Telugu Directors vs Tamil Directors: ప్రస్తుతం పాన్ ఇండియాలో స్టార్ డైరెక్టర్ల హవా ఎక్కువగా కొనసాగుతోంది… ముఖ్యంగా తెలుగు సినిమా ఇండస్ట్రీ నుంచి చాలామంది స్టార్ట్ డైరెక్టర్లు పాన్ ఇండియాలో వాళ్ళ సత్తా చాటుతూ ముందుకు దూసుకెళ్తూ ఉండడం విశేషం… ఇండియాలో ఉన్న ప్రతి ఒక్క హీరో తెలుగు డైరెక్టర్లతో సినిమాలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నాడు. మరి ఇలాంటి క్రమంలోనే తమిళ్ సినిమా ఇండస్ట్రీలో ఉన్న స్టార్ డైరెక్టర్లు సైతం పాన్ ఇండియాలో సినిమాలను చేసినప్పటికి వాళ్లకు ఏ సినిమా కూడా కలిసి రావడం లేదు. మణిరత్నం, శంకర్, కార్తీక్ సుబ్బరాజు లాంటి దర్శకులు పలు సినిమాలను చేస్తున్నప్పటికి వాళ్ళు చేసిన సినిమాలేవి సక్సెస్ లను సాధించకపోవడంతో వాళ్ళు స్టార్ డైరెక్టర్లుగా మారలేకపోతున్నారు. ఇక తమిళ్ ఇండస్ట్రీ కూడా గతంతో పోల్చుకుంటే ఇప్పుడు చాలా వరకు వెనకబడిపోయిందనే చెప్పాలి. మరి తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోలు మంచి కథలను ఎంచుకొని స్టార్ డైరెక్టర్లతో సినిమాలను చేస్తూ ముందుకు సాగుతున్నారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో తెలుగు సినిమా దర్శకులే ఇండియాలో నెంబర్ వన్ డైరెక్టర్లుగా కొనసాగుతున్నారు. అలాగే టాలీవుడ్ ఇండస్ట్రీ పాన్ ఇండియా స్థాయికి ఎదిగింది. మొత్తానికైతే తెలుగు దర్శకులకు తమిళ్ దర్శకులకు మధ్య కొంతవరకు పోటీ ఉన్నప్పటికి ప్రస్తుతం తెలుగు డైరెక్టర్లు వాళ్ళ డామినేషన్స్ చూపిస్తూ ముందుకు సాగుతూ ఉండటం విశేషం…
Also Read: రామ్ చరణ్ – లోకేష్ కనకరాజ్ కాంబోలో సినిమా వస్తే రికార్డులు బ్రేక్ అవుతాయా..?
మరి తమిళ్ సినిమా ఇండస్ట్రీలో ఉన్న దర్శకులు సైతం చాలా సంవత్సరాల నుంచి పాన్ ఇండియాలో సినిమాలను చేస్తూ వస్తున్నప్పటికి వాళ్లకు ఆశించిన మేరకు సక్సెసు లైతే రావడం లేదు. మరి ఇక మీదటైన మంచి సినిమాలను చేసి గుర్తింపును సంపాదించుకుంటారా ? లేదా అనేది తెలియాల్సి ఉంది…
మొత్తానికైతే తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న దర్శకులే నెంబర్ వన్ పొజిషన్ ని దక్కించుకునే అవకాశం ఉందని తెలుస్తోంది… ఇక రాబోయే సంవత్సరకాలంలో ఎవరైతే వాళ్ళ సినిమాలతో ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటారో వాళ్లు టాప్ పొజిషన్ కి వెళ్తారు. ఎవరైతే వారి సినిమాలతో డీలా పడిపోతారో వాళ్ళు పాతాళానికి పడిపోయే అవకాశం కూడా ఉంది.
Also Read: అనిరుధ్ vs తమన్ ఈ ఇద్దరిలో టాప్ మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు..?
కాబట్టి తమిళ్ దర్శకులు సైతం చాలా జాగ్రత్తగా వాళ్ళ సినిమాలను చేయాల్సిన అవసరమైతే ఉంది. మరి వాళ్ళు అనుకున్నట్టుగానే సూపర్ సక్సెస్ లను సాధిస్తారా? లేదా అనేది తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…ఇక ఇప్పటికే రాజమౌళి, సందీప్ రెడ్డి వంగ, సుకుమార్ లాంటి దర్శకులు టాప్ పొజిషన్ లో ఉన్నారు…