https://oktelugu.com/

Allu Arjun: సూపర్ స్టార్ ను దాటేసిన ఐకాన్ స్టార్ !

Allu Arjun: ఇది డిజిటల్ యుగం.. పైగా ఇది డిజిటల్ జనరేషన్.. ఈ కాలంలో ముఖ్యంగా సోష‌ల్ మీడియా ఎకౌంట్ లో ఫాలోవ‌ర్స్ ఎంత ఎక్కవ మంది ఉంటే, వాళ్లకు అంత‌ గొప్ప పాపులారిటీ ఉందని అంచనా వేసే రోజులు ఇవి. అందుకే, ఎంత గొప్ప స్టార్స్ అయినా ఫేస్ బుక్ దగ్గర నుంచి ఇన్ స్టా, ట్విట్ట‌ర్ లాంటి మాధ్య‌మాల్లో ఫాలోయింగ్ కోసం బాగా తాపత్రయపడుతూ ఉంటారు.   ఇప్పటికే, సీనియర్ హీరోలు చిరంజీవి, మోహన్ […]

Written By:
  • Shiva
  • , Updated On : February 4, 2022 / 10:53 AM IST
    Follow us on

    Allu Arjun: ఇది డిజిటల్ యుగం.. పైగా ఇది డిజిటల్ జనరేషన్.. ఈ కాలంలో ముఖ్యంగా సోష‌ల్ మీడియా ఎకౌంట్ లో ఫాలోవ‌ర్స్ ఎంత ఎక్కవ మంది ఉంటే, వాళ్లకు అంత‌ గొప్ప పాపులారిటీ ఉందని అంచనా వేసే రోజులు ఇవి. అందుకే, ఎంత గొప్ప స్టార్స్ అయినా ఫేస్ బుక్ దగ్గర నుంచి ఇన్ స్టా, ట్విట్ట‌ర్ లాంటి మాధ్య‌మాల్లో ఫాలోయింగ్ కోసం బాగా తాపత్రయపడుతూ ఉంటారు.

    Allu Arjun

     

    ఇప్పటికే, సీనియర్ హీరోలు చిరంజీవి, మోహన్ బాబు, నాగ్, వెంకీ.. చివరికీ రాజశేఖర్ కూడా సోషల్ మీడియాలోకి ఎంట్రీ ఇచ్చారు. ఎంట్రీ ఇవ్వడంతో పాటు ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్ డేట్స్ తో అభిమానులను ఉత్తేజపరుస్తూ ఫాలోవర్స్ ను పెంచుకునే పనిలో ఉన్నారు. దీనిబట్టి సోషల్ మీడియా ప్రభావం అర్ధం చేసుకోవచ్చు.

    Also Read:  డిటర్జెంట్, గంజి పొడితో పాల తయారీ.. కల్తీ పాలను ఏ విధంగా గుర్తించాలంటే?

    అయితే తాజాగా డిజిట‌ల్లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఓ అరుదైన‌ ఘనత సాధించాడు. దక్షిణాదిలో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న రజినీకాంత్‌ ను ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చాలా ఈజీగా బీట్ చేశాడు. కాగా ట్విటర్‌ లో తలైవాకు 6.1 మిలియన్ల ఫాలోవర్లు ఉండగా బన్నీకి 6.5 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారు.

    rajini kanth

    ఇటీవలే ఇన్‌ స్టాగ్రమ్‌ లో 10 రోజుల్లోనే 1 మిలియన్ అభిమానులను సొంతం చేసుకుని మొత్తంగా 15 మిలియన్ల మంది ఫాలోవర్లను పుష్ప స్టార్ పొందడం తెలిసిందే. ఏది ఏమైనా తలైవాను ఐకాన్ స్టార్ దాటేశాడు. పైగా ఇంత వరకూ ఏ హీరో ఇంత స్పీడ్ గా అంతమంది ఫాలోవర్స్ ను సాధించలేదు.

    ఏది ఏమైనా సౌత్ ఇండియాలో ఎక్కువ మంది ఫాలోవర్స్ ఉన్న హీరోగా ఇన్‌ స్టాగ్రమ్‌ లో రికార్డు న‌మోదు చేసిన క్రెడిట్ కూడా బన్నీకే దక్కింది. పుష్ప క్రేజుతో స‌ర్రున దూసుకొచ్చిన బన్నీ ఇప్ప‌టికి సోషల్ మీడియాలో నంబ‌ర్ వ‌న్ స్థానం అందుకోవడం బన్నీ స్థాయిని పెంచేదే. బన్నీకి ఆయన టీమ్ ఫాలో అప్ ఉంటుంది. డిజిట‌ల్ టీమ్ ని ప్ర‌త్యేకించి హ్యాండిల్ చేస్తూ ఫాలోవ‌ర్స్ ని పెంచే బాధ్య‌తను ‘బన్నీ టీమ్’ చూసుకుంటుంది.

    Also Read:ఎట్టకేలకు ఉద్యోగుల ఆందోళనపై స్పందించిన పవన్ కళ్యాణ్.. ఇక పోరాటం చేస్తారా?

    Tags