Social Updates: క్రేజీ ముద్దుగుమ్మ ‘నోరా ఫతేహి’ రెండు సింహాలతో కలిసి దిగిన ఫొటోని షేర్ చేసింది. ఈ బ్యూటీ పక్కా కమర్షియల్ హీరోయిన్ అని వేరే చెప్పక్కర్లేదు.
స్టార్ హీరోయిన్ అలియా భట్ తాను నటించిన ‘గంగూబాయి కతియావాడి’ చిత్ర ప్రమోషన్‌లో పాల్గొని చిత్ర విశేషాలను పంచుకుంది. పనిలో పనిగా పర్సనల్ విషయాలను కూడా పంచుకుంది. అన్నట్టు ఎన్టీఆర్ సినిమా గురించి కూడా కామెంట్స్ చేసింది.
హోమ్లీ పాప అనుపమ పరమేశ్వరన్ ఈ మధ్య తనలోని కొత్త కొత్త యాంగిల్స్ పరిచయం చేస్తోంది. ‘నేను పెయింటర్‌ని కాదు’ అంటూనే ఓ వీడియో ద్వారా తన పెయింటింగ్ ప్రతిభను ఘనంగా సగర్వంగా చాటుకుంది.
దట్టమైన మంచులో ఫొటో దిగింది రకుల్ ప్రీత్ సింగ్. ఓ సినిమా షూటింగ్ లో భాగంగా ఈ బ్యూటీ ఈ స్టిల్ ను క్లిక్‌మనిపించింది.
అందాల భామ త్రిదా చౌదరి స్టైలిష్ లుక్ కోసం డిఫరెంట్ ఫోజు పెట్టింది. ఇలా మరి కొందరు తారలు నెటిజన్లతో పంచుకున్న ఆ ఆసక్తికర వీడియోలు, ఇంట్రెస్టింగ్ ఫోటోల విశేషాలు విషయాలు మీకోసం…