Azam Khan: ఓడిపోతున్నా సిగ్గనిపించడం లేదా.. వరుస సున్నాలు చూడుతున్న అతన్ని ఎందుకు తీసుకుంటున్నారు?

పాకిస్తాన్ జట్టులో ఆజామ్ ఖాన్ అనే ఆటగాడు ఉన్నాడు. ఇతడు కీపర్ గా ఆ జట్టుకు సేవలందిస్తున్నాడు.. అయితే ఆజామ్ ఖాన్ భారీ కాయుడు. సరిగా పరిగెత్తలేడు. ఇటీవల పాకిస్తాన్ జట్టు ఇంగ్లాండ్ జట్టుతో నాలుగు టి20 మ్యాచ్ ల సిరీస్ ఆడింది.

Written By: Anabothula Bhaskar, Updated On : June 7, 2024 12:22 pm

Azam Khan

Follow us on

Azam Khan: క్రికెట్ అంటేనే ఫిట్ నెస్ తో కూడుకున్న గేమ్. ఆటగాళ్లకు ఫిట్ నెస్ ఉంటేనే అందులో రాణించగలరు. అందుకే క్రికెట్ ను జెంటిల్మెన్ గేమ్ అంటారు.. క్రికెట్ ఆడే ఆటగాళ్లు మైదానంలో చిరుత పులులగా పరిగెత్తాల్సి ఉంటుంది. వేగంగా బ్యాటింగ్ చేయాల్సి ఉంటుంది. వైవిధ్యమైన బంతులు వేయాల్సి ఉంటుంది. అప్పుడే అటు ఆడే ఆటగాళ్లకు.. ఇటు చూసే ప్రేక్షకులకు క్రికెట్లో అసలు మజా లభిస్తుంది. కానీ ఇందులో ఆటగాళ్లు ఫిట్ నెస్ కోల్పోతే చాలా ఇబ్బందులు పడాల్సి ఉంటుంది. ముఖ్యంగా శరీరాకృతి విషయంలో ఆటగాళ్లు దృష్టి సారించకపోతే పరువు పోగొట్టుకోవాల్సి ఉంటుంది. పాకిస్తాన్ జట్టులో ఓ ఆటగాడు ప్రస్తుతం ఇలానే ఇబ్బంది పడుతున్నాడు. విపరీతమైన శరీరాకృతి, ఫిట్ నెస్ లేక తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నాడు.

పాకిస్తాన్ జట్టులో ఆజామ్ ఖాన్ అనే ఆటగాడు ఉన్నాడు. ఇతడు కీపర్ గా ఆ జట్టుకు సేవలందిస్తున్నాడు.. అయితే ఆజామ్ ఖాన్ భారీ కాయుడు. సరిగా పరిగెత్తలేడు. ఇటీవల పాకిస్తాన్ జట్టు ఇంగ్లాండ్ జట్టుతో నాలుగు టి20 మ్యాచ్ ల సిరీస్ ఆడింది. ఇందులో రెండు మ్యాచ్లు వర్షం వల్ల తుడిచిపెట్టుకుపోయాయి. మిగతా మ్యాచ్లలో పాకిస్తాన్ ఓడిపోయింది. ముఖ్యంగా చివరి మ్యాచ్లో పాకిస్తాన్ కీపర్ ఆజామ్ ఖాన్ పేలవమైన కీపింగ్ వల్ల ఇంగ్లాండ్ క్రికెటర్లకు జీవదానాలు లభించాయి. అంతేకాదు అతని బ్యాటింగ్ లోనూ పెద్దగా ప్రభావం చూపించలేకపోయాడు. మెరుగ్గా బ్యాటింగ్ చేయాల్సిన చోట సున్నా పరుగులకే ఔటై నిరాశపరిచాడు.

ఇంగ్లాండ్ సిరీస్ లోనే దారుణమైన ఆట తీరు ప్రదర్శించి విమర్శలు ఎదుర్కొన్న ఆజామ్ ఖాన్ ను పాకిస్తాన్ క్రికెట్ బోర్డు t20 వరల్డ్ కప్ ఎంపిక చేసింది. అయితే ఈ టోర్నీ లోనూ అతడు అదే ఆట తీరు ప్రదర్శిస్తున్నాడు. గురువారం రాత్రి అమెరికా జట్టుతో జరిగిన మ్యాచ్లో 0 పరుగులకే వెనుతిరిగాడు.. వాస్తవానికి అతడు గనుక కుదురుకొని ఉంటే పాకిస్తాన్ మరింత మెరుగైన స్కోర్ సాధించేది. అమెరికాపై విజయం సాధించేందుకు ఆస్కారం లభించేది. కానీ అతడు గోల్డెన్ డక్ గా వెను తిరగడంతో పాకిస్తాన్ స్కోరు 159 పరుగుల వద్ద ఆగిపోయింది. ఆజామ్ ఖాన్ సున్నా పరుగులకే అవుట్ కావడంతో సోషల్ మీడియాలో ట్రోలర్స్ రెచ్చిపోతున్నారు. ఇలాంటి ఆటగాడికి అవకాశం ఇస్తే.. పాకిస్తాన్ జట్టు ఎలా గెలుస్తుందని గెలిచేస్తున్నారు. గతంలో పాకిస్తాన్ జట్టుకు కెప్టెన్ గ ఉన్న ఇంజమాముల్ హక్ ఇలానే భారీ శరీరాకృతితో ఉండేవాడు.. కానీ అద్భుతంగా బ్యాటింగ్ చేసేవాడు.. ఆజామ్ ఖాన్ మాత్రం అలా చేయలేకపోతున్నాడు. వరుసగా సున్నాలు చుడుతున్న అతడిని ఎందుకు ఎంపిక చేస్తున్నారు, మీకు కొంచెం కూడా సిగ్గు అనిపించడం లేదా అంటూ పాకిస్తాన్ క్రికెట్ మేనేజ్మెంట్ పై ఆ జట్టు అభిమానులు మండిపడుతున్నారు.