Homeఎంటర్టైన్మెంట్స్టార్ హీరోకి అవమానం.. క్రిటిక్ పై ఫ్యాన్స్ ఫైర్ !

స్టార్ హీరోకి అవమానం.. క్రిటిక్ పై ఫ్యాన్స్ ఫైర్ !

బాలీవుడ్‌ మోస్ట్‌ హాట్ బ్యూటీ ‘దిశా పటానీ’ పుట్టినరోజు నేడు. ప్రస్తుతం హిందీలో వరుస సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉన్న ఈ హాట్ భామకి సోషల్ మీడియాలో అభిమానులు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పడానికి పోటీ పడుతున్నారు. ఈ క్రమంలో ఫిల్మ్ క్రిటిక్ కమల్‌ ఆర్‌ ఖాన్‌(కేఆర్‌కే) దిశాకు పుట్టినరోజు విషెస్ తెలియజేస్తూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. పైగా ఆ వ్యాఖ్యలు బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ను ఉద్దేశించి చేయడంతో, ఇప్పుడు ఈ […]

బాలీవుడ్‌ మోస్ట్‌ హాట్ బ్యూటీ ‘దిశా పటానీ’ పుట్టినరోజు నేడు. ప్రస్తుతం హిందీలో వరుస సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉన్న ఈ హాట్ భామకి సోషల్ మీడియాలో అభిమానులు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పడానికి పోటీ పడుతున్నారు. ఈ క్రమంలో ఫిల్మ్ క్రిటిక్ కమల్‌ ఆర్‌ ఖాన్‌(కేఆర్‌కే) దిశాకు పుట్టినరోజు విషెస్ తెలియజేస్తూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు.

పైగా ఆ వ్యాఖ్యలు బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ను ఉద్దేశించి చేయడంతో, ఇప్పుడు ఈ కామెంట్స్ హాట్ టాపిక్ అయ్యాయి. కేఆర్కే చేసిన కామెంట్స్ ఏమిటంటే.. ‘డియర్ దిశా పటానీకి బర్త్ డే విషెస్. ముసలి హీరోల సరసన నువ్వు చాలా భయంకరంగా కనిపిస్తున్నావు. అందుకే, ఇక నుండి నువ్వు కేవలం టైగర్‌ పక్కన మాత్రమే నటిస్తే బాగుంటుంది” అంటూ కేఆర్‌కే, సల్మాన్ ను అవమానిస్తూ ట్వీట్ చేశాడు.

ఈ ట్వీట్ పై సల్మాన్ ఖాన్ అభిమానులు విరుచుకుపడుతున్నారు. ‘రాధే’ సినిమా పై తనకు అనుకూలంగా రివ్యూ ఇవ్వనందుకే సల్మాన్‌ ఖాన్ తన మీద కేసు వేయించాడని, అయినా తానూ తగ్గను అని కేఆర్‌కే చెప్పుకొచ్చాడు. హిందీ పరిశ్రమలో కేఆర్‌కే రివ్యూస్ కి విలువ ఉంది. కానీ, విమర్శలను సంధించడంలో కేఆర్‌కే ఆరితేరిపోయాడు. దాంతో బాలీవుడ్ ఫిల్మ్ మేకర్స్ దృష్టిలో కేఆర్‌కే విలన్ గా నిలుస్తున్నాడు.

ఇక కేఆర్‌కే పై కేసు వేయడానికి కారణం, రివ్యూ బ్యాడ్ గా ఇచ్చినందుకు కాదు అని, సల్మాన్ పై అనవసరంగా మనీలాండరింగ్‌ ఆరోపణలు చేసినందుకు గానూ కేసు వేశామని సల్మాన్‌ ఖాన్ లాయర్‌ ఇప్పటికే క్లారిటీ ఇచ్చాడు. అన్నట్టు దిశా పటానీ సల్మాన్ సినిమాల్లో వరుసగా నటిస్తోంది. అలాగే ప్రస్తుతం ఈ అమ్మడు టైగర్‌ ష్రాఫ్‌ ను కొంతకాలంగా ఘాడంగా ప్రేమిస్తోంది.

admin
adminhttps://oktelugu.com/
Editor, He is Working from Past 3 Years in this Organization, He is the incharge of News content and Looks after the overall Content Management.

Related News

Most Popular

Oktelugu Epaper