Laila OTT
Laila OTT: లైలా మూవీలో విశ్వక్ సేన్ డ్యూయల్ రోల్ చేశాడు. అమ్మాయి గెటప్ ఆయనకు బాగా సూట్ అయ్యింది. గ్లామరస్ లుక్ లో కట్టిపడేసాడు. లైలా చిత్రానికి రామ్ నారాయణ్ దర్శకత్వం వహించాడు. ఆకాంక్ష శర్మ హీరోయిన్ గా నటించింది. ఫిబ్రవరి 14న ప్రేమికుల రోజును పురస్కరించుకుని లైలా చిత్రాన్ని విడుదల చేశారు. లైలా మూవీ ఆశించిన స్థాయిలో ఆడలేదు. మొదటి షో నుండే నెగిటివ్ టాక్ తెచ్చుకుంది. కామెడీ వల్గర్ గా ఉంది. సినిమాలో కంటెంట్ లేదనే విమర్శలు వినిపించాయి.
Also Read: చిక్కుల్లో రాజా సాబ్… ప్రభాస్ ఫ్యాన్స్ కి బ్యాడ్ న్యూస్!
విశ్వక్ సేన్ కెరీర్లో అతి తక్కువ ఓపెనింగ్స్ లైలా మూవీ రాబట్టింది. మూవీ ఆశించిన ఫలితం ఇవ్వకపోవడంతో త్వరగా ఓటీటీలో విడుదల చేశారు. అయితే రెండు రోజులు ఆలస్యమైంది. లైలా మార్చి 7 నుండి స్ట్రీమ్ కానుందని ప్రచారం జరిగింది. ఎట్టకేలకు లైలా ఓటీటీ లో అందుబాటులోకి వచ్చింది. లైలా ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతుంది. విశ్వక్ సేన్ ఫ్యాన్స్ కి ఇది గుడ్ న్యూస్ అనడంలో సందేహం లేదు.
లైలా కథ చెప్పాలి అంటే.. హైదరాబాద్ పాత బస్తీలో ఉండే సోను(విశ్వక్ సేన్) మోడల్. ఆయనకు ఒక పార్లర్ ఉంటుంది. మేకప్ స్పెషలిస్ట్. రుస్తుం(అభిమన్యు సింగ్) ఒక అమ్మాయిని ప్రేమించి, బెదిరించి మరీ పెళ్లి చేసుకుంటాడు. అయితే ఆ అమ్మాయి నిజంగా అందగత్తె కాదు, అంతా మేకప్ అని రుస్తుం వివాహం తర్వాత తెలుసుకుంటాడు. ఆమెకు మేకప్ వేసిన సోను మీద రుస్తుం పగ పెంచుకుంటాడు. సోను, రుస్తుం మధ్య వార్ ఎలా సాగింది? తర్వాత చోటు చేసుకున్న పరిణామాలు ఏమిటీ? అనేది కథ.
కాగా లైలా విడుదలకు ముందు వివాదాలు రాజేసింది. నటుడు 30ఇయర్స్ పృథ్వి ప్రీ రిలీజ్ వేడుకలో చేసిన కామెంట్స్ ఒక రాజకీయ పార్టీ కార్యకర్తల మనోభావాలు దెబ్బతీశాయి. వారు బాయ్ కాట్ లైలా అనే ట్యాగ్ ట్రెండ్ చేశారు. పృథ్వి క్షమాపణలు చెప్పినా వారు శాంతించలేదు. విశ్వక్ సేన్ మిడిల్ ఫింగర్ ఇంస్టాగ్రామ్ స్టేటస్ లో పెట్టడం కూడా వివాదాన్ని మరింత పెద్దది చేసింది. మొత్తంగా లైలా వివాదాలతో వార్తల్లో నిలిచింది. ఫలితం పరంగా నిరాశపరిచింది.
Web Title: Laila ott release date and platform
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com