CM Jagan: ఆంధ్రప్రదేశ్ లో మూడు రాజధానుల వ్యవహారం వైసీపీకి సెగ పెట్టనుంది. రాబోయే ఎన్నికల్లో ఇది జగన్ కు తలనొప్పిగా మారనుందని తెలుస్తోంది. కొద్ది రోజులుగా అమరావతి రాజధాని విషయంలో రగడ రగులుతూనే ఉంది. ఈ నేపథ్యంలో రైతులు తమ నిరసన తెలిపేందుకు మరో మార్గం ఎంచుకున్నారు. ప్రభుత్వ నిర్ణయంతో తాము నష్టపోతున్నామన వాపోతున్నారు. ఈ క్రమంలో పాదయాత్ర చేసి ప్రభుత్వ విధానాన్ని ఎండగట్టాలని భావిస్తున్నారు.

అమరావతి పరిరక్షణ సమితి, రాజధాని జేఏసీ ఆధ్వర్యంలో 45 రోజుల పాటు న్యాయస్థానం నుంచి దేవస్థానం వరకు మహా పాదయాత్ర చేపట్టాలని సంకల్పించారు. తుళ్లూరు నుంచి తిరుమల వరకు ఈ యాత్ర సాగనుంది. నవంబర్ 1 నుంచి డిసెంబర్ 17 వరకు జరిగే యాత్రకు సంబంధించిన షెడ్యూల్ రాజధాని జేఏసీ ప్రణాళిక సిద్ధం చేసింది. ప్రతి రోజు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పాదయాత్ర చేయనున్నారు. అనంతరం సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 7 గంటలకు ముగుస్తుంది.
దీంతో ప్రభుత్వ నిర్వాకాన్ని ప్రజలకు తెలియజెప్పేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. మూడు రాజధానుల వ్యవహారంతో కలిగే నష్టానలు వివరించనున్నారు. ప్రభుత్వ ఒంటెత్తు పోకడలతో పాలన అస్తవ్యస్తంగా మారనుందని చైతన్యం కలిగించనున్నారు. దీని కోసం దాదాపు 200 మంది రైతులు సిద్ధమయ్యారు. అమరావతిని కాపాడుకునే క్రమంలో ప్రాణత్యాగానికైనా సిద్ధమేనని ప్రకటించారు. ఈ నేపథ్యంలో వైసీపీ ప్రభుత్వానికి ఓ చెపంపెట్టులా మారే అవకాశం ఏర్పడనుంది.
మూడు రాజధానుల నిర్ణయంతో ప్రభుత్వం ప్రజాభీష్టాన్ని పట్టించుకోవడం లేదు. దీంతో రైతుల ఆగ్రహానికి గురి కానుంది. కానీ ప్రభుత్వం మొండి వైఖరి అవలంభిస్తోంది. ఈ నేపథ్యంలో అప్రదిష్ట మూటగట్టుకుంటోంది. ప్రస్తుతం జరుగుతున్న ఆందోళనలను బేఖాతరు చేస్తోంది. అందుకే ప్రభుత్వంపై న్యాయపోరాటం చేయడానికి సిద్ధమవుతున్నారు. పాదయాత్రతో ప్రభుత్వం కళ్లు తెరిపించాలని ప్రయత్నిస్తున్నారు.