Coolie movie Lokesh: తమిళ్ సినిమా ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్లుగా గుర్తింపును సంపాదించుకున్న వాళ్లలో లోకేష్ కనకరాజు (Lokesh Kanaka Raj) ఒకరు…ప్రస్తుతం తను కూలీ సినిమాతో తనను తాను మరొకసారి స్టార్ డైరెక్టర్ గా ఎలివేట్ చేసుకోవాలనే ప్రయత్నం చేస్తున్నాడు. ఇక పాన్ ఇండియా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాతో యావత్ ఇండియన్ సినిమా ప్రేక్షకులందరిని తనవైపు తిప్పుకోవాలనే ప్రయత్నం చేస్తున్నాడు. మరి ఆగస్టు 14వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాలో రజనీకాంత్ ఒక మాఫియా డాన్ గా కనిపించబోతున్నాడు. ఈ సినిమాని చూసిన ప్రేక్షకులు ఎలా రెస్పాండ్ అవుతారు. ఈ సినిమా సూపర్ సక్సెస్ ని సాధిస్తుందా? లేదా అనే విషయాలు తెలియాలంటే సినిమా రిలీజ్ అయ్యేంతవరకు వెయిట్ చేయాల్సిందే… ప్రస్తుతం ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో తెలుగు దర్శకుల హవా ఎక్కువగా కొనసాగుతోంది. తమిళ్ సినిమా ఇండస్ట్రీ నుంచి కొంతమంది దర్శకులు ఉన్నప్పటికి ప్రస్తుతం వాళ్లు పాన్ ఇండియాలో సక్సెస్ లను సాధించలేకపోతున్నారు. ఇక లోకేష్ కనకరాజు ఇంతకుముందు కమల్ హాసన్ తో చేసిన ‘విక్రమ్’ సినిమాతో పాన్ ఇండియా లో మంచి విజయాన్ని సాధించాడు. ఆ తర్వాత ఆయన చేసిన ‘లియో’ సినిమా ఆశించిన మేరకు విజయాన్ని సాధించకపోవడంతో ఆయన కొంతవరకు వెనుకబడిపోయాడు.
Also Read: రామ్ చరణ్ – లోకేష్ కనకరాజ్ కాంబోలో సినిమా వస్తే రికార్డులు బ్రేక్ అవుతాయా..?
మరి ఇప్పుడు పాన్ ఇండియాలో తన హవాను చూపిస్తున్న తెలుగు దర్శకులతో పోటీపడి లోకేష్ కనకరాజు స్టార్ డైరెక్టర్ గా ఎదుగుతాడా? పాన్ ఇండియాలో టాప్ లెవల్ కి వెళ్తాడా లేదా అనేది తెలియాలంటే ఈ సినిమా రిలీజ్ అయ్యేంతవరకు వెయిట్ చేయాల్సిందే…
ఇక మొత్తానికైతే రజనీకాంత్ కెరియర్ లో ఈ సినిమా ఒక మైల్ స్టోన్ గా నిలిచిపోతుందని రజనీకాంత్ సైతం రీసెంట్ గా జరిగిన ఒక ఇంటర్వ్యూలో తెలియజేయడం విశేషం…మరి ఇలాంటి సందర్భంలో భారీ అంచనాల మధ్య రిలీజ్ అవుతున్న కూలీ సినిమా కోసం అటు రజనీకాంత్ అభిమానులు, ఇటు లోకేష్ కనకరాజు అభిమానులు సైతం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Also Read: అనిరుధ్ vs తమన్ ఈ ఇద్దరిలో టాప్ మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు..?
మరి ఈ సినిమాతో యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ మొత్తం షేక్ అవ్వబోతుంది అంటూ తమిళ్ సినిమా ఇండస్ట్రీ నుంచి కొన్ని వార్తలైతే బయటికి వస్తున్నాయి. మరి లోకేష్ కనకరాజు తమిళ్ సినిమా ఇండస్ట్రీ పరువు నిలబెడుతూ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో టాప్ డైరెక్టర్ గా ఎదుగుతాడా? లేదా అనేదే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది…