Ram Charan And Lokesh Kanagaraj: తెలుగు సినిమా ఇండస్ట్రీ అనగానే ఎన్టీఆర్, నాగేశ్వరరావు, కృష్ణ, శోభన్ బాబులతో పాటు మెగాస్టార్ చిరంజీవి పేరు కూడా గుర్తుకొస్తుంది. వీళ్ళందరూ తెలుగు సినిమా ఇండస్ట్రీని ముందుకు తీసుకెళ్లడంలో చాలా కీలక పాత్ర వహించారు. ఇక ఇలాంటి క్రమంలోనే చిరంజీవి మెగాస్టార్ గా తనను తాను ఎలివేట్ చేసుకునే ప్రయత్నం చేశాడు. మరి మొత్తానికైతే ఏ హీరోకి సాధ్యం కానీ రేంజ్ లో సూపర్ సక్సెస్ లను సాధించిన ఆయన ఇకమీదట చేయబోతున్న సినిమాల విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు సాగుతున్నట్టుగా తెలుస్తోంది…ఇక తన నట వారసుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన రామ్ చరణ్ సైతం ప్రస్తుతం గ్లోబల్ స్టార్ గా అవతరించడమే కాకుండా ఇండియన్ సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని తన వైపు తిప్పుకున్నాడు… శంకర్ తో చేసిన గేమ్ చేంజర్ సినిమా ఆశించిన మేరకు విజయాన్ని సాధించకపోవడంతో కొంతవరకు డీలాపడిన రామ్ చరణ్ ఇప్పుడు బుచ్చిబాబు డైరెక్షన్లో చేస్తున్న పెద్ది సినిమాతో మరోసారి తన సత్తా చాటుకోవడానికి సిద్ధమవుతున్నాడు.
Also Read: శభాష్ సిరాజ్.. తండ్రి కష్టానికి గుర్తింపు తెచ్చావ్.. దేశాన్ని సగర్వంగా నిలబెట్టావ్!
ఇక శంకర్ ను నమ్మి దాదాపు మూడు సంవత్సరాల పాటు తన సమయాన్ని వృధా చేసుకున్న రామ్ చరణ్ ఇప్పుడు చాలా ఫాస్ట్ గా సినిమాలను చేయాలని నిశ్చయించుకున్నట్టుగా తెలుస్తోంది. అయితే బుచ్చిబాబు సినిమా అయిపోయిన తర్వాత సుకుమార్ డైరెక్షన్ లో ఒక సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన రామ్ చరణ్ ఆ సినిమా తర్వాత లోకేష్ కనకరాజు దర్శకత్వంలో ఒక సినిమా చేయబోతున్నాడు అనే వార్తలైతే వినిపిస్తున్నాయి…
ఇక ఈ సినిమా హాలీవుడ్ రేంజ్ లో ఉండబోతుందట. దాదాపు 800 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమాని తెరకెక్కించాలనే ఉద్దేశ్యంతో లోకేష్ కనకరాజు అనుకున్నట్టుగా తెలుస్తోంది. ఇక రీసెంట్ గా చిరంజీవి రామ్ చరణ్ లను కలిసి కథను కూడా వినిపించారట. వాళ్ళిద్దరూ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో లోకేష్ చాలా ధీమాగా ఉన్నట్టుగా తెలుస్తోంది.
మరి కూలీ సినిమాతో తను సక్సెస్ ని సాధించి తదుపరి ఖైదీ 2 సినిమాతో మంచి విజయాన్ని అందుకొని రామ్ చరణ్ సినిమాని నెక్స్ట్ లెవెల్లో తెరకెక్కించాలనే ప్రయత్నం చేస్తున్నారట…ఇక ఈ ఇద్దరి కాంబో వర్కౌట్ అయితే మాత్రం ఇండస్ట్రీలోనే అదొక బెస్ట్ కాంబినేషన్ గా నిలిచిపోతుందని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు…