https://oktelugu.com/

Manamey X Review: మనమే ట్విట్టర్ టాక్: ఫస్ట్ హాఫ్ అలా సెకండ్ హాఫ్ ఇలా, శర్వాకు హిట్ పడిందా?

Manamey X Review: హిట్ కోసం తపిస్తున్న శర్వానంద్-కృతి శెట్టి నటించిన చిత్రం మనమే. ఈ చిత్రానికి శ్రీరామ్ ఆదిత్య దర్శకుడు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ పతాకం పై టీజీ విశ్వప్రసాద్ నిర్మించారు...

Written By:
  • S Reddy
  • , Updated On : June 7, 2024 / 10:02 AM IST

    Manamey X Review

    Follow us on

    Manamey X Review: టైర్ టు హీరోల్లో శర్వానంద్(Sharwanand) ఒకరు. ఆయనకు యూత్ లో మంచి ఇమేజ్ ఉంది. అయితే శర్వానంద్ వరుస పరాజయాలతో ఇబ్బందిపడుతున్నారు. చెప్పాలంటే శతమానం భవతి తర్వాత శర్వానంద్ కి క్లీన్ హిట్ లేదు. అదే సమయంలో కృతి శెట్టి స్ట్రాంగ్ కమ్ బ్యాక్ ఇవ్వాలని అనుకుంటుంది. ఉప్పెన, శ్యామ్ సింగరాయ్, బంగార్రాజు చిత్రాలతో హ్యాట్రిక్ పూర్తి చేసిన కృతి శెట్టి(Krithi Shetty) అనంతరం హ్యాట్రిక్ ప్లాప్స్ ఇచ్చింది. హిట్ కోసం తపిస్తున్న శర్వానంద్-కృతి శెట్టి నటించిన చిత్రం మనమే.

    ఈ చిత్రానికి శ్రీరామ్ ఆదిత్య దర్శకుడు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ పతాకం పై టీజీ విశ్వప్రసాద్ నిర్మించారు. మనమే చిత్రం జూన్ 7న వరల్డ్ వైడ్ విడుదల చేశారు. ఇప్పటికే ప్రీమియర్స్ ప్రదర్శన ముగిసింది. మనమే చిత్రాన్ని చూసిన ఆడియన్స్ తమ అభిప్రాయం తెలియజేస్తున్నారు.

    మనమే చిత్ర కథ విషయానికి వస్తే… విక్రమ్ (శర్వానంద్) లండన్ లో లైఫ్ ని ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. అనుకోని పరిణామంతో అతడు ఇండియా రావాల్సి వస్తుంది. సుభద్ర(కృతి శెట్టి)-విక్రమ్ లు ఒక బాధ్యత తీసుకుంటారు. ఈ క్రమంలో విక్రమ్, సుభద్రల జర్నీ ఎలా సాగింది? అసలు వారు తీసుకున్న బాధ్యత ఏమిటీ? అనేది మిగతా కథ

    Satyabhama: సత్యభామ ట్విట్టర్ టాక్: పోలీస్ రోల్ లో కాజల్ విధ్వసం, ఓవరాల్ గా సినిమా ఎలా ఉందంటే?

    దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య ఫస్ట్ హాఫ్ కొంత మేర ఆకట్టుకునేలా తీర్చిదిద్దాడు. శర్వానంద్-కృతి మధ్య సన్నివేశాల్లో సిట్యుయేషనల్ కామెడీ నవ్వులు పూయిస్తుంది. మొదటి భాగంగా ఫీల్ గుడ్ మూవీగా సాగుతుంది. సెకండ్ హాఫ్ మాత్రం చాలా బోరింగ్ అని ఆడియన్స్ అభిప్రాయం. రిపీటెడ్ సీన్స్ తో ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెట్టాడనే వాదన వినిపిస్తోంది. కథలో ఎమోషనల్ కనెక్షన్ మిస్ కావడం కూడా పెద్ద మైనస్ అంటున్నారు.

    Kanguva: రోజు రోజుకి అంచనాలు పెంచుతున్న కంగువ మూవీ…రిలీజ్ డేట్ ఎప్పుడంటే..?

    శర్వానంద్, కృతి శెట్టి తమ పాత్రలకు న్యాయం చేశారని అంటున్నారు. శర్వానంద్ ఎనర్జిటిక్ పెర్ఫార్మన్స్ ఉపశమనం కలిగించే అంశం. మ్యూజిక్ పర్లేదు, నిర్మాణ విలువలు బాగున్నాయని అంటున్నారు. మొత్తంగా నత్త నడకన సాగే స్క్రీన్ ప్లే తో మనమే చిత్రం ఏమాత్రం ఆకట్టుకోలేదనేది మెజారిటీ ఆడియన్స్ అభిప్రాయం.