Lavanya Tripathi- Varun Tej: టాలీవుడ్ లో మెగా ఫ్యామిలీకి ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ఆ ఒక్క ఫ్యామిలీ నుంచే పలువురు హీరోలుగా రాణిస్తున్నారన్న సంగతి తెలిసిందే. తాజాగా మెగా బ్రదర్ నాగబాబు తనయుడు, హీరో వరుణ్ తేజ్ వివాహ వేడుక అంగరంగ వైభవంగా జరిగింది.
సినీ ఇండస్ట్రీకి చెందిన సహా నటి లావణ్య త్రిపాఠిని ప్రేమ పెళ్లి చేసుకున్న వరుణ్ తేజ్ ప్రస్తుతం హనీమూన్ వెకేషన్ లో ఉన్నారన్న సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించిన కొన్ని ఫొటోలు సోషల్ మీడియా వేదికగా వరుణ్ పంచుకున్నారు.
దాదాపు ఆరేళ్లుగా ప్రేమలో ఉన్న వరుణ్ – లావణ్య పెళ్లి బంధంతో నవంబర్ 1న పెద్దల సమక్షంలో ఒక్కటయ్యారు. ఇటలీలో కుటుంబ సభ్యుల సమక్షంలో వైభవంగా వివాహం చేసుకున్న జంట హైదరాబాద్, డెహ్రాడూన్ లో రిసెప్షన్ వేడుకలను నిర్వహించుకున్నారు. రిసెప్షన్ అనంతరం హనీమూన్ వెళ్లారని సమాచారం.
వరుణ్ – లావణ్య హానీమూన్ కు ఎక్కడికి వెళ్లారన్న విషయం గురించి నెట్టింట్లో ఓ వార్త చక్కర్లు కొడుతుంది. మెగా ఫ్యామిలీకి సెంటిమెంట్ గా నిలుస్తున్న దేశం ఫిన్లాండ్ కు వీరు కూడా వెళ్లారని టాక్ వినిపిస్తోంది. దీంతో మెగా కుటుంబానికి హనీమూన్ సెంటిమెంట్ దేశం అంటూ ఈ వ్యవహారం వైరల్ గా మారింది.
ప్రస్తుతం ఫిన్లాండ్ లో వరుణ్- లావణ్య ఎంజాయ్ చేస్తున్నారని తెలుస్తోంది. దీంతో పాటు మరికొన్ని దేశాలను కూడా చుట్టి రావాలని వారు ప్లాన్ చేసుకున్నారట. అయితే ఇప్పటికే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ – స్నేహ రెడ్డి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ – ఉపాసన దంపతులు కూడా హానీమూన్ కోసం ఫిన్లాండ్ వెళ్లారన్న సంగతి తెలిసిందే.
Velishala Suresh is Journlist and a Web Admin and is working with our organisation from last 4 years and he has good knowledge on Content uploads and Content Management in website.
Read MoreWeb Title: Lavanya tripathi varun tej honeymoon in sentimental place
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com