https://oktelugu.com/

Mahesh Babu: మహేష్ పెళ్లి గురించి అడిగితే ఎందుకు సిగ్గు పడ్డాడు ?

Mahesh Babu: బాలయ్య ‘అన్ స్టాపబుల్’ షో ‘ఆహా’లోనే రికార్డ్ స్థాయిలో హిట్ అయింది. ఇప్పుడు ఆ షోకి మహేష్ బాబు ముఖ్య అతిథిగా వచ్చాడు. కాగా ఇప్పటికే ఈ ఎపిసోడ్ తాలూకు ప్రోమో కూడా రిలీజ్ చేశారు. తాజాగా మరో ప్రోమోను వదిలారు. అన్‌ స్టాపబుల్’ షో నుంచి వచ్చిన ఈ స్పెషల్ ప్రోమోలో బాలయ్య, మహేశ్ సరదాగా మాట్లాడుకున్నారు. పెళ్లి గురించి బాలయ్య ప్రశ్న అడగ్గానే సూపర్‌ స్టార్ సిగ్గుపడ్డాడు. మరి మహేష్ తన […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : February 4, 2022 / 11:00 AM IST
    Follow us on

    Mahesh Babu: బాలయ్య ‘అన్ స్టాపబుల్’ షో ‘ఆహా’లోనే రికార్డ్ స్థాయిలో హిట్ అయింది. ఇప్పుడు ఆ షోకి మహేష్ బాబు ముఖ్య అతిథిగా వచ్చాడు. కాగా ఇప్పటికే ఈ ఎపిసోడ్ తాలూకు ప్రోమో కూడా రిలీజ్ చేశారు. తాజాగా మరో ప్రోమోను వదిలారు. అన్‌ స్టాపబుల్’ షో నుంచి వచ్చిన ఈ స్పెషల్ ప్రోమోలో బాలయ్య, మహేశ్ సరదాగా మాట్లాడుకున్నారు. పెళ్లి గురించి బాలయ్య ప్రశ్న అడగ్గానే సూపర్‌ స్టార్ సిగ్గుపడ్డాడు.

    Balakrishna-Mahesh Babu

    మరి మహేష్ తన పెళ్లి గురించి అడిగితే ఎందుకు సిగ్గు పడ్డాడు ? అనేది ఈ ఫుల్ ఎపిసోడ్ చూస్తే గాని అర్ధం కాదు. అన్నట్టు ఈ షో ఈ రోజు రాత్రి 8 గంటలకు ‘ఆహా’లో ప్రసారం కానుంది. మొత్తానికి బాలయ్య ప్రశ్నలకు మహేశ్ బాబు సిగ్గుపడుతూ సమాధానాలు చెప్పాడట. ఇక సూపర్ స్టార్ మహేష్ బాబు పై నందమూరి బాలకృష్ణ ప్రశంసల వర్షం కురిపిస్తూ.. సోషల్ మీడియాలో ఒక మెసేజ్ పెట్టిన సంగతి తెలిసిందే.

    Also Read:  సినీ తారల తాజా ఇంట్రెస్టింగ్ పోస్ట్ లు

    సహజంగా బాలయ్య, సోషల్ మీడియాకి చాలా దూరంగా ఉంటాడు. అలాంటిది.. తన బాలయ్య పేస్ బుక్ లో మహేష్ గురించి రీసెంట్ గా కామెంట్ పెడుతూ.. ‘అద్భుతమైన నటుడు.. అంతకన్న అద్భుతమైన మనసు ఉన్న మనిషి మన సూపర్ స్టార్ మహేష్’ అని బాలయ్య పోస్ట్ చేసాడు. మొత్తానికి బాలయ్యను కూడా మహేష్ ఆకట్టుకున్నాడు.

    Mahesh Babu

    ఇక రాత్రి ప్రసారం కానున్న ఎపిసోడ్ లో బాలయ్య కామెంట్స్ మహేష్ ఫ్యాన్స్ కి ఫుల్ కిక్ ను ఇస్తాయట. ఇప్పటికే 9 ఎపిసోడ్‌ లను విజయవంతంగా పూర్తి చేసుకున్న ఈ షో మొత్తానికి గ్రాండ్‌ ఫినాలేకి రెడీ అయింది. అన్‌స్టాపబుబ్ సీజన్ ముగింపు వేడుకగా ఈ ఎపిసోడ్‌ తో ముగుస్తోంది.

    Also Read: డిటర్జెంట్, గంజి పొడితో పాల తయారీ.. కల్తీ పాలను ఏ విధంగా గుర్తించాలంటే?

    Tags