Macherla Niyojakavargam Trailer: నితిన్ హీరోగా ‘మాచర్ల నియోజకవర్గం’ అనే చిత్రం రాబోతున్న సంగతి తెలిసిందే. హిట్లు ప్లాప్‌లతో సంబంధం లేకుండా వరుస సినిమాలు తీస్తున్న నితిన్.. ఈ చిత్రంపైనే తన ఆశలన్నీ పెట్టుకున్నాడు. ఈ చిత్రం ఆగస్టు 12న విడుదల కానుంది. ఈ క్రమంలో మేకర్స్ ట్రైలర్‌కు సర్వం సిద్ధం అంటూ మాస్ ప్రోమోను తాజాగా రిలీజ్ చేశారు.
ఇటీవలే విడుదలైన గ్లింప్స్ సినిమాపై ఉన్న అంచనాలను రెట్టింపు చేసింది. ఇప్పుడు ట్రైలర్ కూడా అకట్టికుంటే.. సినిమాకి ఉన్న హైప్ డబుల్ అవుతుంది. అందుకే.. ‘మాచర్ల నియోజకవర్గం’ టీమ్.. ట్రైలర్ చాలా బాగా కట్ చేసిందట. ట్రైలర్ లో నితిన్ కత్తి పట్టుకుని రౌడీల పీకలను కోస్తూ కనిపిస్తాడట.

అలాగే ఈ సినిమా ఒక పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ అని తెలియజేసేలా ట్రైలర్ లో ఎలివేషన్ షాట్స్ ను ప్లాన్ చేశారు. పాపం.. ఎప్పటి నుంచో నితిన్ మాస్ హీరో అవాలని చాలా ఆశ పడుతున్నాడు. ఆ ఆశతోనే మధ్యలో కొన్ని యాక్షన్ ఫిల్మ్స్ కూడా చేసి చేతులు కాల్చుకున్నాడు.
ఇప్పటివరకు వచ్చిన చిత్రాలన్నిటిలో నితిన్ నటన పై రివ్యూ చేస్తే.. నితిన్ పై మాస్ ఎలిమెంట్స్ వర్కౌట్ కావడం లేదు, ఇక కావు అని తేలిపోయింది. నిజానికి నితిన్ కి లవ్ స్టోరీలు చాలా బాగా సెట్ అవుతాయి. కాకపోతే, నితిన్ కి ఉన్న ఏకైక కోరిక.. మాస్ హీరో అవాలని. అందుకే ఆ దిశగా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు.
ఈ క్రమంలోనే మాస్ సినిమా ‘మాచర్ల నియోజకవర్గం’ చేశాడు. ఈ సినిమాకు రాజశేఖర్ రెడ్డి దర్శకత్వం వహించగా కృతి శెట్టి హీరోయిన్‌గా చేస్తోంది. ఇక నితిన్ సినిమాల విషయానికి వస్తే.. గత ఏడాదిలో నితిన్ మూడు చిత్రాలు చేశాడు. ‘రంగ్ దే’, ‘చెక్’, ‘మాస్ట్రో’… ఈ మూడు హిట్ కాలేకపోయాయి. మొత్తానికి నితిన్ కి 2021 పూర్తిగా కలసిరాలేదు. మరి ఈ 2022 అయినా కలిసి వస్తోందేమో చూడాలి.

కాకపోతే.. ఈ సినిమాకి ఒక సమస్య వచ్చింది. ఈ సినిమా దర్శకుడు ఎంఎస్ రాజశేఖర్ రెడ్డి పై సోషల్ మీడియాలో బాగా నెగిటివ్ ట్రోలింగ్ జరుగుతుంది. ఎంఎస్ రాజశేఖర్ రెడ్డి గతంలో కులాల పేరిట చేసిన ట్వీట్స్ ఇప్పుడు ఈ సినిమాకి శాపంగా మారాయి. ఈ రోజు ఎంఎస్ రాజశేఖర్ రెడ్డి హైదరాబాద్‌లోని సైబర్ క్రైమ్ పోలీసులను కూడా ఆశ్రయించాడు. తనపై సోషల్ మీడియా వేదికగా తప్పుడు ప్రచారం జరుగుతోందని, దానికి కారకులైన వారిని గుర్తించి చర్యలు తీసుకోవాలని సైబర్ క్రైమ్ కమిషనర్‌కు ఫిర్యాదు చేశాడు.