Champions Trophy 2025 Final: చాంపియన్స్ ట్రోఫీని టీమ్ ఇండియా గెలవడంతో ప్రపంచ వ్యాప్తంగా ప్రశంసలు లభిస్తున్నాయి.. 2017లో టీమిండియా ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్స్ వెళ్ళింది. పాకిస్తాన్ చేతిలో ఓటమిపాలైంది. ఆ ఓటమి ద్వారా టీమిండియా తీవ్రంగా ఇబ్బంది పడింది. తీవ్రస్థాయిలో విమర్శలు ఎదుర్కొంది. దీంతో ఈసారి ఎలాగైనా గట్టిగా కొట్టాలని నిర్ణయించుకుంది. ఇందులో భాగంగానే 2025లో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీని గెలుచుకుంది.
Also Read: టీమిండియా గెలుపు.. ఆఫ్ఘనిస్తాన్ లో సంబరాలు అంబరాన్నంటాయి.. వైరల్ వీడియో
ఛాంపియన్స్ ట్రోఫీలో టీమిండియా గ్రూప్ – ఏ లో ఉంది.. బంగ్లాదేశ్, పాకిస్తాన్, న్యూజిలాండ్ జట్లపై గ్రూప్ దశలో గెలిచింది. ఆస్ట్రేలియాపై సెమి ఫైనల్ మ్యాచ్లో విజయం సాధించింది. ఫైనల్ మ్యాచ్లో న్యూజిలాండ్ జట్టుపై నాలుగు వికెట్ల తేడాతో గ్రాండ్ విక్టరీని అందుకుంది. తద్వారా 2017లో ఎదురైన ఓటమికి ఈ గెలుపు ద్వారా బదులు తీర్చుకుంది. దుబాయ్ వేదికగా జరిగిన మ్యాచ్లో టీమిండియా న్యూజిలాండ్ జట్టుపై అన్ని రంగాలలో పై చేయి సాధించింది. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ విభాగాలలో సత్తా చాటింది. తద్వారా టీమిండియా మూడవసారి ఛాంపియన్స్ ట్రోఫీని అందుకుంది. 2002లో శ్రీలంక జట్టుతో, 2013లో, ఇప్పుడు న్యూజిలాండ్ జట్టుపై విజయం సాధించి.. మూడవసారి ఛాంపియన్స్ ట్రోఫీ దక్కించుకున్న జట్టుగా భారత్ నిలిచింది. తద్వారా ఈ ఘనత అందుకున్న తొలి టీం గా భారత్ రికార్డు సృష్టించింది.
ఛాంపియన్స్ ట్రోఫీ ద్వారా….
ఛాంపియన్స్ ట్రోఫీ గెలుచుకోవడం ద్వారా భారత్ 19.5 కోట్ల ప్రైజ్ మనీని గెలుచుకుంది.. క్రికెట్ విస్తరణ కోసం ఐసీసీ ఈసారి ప్రైజ్ మనీ పెంచింది. విజేత జట్టుకు 19.5 కోట్లు అందించింది. ఇక చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ లో ఆడటం ద్వారా ఒక్కో టీమిండియా ఆటగాడికి 1,50,000 ఫీజు లభించింది. గ్రూపు దశలో విజయాలు సాధించడం ద్వారా ఒక్కో ఆటగాడికి 13 లక్షల దాకా లభించాయి. ఇక అద్భుతమైన ప్రదర్శన చేసిన ఆటగాళ్లకు అదనపు ప్రోత్సాహకాలను ఐసీసీ అందించింది. ఇలా ఒక ఆటగాడికి 50,000 చొప్పున ఐసీసీ అందించింది. ఇలా ప్రోత్సాహకాల కోసం 4.35 కోట్లను ఐసీసీ ఖర్చు పెట్టింది.
భారత ఆటగాళ్లకు ఎంత లభించిందంటే..
భారత ఆటగాళ్లకు నగదు తో పాటు దాదాపు 6 గ్రాముల బంగారంతో పూత పూసిన హై గ్రేడ్ వెండితో తయారుచేసిన స్మారక పత లోకాన్ని ఐసీసీ అందించింది. ఈ మెడల్ బరువు దాదాపు 270 గ్రాముల వరకు ఉంటుంది. దీని విలువ 43,500 వరకు ఉంటుందని తెలుస్తోంది. ఇక కోకా కోలా, ఫ్యాన్ క్రేజ్ వంటి స్పాన్సర్లు ఎక్కువ ఆటగాడికి 4.3 లక్షల విలువైన ప్రీమియం వస్తువులను, డిజిటల్ పరికరాలను అందించాయి. టోర్ని మొత్తం వచ్చిన ఆదాయాలను లెక్కలకు తీసుకుంటే సగటు టీమ్ ఇండియా ఆటగాడు దాదాపు 1.74 కోట్లు సంపాదించాడు. టి20 వరల్డ్ కప్ గెలిచినప్పుడు ఆటగాళ్లకు ఒక్కో ఆటగాడికి బీసీసీఐ ఐదు కోట్ల చొప్పున నజరానా ప్రకటించింది. అయితే ఇప్పుడు బీసీసీఐ ప్రత్యేకంగా నజరానా ప్రకటించకపోయినప్పటికీ.. ఛాంపియన్స్ ట్రోఫీ గెలవడం ద్వారా టీమిండియా ఆటగాళ్లకు భారీగానే ప్రైజ్ మనీ.. ఇతర బహుమతులు లభించాయి. ప్రైజ్ మనీ, బహుమతులను పక్కన పెడితే చాంపియన్స్ ట్రోఫీలో గెలవడమే తమకు గొప్ప పురస్కారమని టీమిండి ఆటగాళ్లు పేర్కొనడం విశేషం.