: ‘L2 : ఎంపురాన్’ 10 రోజుల వరల్డ్ వైడ్ వసూళ్లు..300 కోట్లకు అతి చేరువలో!
ఇకపోతే 9 రోజుల్లో ఈ చిత్రానికి ఎంత వసూళ్లు వచ్చాయి అనేది వివరంగా ఇప్పుడు చూద్దాము. ట్రేడ్ పండితులు అందిస్తున్న సమాచారం ప్రకారం 7 వ రోజు ఈ చిత్రానికి తెలుగు రాష్ట్రాల నుండి 94 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వస్తే, 8వ రోజున 79 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. కానీ 9వ రోజున ఈ చిత్రానికి ఏకంగా కోటి 50 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు తెలుగు రాష్ట్రాల నుండి వచ్చాయి. అంటే దాదాపుగా రెండింతలు ఎక్కువ వసూళ్లు ముందు రోజుతో పోలిస్తే వచ్చాయి అన్నమాట. ఓవరాల్ గా ఈ చిత్రానికి తెలుగు రాష్ట్రాల్లో 9 రోజులకు 26 కోట్ల 70 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు , 43 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు వచ్చాయి. అదే విధంగా ఓవర్సీస్ లో 9 రోజులకు 6 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు రాగా, కర్ణాటక + రెస్ట్ ఆఫ్ ఇండియాకు కలిపి రెండు కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి.
ఓవరాల్ గా ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రానికి 34 కోట్ల 70 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు 60 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ఫుల్ రన్ లో 70 కోట్ల రూపాయిల మార్కుని కచ్చితంగా అందుకుంటుంది కానీ, ప్రతిష్టాత్మక వంద కోట్ల రూపాయిల గ్రాస్ మార్కుని మాత్రం అందుకోవడం కష్టం అని అంటున్నారు ట్రేడ్ పండితులు. ఈ నెల పదవ తారీఖున కొత్త సినిమాలు విడుదల కాబోతున్నాయి. కాబట్టి ఆరోజు నుండి ఈ చిత్రానికి షేర్స్ రావడం కష్టమే అనొచ్చు. ఓటీటీ విడుదల కూడా ఈ నెలలోనే ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. చూడాలి మరి రాబోయే రోజుల్లో ఏమి జరగబోతుంది అనేది.