Devara In Japan
Devara In Japan: రాజమౌళితో సినిమా చేసిన హీరో నెక్స్ట్ మూవీ డిజాస్టర్ అవుతుంది. ఈ సెంటిమెంట్ ని ఎన్టీఆర్ బ్రేక్ చేశాడు. ఆర్ ఆర్ ఆర్ తో పాన్ ఇండియా హిట్ కొట్టాడు ఎన్టీఆర్. ఆర్ ఆర్ ఆర్ మల్టీస్టారర్ కాగా రామ్ చరణ్, ఎన్టీఆర్ స్క్రీన్ షేర్ చేసుకున్నారు. రామ్ చరణ్ మాత్రం రాజమౌళి బ్యాడ్ సెంటిమెంట్ నుండి తప్పించుకోలేకపోయాడు. ఆచార్య, గేమ్ ఛేంజర్ చిత్రాల రూపంలో ఆయనకు ప్లాప్స్ పడ్డాయి. ఎన్టీఆర్ నటించిన దేవర ఇండస్ట్రీ హిట్ కొట్టింది. వరల్డ్ వైడ్ దేవర రూ. 500 కోట్ల వసూళ్లు నమోదు చేసింది.
Also Read: చిక్కుల్లో రాజా సాబ్… ప్రభాస్ ఫ్యాన్స్ కి బ్యాడ్ న్యూస్!
తెలుగు రాష్ట్రాల్లో దేవరకు భారీ ఆదరణ దక్కింది. హిందీ వెర్షన్ సైతం చెప్పుకోదగ్గ వసూళ్లు రాబట్టింది. దేవర నార్త్ లో రూ. 60 కోట్ల వరకు వసూలు చేసింది. కాగా దేవర చిత్రాన్ని జపాన్ లో విడుదల చేయనున్నారు. మార్చి 28న జపాన్ భాషలో అక్కడ రిలీజ్ కానుంది. ఎన్టీఆర్ కి అక్కడ ఫ్యాన్ బేస్ ఉంది. జపాన్ లో స్టార్డం తెచ్చుకున్న మొదటి హీరో రజినీకాంత్. తర్వాత ఎన్టీఆర్ సినిమాలు అక్కడ జనాలు చూస్తారు. బాహుబలి చిత్రాలతో ప్రభాస్ కి సైతం జపాన్ లో ఫ్యాన్స్ బేస్ ఏర్పడింది.
రజినీకాంత్ నటించిన ముత్తు అత్యధిక వసూళ్లు సాధించిన ఇండియన్ మూవీగా ఉంది. దశాబ్దాల పాటు ఈ రికార్డు బ్రేక్ కాలేదు. ఎట్టకేలకు ఆర్ ఆర్ ఆర్ మూవీ ముత్తు రికార్డును అధిగమించింది. ప్రస్తుతానికి ఆర్ ఆర్ ఆర్ జపాన్ లో హైయెస్ట్ కలెక్షన్స్ అనుకున్న భారతీయ చిత్రం. సోలోగా ఆర్ ఆర్ ఆర్ రికార్డును దేవరతో ఎన్టీఆర్ కొట్టగలడా లేదా? అనే చర్చ మొదలైంది. ఎన్టీఆర్ కి ఇది అసలైన పరీక్ష. ఆర్ ఆర్ ఆర్ రికార్డును టచ్ చేయలేకపోయినా.. కనీసం ముత్తు రికార్డును ఎన్టీఆర్ అధిగమించాలి. అప్పుడే ఎన్టీఆర్ కి జపాన్ లో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందని రుజువు అవుతుంది.
దేవర చిత్రాన్ని జపాన్ లో హిట్ చేయాలని మూవీ టీం భావిస్తుంది. త్వరలో ఎన్టీఆర్ జపాన్ వెళ్లనున్నాడట. అక్కడ గట్టిగా ప్రమోషన్స్ నిర్వహించనున్నాడట. ఈ మేరకు విశ్వసనీయ సమాచారం అందుతుంది. దేవర చిత్రానికి కొరటాల శివ దర్శకుడు. జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటించింది. అనిరుధ్ రవిచంద్రన్ మ్యూజిక్ అందించారు.
Web Title: The movie team hopes to make devara movie hit in japan
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com