Kubera Movie Climax: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు చాలామంది దర్శకులు వాళ్ళను వాళ్ళు స్టార్ డైరెక్టర్లుగా ఎలివేట్ చేసుకోవాలనే ప్రయత్నం చేస్తున్నారు. రాజమౌళి (Rajamouli) లాంటి దర్శకుడు పాన్ ఇండియా పరిధిని దాటి పాన్ వరల్డ్ లోకి ఎంట్రీ ఇస్తున్న సందర్భంలో మిగతా దర్శకులందరు అతని బాటలోనే నడవాలనే ప్రయత్నం చేస్తున్నారు… ప్రస్తుతం శేఖర్ కమ్ముల (Shekar Kammula) స్టార్ హీరో అయిన ధనుష్ (Dhanush) ను లీడ్ రోల్ లో పెట్టి చేసిన కుబేర సినిమా రీసెంట్ గా రిలీజ్ ఆయన పాజిటివ్ టాక్ ను సంపాదించుకొని ముందుకు సాగుతోంది. నిజానికి ఈ సినిమా బ్లాక్ బస్టర్ టాక్ ను సొంతం చేసుకోవాలి. కానీ అలా కాకుండా కేవలం ఎబో యావరేజ్ గా ఉంది అంటూ ప్రేక్షకుల నుంచి స్పందన అయితే వస్తుంది.
మరి ఇలాంటి సందర్భంలో ఈ సినిమా క్లైమాక్స్ విషయంలో ఇంకాస్త జాగ్రత్తలు తీసుకొని ఉంటే ఈ సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచేదని సినిమా మేధావులు సైతం వాళ్ళ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు. నిజానికి ఈ సినిమాలో తన స్వార్థానికి నాగార్జున ధనుష్ ని వాడుకుంటూ ఉంటాడు. ఇక నాగార్జున క్యారెక్టర్ లో రియలైజేషన్ అనేది చూపించకుండా అతన్ని ఒక స్వార్ధపరుడు అనేలా చిత్రీకరించి చివరికి అతన్ని చంపేశారు.
దీనివల్ల సినిమా క్లైమాక్స్ అనేది అసంతృప్తిగా ముగిసిపోయింది. అలాగే ఆ డబ్బులన్నింటిని ఏం చేశారు అనేదానికి ఒక జష్టిఫికేషన్ అయితే ఇవ్వలేకపోయారు. దీనివల్ల ఇదంతా చూసిన ప్రేక్షకుడు పూర్తి సంతోషంగా అయితే థియేటర్ నుంచి బయటికి రాలేకపోయాడు. మరి ఇలాంటి విషయాల మీద డైరెక్టర్ ఇంకా కొంచెం జాగ్రత్తలు తీసుకొని ఉంటే సినిమా బ్లాక్ బస్టర్ అయ్యేది…
Also Read: Kubera Movie : ‘కుబేర’ టీంతో నాగ చైతన్య స్పెషల్ ఇంటర్వ్యూ..తండ్రి పైనే పంచులు వేసిన నాగ చైతన్య!
ఇక నాగచైతన్య సాయి పల్లవిలను పెట్టి చేసిన లవ్ స్టోరీ (Love Story) సినిమా విషయంలో కూడా శేఖర్ కమ్ముల ఇదే ఫాలో అయ్యాడు. సినిమా మొత్తం లవ్ స్టోరీ మీద ఫోకస్ చేస్తూ వెళ్లిన ఆయన చివర్లో రాజీవ్ కనకాల ఎపిసోడ్ ను రివిల్ చేసిన విధానం అయితే అసలు బాగాలేదు. ఇక ఈ సినిమాలో కూడా నాగార్జున క్యారెక్టర్ ను బతికించి చివరికి డబ్బులను ఏం చేశారు అనేది చూపిస్తే సినిమా బ్లాక్ బస్టర్ అయ్యేది…మరి డైరెక్టర్ ఇలా పెట్టడానికి ఇంకేదైనా కారణం అయి ఉండవచ్చు…మొత్తానికైతే తెలుగులో చాలా రోజుల గ్యాప్ తర్వాత వచ్చిన పెద్ద సినిమా పాజిటివ్ టాక్ ను సంపాదించుకోవడం అందరికీ ఆనందాన్ని కలిగిస్తుంది…