Dil Raju: యూట్యూబ్ లో ఈమధ్య కాలం లో చిన్న హీరోల సినిమాలకు సంబంధించిన టీజర్స్, ట్రైలర్స్ లకు కూడా కోట్ల సంఖ్యలో వ్యూస్ రావడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. ఒకప్పుడు బాహుబలి లాంటి భారీ బడ్జెట్ సినిమాలకు మాత్రమే ఇలాంటి వ్యూస్ వస్తుండేవి. కానీ ఇప్పుడు మాత్రం ఊరు పేరు తెలియని హీరోలకు కూడా మిలియన్ల సంఖ్యలో వ్యూస్ వస్తున్నాయి. మరి ఇంత వ్యూస్ వస్తున్నాయి కదా?, అంటే సినిమా మీద జనాల్లో అంచనాలు విపరీతంగా ఉన్నట్టు లెక్క, కానీ ఎందుకు కలెక్షన్స్ మాత్రం ఆ స్థాయిలో రావడం లేదు?, ఎక్కడ పొరపాటు జరుగుతుంది అంటూ విశ్లేషకులు సైతం తలపట్టుకునేవారు. అయితే ఈ వ్యూస్ వెనుక దాగున్న అసలు రహస్యాన్ని నిన్న నిర్మాత దిల్ రాజు(Dil Raju) తన కొత్త సినిమా ‘తమ్ముడు'(Thammudu Movie) ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో బయటపెట్టేసాడు.
Read Also: నవంబర్ నెల నుండి పవన్ కళ్యాణ్ మరో కొత్త సినిమా మొదలు..డైరెక్టర్ ఎవరంటే!
ఆయన మాట్లాడుతూ ‘నేను నా తమ్ముడు సినిమా ట్రైలర్ కి వ్యూస్ మిలియన్ల సంఖ్యలో కొనొద్దని చెప్పేసాను. ఇలా వ్యూస్ ని కొనడం వల్ల ఒక సినిమాపై జనాల్లో నిజంగా ఎలాంటి అభిప్రాయం ఉంది అనేది స్పష్టంగా అర్థం అవ్వడం లేదు. మొన్న నాకు తెలిసిన వాళ్ళు కూడా ఈ విషయాన్ని అడిగారు. ఇంత చిన్న సినిమా టీజర్ కి 10 మిలియన్ వ్యూస్ వచ్చాయా?, అబ్బో అని అన్నారు. వాళ్ళకేమి తెలుసు అది కొనుక్కున్న వ్యూస్ అని. ఈరోజు మీ అందరికీ తమ్ముడు ట్రైలర్ ని ఉదయమే చూపించాను. అందరూ చాలా బాగుంది అంటూ చెప్పుకొచ్చారు. మీ నుండి రెస్పాన్స్ ఓకే, ఆడియన్స్ నుండి నిజంగా ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది అనేది తెలుసుకోవాలని అనుకున్నాను. అందుకే ఈ ట్రైలర్ కి వ్యూస్ ని కొనలేదు’ అంటూ చెప్పుకొచ్చాడు దిల్ రాజు. ఆయన మాట్లాడిన ఈ మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో అనేక మందిని ఆశ్చర్యాన్ని కలిగించేలా చేశాయి.
Read Also: ఆర్సీబీ ని కొంటున్న కర్ణాటక ఉప ముఖ్యమంత్రి..ఇదిగో క్లారిటీ
అలా కొన్న వ్యూస్ సహకారం లేకుండా గడిచిన 20 గంటల్లో తమ్ముడు మూవీ ట్రైలర్ కి 18 లక్షలకు పైగా వ్యూస్, 80 వేలకు పైగా లైక్స్ వచ్చాయి. ఒకవేళ వ్యూస్ ని కొని ఉండుంటే ఈ పాటికి 15 మిలియన్ వ్యూస్ ఉండేవి. స్టార్ హీరోలకు ఫేక్ లేకుండా 8 మిలియన్ వ్యూస్ 24 గంటల్లో వస్తుంటాయి. ఇది అసలు సిసలు రియాలిటీ. అభిమానులు ఇక నుండి మీ అభిమాన హీరోలకు 20 మిలియన్ వ్యూస్, 40 మిలియన్ వ్యూస్ వస్తే అవి నిజమని నమ్మకండి. వాస్తవం ఇదే ఏ హీరో సినిమాకి అయినా. కేవలం కొన్ని చిత్రాలకు మాత్రమే ఒరిజినల్ 20 , 30 మిలియన్ వ్యూస్ వస్తుంటాయి. ఇదే ట్రెండ్ ని మీ రాబోయే సినిమాలకు కూడా కొనసాగిస్తారా అని దిల్ రాజు ని రిపోర్ట్స్ అడగ్గా, మీరు సహకారం అందిస్తే కచ్చితంగా అనుసరిస్తాను అంటూ చెప్పుకొచ్చాడు.