Tholi Prema Re-release 2025: పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) కెరీర్ లో ఆల్ టైం క్లాసిక్ లవ్ స్టోరీ గా పేరు తెచ్చుకున్న ‘తొలిప్రేమ'(Toliprema Movie) చిత్రం ఇప్పటి వరకు ఎన్ని సార్లు రీ రిలీజ్ అయ్యిందో లెక్కే లేదు. అప్పట్లో ఆ సినిమా నైజాం ప్రాంత బయ్యర్ దిల్ రాజు తనకు డబ్బులు అవసరమైనప్పుడల్లా ఈ చిత్రాన్ని రీ రిలీజ్ చేసుకునేవాడు. చేసిన ప్రతీసారీ భారీ స్థాయి వసూళ్లు వస్తుండేవి. రీసెంట్ గా ఈ చిత్రం 2023 వ సంవత్సరం లో వాలెంటైన్స్ డే సందర్భంగా విడుదలైంది. అప్పట్లో అభిమానులు ఈ చిత్రాన్ని పెద్దగా సపోర్ట్ చేయలేదు. ఎందుకంటే థర్డ్ పార్టీ రీ రిలీజ్ లను ప్రోత్సహించకూడదు అని అప్పట్లో పవన్ కళ్యాణ్ కి సంబంధించిన ఫ్యాన్ పేజెస్ మొత్తం ఒక నిర్ణయానికి వచ్చాయి. అందుకే స్ట్రిక్ట్ గా ఈ చిత్రాన్ని బ్యాన్ చెయ్యాలంటూ ప్రచారం చేసారు. కానీ అభిమానుల సపోర్ట్ లేకపోయినా మామూలు ఆడియన్స్ సపోర్ట్ ఈ చిత్రానికి మెండుగా ఉంది.
Also Read: Pawan Kalyan: నవంబర్ నెల నుండి పవన్ కళ్యాణ్ మరో కొత్త సినిమా మొదలు..డైరెక్టర్ ఎవరంటే!
అందుకే రెస్పాన్స్ అదిరిపోయింది. దాదాపుగా కోటి 40 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లను ఈ చిత్రం రాబట్టింది. దీనిని బట్టీ మూవీ లవర్స్ లో ఈ చిత్రానికి ఉన్న క్రేజ్ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. అయితే ఇప్పుడు సమయం సందర్భం లేకుండా కేవలం థియేటర్స్ ఫీడింగ్ కోసం మరోసారి రేపు ఈ చిత్రాన్ని థర్డ్ పార్టీ వారు గ్రాండ్ గా రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈసారి అభిమానులే కాదు మూవీ లవర్స్ కూడా ఈ చిత్రాన్ని అంతగా పట్టించుకోలేదు. ట్రేడ్ పండితులు అందిస్తున్న సమాచారం ప్రకారం ఈ చిత్రానికి మొదటి రోజు అడ్వాన్స్ బుకింగ్స్ ఇండియా వైడ్ గా అన్ని ప్రాంతాలకు కలిపి 30 లక్షల రూపాయలకు జరిగినట్టు తెలుస్తుంది. అందులో కేవలం హైదరాబాద్ సిటీ నుండి 15 లక్షల గ్రాస్ వచ్చినట్టు సమాచారం.
Also Read: Chandrababu And Pawan Kalyan: చంద్రబాబు,పవన్ కళ్యాణ్ లతో తెలుగు సినీ హీరోల అత్యవసర భేటీ..కారణం ఏమిటంటే!
ఇది డీసెంట్ స్థాయి రెస్పాన్స్ అని అనొచ్చు. మిగిలిన ప్రాంతాల్లో యావరేజ్ రేంజ్ రెస్పాన్స్ ని సొంతం చేసుకుంది. ఓవరాల్ గా ప్రస్తుతం ఉన్న ట్రెండ్ ప్రకారం చూస్తే ఈ చిత్రానికి మొదటి రోజు 70 లక్షల రూపాయిల రేంజ్ గ్రాస్ వసూళ్లు వస్తాయని ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఓవరాల్ ఫుల్ రన్ లో కోటి రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు రావొచ్చు. ఇప్పుడు కాకుండా పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు నాడు ఈ ఆల్ టైం క్లాసిక్ చిత్రాన్ని రీ రిలీజ్ చేసుంటే కలెక్షన్స్ వేరే లెవెల్ లో వచ్చేదని, గబ్బర్ సింగ్ రీ రిలీజ్ రికార్డ్స్ బద్దలు అయ్యేవని అంటున్నారు అభిమానులు. బాక్స్ ఆఫీస్ వద్ద వండర్స్ క్రియేట్ చేసే సత్తా ఉన్న ఈ సినిమాని అనవసరంగా వృధా చేస్తున్నారంటూ మండిపడుతున్నారు. ఓవరాల్ గా రెండు రీ రిలీజ్ వసూళ్లను కలుపుకొని చూస్తే ఈ చిత్రం 2 కోట్ల 40 లక్షల గ్రాస్ వసూళ్లను రాబట్టింది అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు.