Homeఎంటర్టైన్మెంట్Mad For Each Other Harish Controversy: 'మ్యాడ్ ఫర్ ఈచ్ అథర్' లో మాస్క్...

Mad For Each Other Harish Controversy: ‘మ్యాడ్ ఫర్ ఈచ్ అథర్’ లో మాస్క్ మ్యాన్ హరీష్ విచిత్రమైన ప్రవర్తన.. ఇచ్చి పారేసిన నటరాజ్ మాస్టర్!

Mad For Each Other Harish Controversy: ఈమధ్య కాలంలోనే సార్ మా ఛానల్ లో మొదలైన బిగ్గెస్ట్ రియాలిటీ షో ‘మ్యాడ్ ఫర్ ఈచ్ అథర్’ కి ఆడియన్స్ నుండి అద్భుతమైన రెస్పాన్స్ రావడంతో మంచి టీఆర్ఫీ రేటింగ్స్ లో ఈ లవ్ రియాలిటీ షో ముందుకు దూసుకుపోతోంది. మొదట్లో కాస్త బోరింగ్ గా అనిపించినప్పటికీ, ఆ తర్వాత మాత్రం గొడవలతో , ఆడియన్స్ కి కావాల్సినంత ఎమోషన్స్ ని అందిస్తూ ఈ రియాలిటీ షో ముందుకు వెళ్తోంది. ముఖ్యంగా నిన్నటి ఎపిసోడ్ లో నటరాజ్ మాస్టర్ మరియు మాస్క్ మ్యాన్ హరీష్ మధ్య పెద్ద గొడవే జరిగింది. హరీష్ గురించి అందరికీ తెలిసిందే. ‘అగ్ని పరీక్ష’ షో సమయం లో కానీ, ‘బిగ్ బాస్ 9’ లో కానీ ఆయన తోటి వ్యక్తులతో ప్రవర్తించే తీరు చాలా విచిత్రంగా ఉండేది. అందుకే నాల్గవ వారం లోనే ఎలిమినేట్ అయ్యాడు.

ఈయన ఏది చేసినా కంటెంట్ కోసమే చేసినట్టుగా ఆయన చుట్టూ ఉన్నవాళ్లకు అనిపిస్తుంది కాబట్టి, ఈయన ఎక్కడుంటే అక్కడ అనవసరమైన గొడవలు చోటు చేసుకుంటూ ఉంటాయి. ‘మ్యాడ్ ఫర్ ఈచ్ అథర్’ షో లో కూడా ఇంతే. లాంచింగ్ ఎపిసోడ్ నుండే కంటెంట్ ఇవ్వడం మొదలు పెట్టేసాడు. బయట అందరూ కూర్చొని ఉన్న సమయం లో బాగా చలి వేస్తూ ఉండేదట, ఆ సమయం లో హరీష్ తాను ధరించిన కోటుని తన భార్య కి ఇచ్చాడట, అలా అందరూ చెయ్యలేదని వాళ్ళని విమర్శిస్తూ, నా గొప్పతనం చూడండి అంటూ జనాలకు చూపించుకునేలా ఆయన ప్రవర్తన ఉందని చూసే ప్రతీ ఒక్కరికి అనిపించింది. ఇదే విషయాన్నీ షో సమయంలో నటరాజ్ మాస్టర్ కి కూడా అనిపించింది. హరీష్ కెమెరా కోసం డ్రామాలు ఆడుతున్నాడని , అతను మారు వేషం లో భిక్షాటనకు వచ్చిన రావణాసురుడు అని తన భార్య నీతూ తో నటరాజ్ మాస్టర్ మాట్లాడడం పెద్ద దుమారమే రేపింది.

ఈ విషయాన్ని వీకెండ్ ఎపిసోడ్ లో జడ్జీలు ప్రస్తావించడం తో, హరీష్ అప్పటి నుండి నటరాజ్ మాస్టర్ పై మండిపడుతూ వచ్చాడు. నిన్న నామినేషన్స్ సమయం లో కూడా వీళ్లిద్దరు కొట్టుకునేంత పని చేశారు. ఈ ప్రక్రియ మొదలు కాకముందు, కొత్తగా జంటలు ఉన్న ర్యాంకింగ్ ప్రకారం గదులను సర్దుబాటు చెయ్యడం , ఆ తర్వాత ఫుడ్ షేర్ చేసుకోవడం వంటి వాటిపై నటరాజ్ మాస్టర్ మాట్లాడుతూ ఉండగా, హరీష్ ‘సోది వైన్ ఓపిక లేదు’ అని లేచి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత స్వయంగా నటరాజ్ మాస్టర్ వెళ్లి హరీష్ తో మాట్లాడే ప్రయత్న చేయగా, హరీష్ స్పందించకుండా వెళ్ళిపోతూ ఉంటాడు. అతని ఓవర్ యాక్షన్ చూస్తే చిన్న పిల్లాడు ఈయన కంటే బెటర్ కదా, ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నాడు అంటూ నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. అంతే కాదు , ఈ వారం ఈ షో నుండి ఎలిమినేట్ అవ్వబోయే మొదటి జంట హరిత – హరీష్ నే అట.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

YS Sharmila : ఆస్పత్రి బెడ్ మీద షర్మిల.. పరామర్శించడానికి జగన్ కు తీరికలేదు

YS Sharmila : ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అనారోగ్యానికి గురయ్యారు. ఆమె కొద్ది రోజులుగా పొత్తికడుపు నొప్పితో బాధపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఆమె శస్త్ర చికిత్స చేయించుకున్నట్టు తెలుస్తోంది. ఇదే...

Srinivasa Mangapuram : ‘శ్రీనివాస మంగపురం’ మొట్టమొదటి రివ్యూ.. ఈ రేంజ్ లో ఉంటుందని ఊహించలేదు..

Srinivasa Mangapuram : రమేష్ బాబు కుమారుడు ఘట్టమనేని జయకృష్ణ హీరో గా నటించిన 'శ్రీనివాస మంగపురం' చిత్రం ఈ నెల 30 వ తేదీన ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదల...

Abhishek Sharma : 1, 8, 2.. గంభీర్ తో పాటు ఇతడినీ షెడ్డు కు పంపించాల్సిందే..

Abhishek Sharma : ఆడుతోంది జింబాబ్వే మీద. వాళ్ల బౌలింగ్ అంత గొప్పగా ఉండదు. అలాంటప్పుడు స్వేచ్ఛగా ఆడుకోవచ్చు. సరికొత్త రికార్డులు సృష్టించుకోవచ్చు. అవసరమైతే దూకుడుగా బ్యాటింగ్ చేయవచ్చు. కానీ ఇతడు ఏం...

Team India : గంభీర్ లేడు.. టీమిండియా నెంబర్ వన్..

Team India : ఇన్నాళ్లపాటు టీం ఇండియాకు దరిద్రం ఏందో.. శని ఏందో ఇప్పుడు అర్థమైంది. జట్టుకు ఏలినాటి శని లాగా దాపురించిన గంభీర్ లేకపోవడంతో.. ఒక్కసారిగా ఊహించని మార్పులు చోటు చేసుకుంటున్నాయి....

Vaibhav Suryavanshi : బుడ్డోడి కొట్టుడుకి.. బంతి స్టేడియం అవతల.. పెద్ది సినిమా చూపించాడు గా

Vaibhav Suryavanshi :  49 బంతులు.. ఇందులో 8 ఫోర్లు.. నాలుగు సిక్సర్లు.. మొత్తంగా 81 పరుగులు.. అభిషేక్ శర్మతో తొలి వికెట్ కు 20 పరుగులు.. ఇషాన్ కిషన్ తో రెండో వికెట్...
Oktelugu Epaper
Exit mobile version