Veera Dheere Shoora 2 : కొన్ని సినిమాలు భారీ అంచనాల నడుమ విడుదలై బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొడుతుంటాయి, కొన్ని సినిమాలు ఎలాంటి చప్పుడు లేకుండా విడుదలై సైలెంట్ సూపర్ హిట్స్ గా నిలుస్తుంటాయి. సైలెంట్ సూపర్ హిట్స్ అనిపించుకునే సినిమాలకు ఓపెనింగ్స్ అసలు ఉండవు. కేవలం మౌత్ టాక్ కారణంగా మంచి లాంగ్ రన్ ని సొంతం చేసుకుంటూ ఉంటాయి. రీసెంట్ గా విడుదలైన తమిళ హీరో విక్రమ్(Chiyaan Vikram) నటించిన ‘వీర ధీర శూర2′(Veera Dheera Sooran 2) చిత్రం అలాంటిదే. ఆర్ధిక సమస్యల కారణంగా మొదటి రోజు ఈ చిత్రం సాయంత్రం షోస్ నుండి మొదలైంది. ఈ చిత్రాన్ని చూసిన ప్రతీ ఒక్కరు అద్భుతమైన పాజిటివ్ టాక్ చెప్పారు. రీసెంట్ గా విక్రమ్ హీరోగా నటించిన సినిమాలలో ఇదే బెస్ట్ అంటూ రివ్యూస్ కూడా ఇచ్చారు. కానీ అంచనాలే లేకుండా విడుదలైన సినిమా కావడంతో ఓపెనింగ్స్ అసలు రాలేదు.
Also Read : 4 కోట్లు పెట్టి కొన్నారు..వచ్చిన లాభాలు ఎంతో తెలిస్తే నోరెళ్లబెడుతారు
పాజిటివ్ టాక్ ని తెచ్చుకొని కూడా డిజాస్టర్ అవుతుందేమో అని అందరూ అనుకున్నారు. కానీ అందరి అంచనాలను తారుమారు చేస్తూ ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ లాంగ్ రన్ ని సొంతం చేసుకుంటూ ముందుకు దూసుకుపోతుంది. నిన్న ఒక్క రోజే ఈ చిత్రానికి బుక్ మై షో లో దాదాపుగా 40 వేల టిక్కెట్లు అమ్ముడుపోయాయి. మొదటి రోజు కూడా ఈ రేంజ్ టికెట్స్ అమ్ముడుపోలేదు. తమిళనాడు రాష్ట్రంలో చాలా కాలం తర్వాత బయ్యర్స్ ఒక చిత్రానికి భారీ లాంగ్ రన్ ని చూస్తున్నారు. ఇక కలెక్షన్స్ విషయానికి వస్తే ఈ చిత్రానికి 11 రోజుల్లో తమిళనాడు రాష్ట్ర నుండి దాదాపుగా 37 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. పదవ రోజున తమిళనాడు నుండి రెండు కోట్ల 60 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు వస్తే, 11 వ రోజున మూడు కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి.
తమిళ వెర్షన్ వసూళ్లు అదిరిపోతున్నాయి కానీ, తెలుగు వెర్షన్ లో మాత్రం ఆశించిన స్థాయిలో వసూళ్లు రావడం లేదు. ఇప్పటి వరకు ఈ చిత్రానికి తెలుగు లో రెండు కోట్ల 50 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు మాత్రమే వచ్చాయి. అదే విధంగా కర్ణాటక + రెస్ట్ ఆఫ్ ఇండియా కలిపి మూడు కోట్ల 80 లక్షలు, ఓవర్సీస్ లో 16 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ఓవరాల్ గా ఈ చిత్రానికి 59 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు, 29 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. ఈ చిత్రానికి ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ దాదాపుగా 36 కోట్ల రూపాయలకు జరిగింది. ఫుల్ రన్ లో బ్రేక్ ఈవెన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి కానీ, పదవ తారీఖున విడుదల అవ్వబోతున్న అజిత్ ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ చిత్రం సూపర్ హిట్ అయితే బ్రేక్ ఈవెన్ అవుతుందా లేదా అనేది చెప్పలేం.
Also Read : మహేశ్- రాజమౌళి కాంబోలో విలన్గా స్టార్ హీరో!