Bollywood Vs Tollywood: పాన్ ఇండియా సినిమా ఇండస్ట్రీలో తెలుగు హీరోలు వాళ్ళకంటూ ఒక ఐడెంటిటి సంపాదించుకుంటూ ముందుకు దూసుకెళ్తున్నారు… అలాగే తెలుగు సినిమా ఇండస్ట్రీని టాప్ లెవెల్ కి తీసుకెళ్లారు. ఇక బాలీవుడ్ ఇండస్ట్రీ సైతం తెలుగు సినిమా ఇండస్ట్రీ తో పోటీ పడలేక చతికల పడిపోయింది. గత కొన్ని సంవత్సరాలు నుంచి ఇదే సీను రిపీట్ అవుతున్నప్పటికి 2025వ సంవత్సరంలో మాత్రం టాలీవుడ్ ఇండస్ట్రీని బాలీవుడ్ డామినేట్ చేసిందనే చెప్పాలి. టాలీవుడ్ లో ఓజీ, సంక్రాంతికి వస్తున్నాం లాంటి సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చినప్పటికి ఈ రెండు సినిమాలు సైతం భారీ విజయాలను అందుకున్నాయి. కానీ 500 కోట్ల వరకు కలెక్షన్లు మాత్రమే రాబట్టాయి… కానీ బాలీవుడ్ ఇండస్ట్రీలో వచ్చిన సినిమాలు 1000 కొట్లకు పైన కలెక్షన్స్ రాబట్టాయి. అలాగే చావా 1000 కోట్లకు పైన కలెక్షన్స్ ను కొల్లగొట్టింది. సయ్యారా సినిమా సైతం 1000 కోట్లకు పైన కలెక్షన్స్ ని రాబట్టడం విశేషం…
ఇక రీసెంట్ గా వచ్చిన ‘దురంధర్’ సినిమా సైతం 1000 కోట్లకు పైన కలెక్షన్స్ ని కొల్లగొట్టి బాలీవుడ్ ఇండస్ట్రీ స్థాయిని మరోసారి పెంచిందనే చెప్పాలి. ఈ సంవత్సరంలో బాలీవుడ్ ఇండస్ట్రీ భారీ కలెక్షన్స్ ని కొల్లగొడుతూ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో పలు రికార్డులను సైతం క్రియేట్ చేసింది.
కాబట్టి తెలుగు సినిమా ఇండస్ట్రీ కొంత వరకు వెనకబడిపోయిందనే చెప్పాలి. ఇక 2026వ సంవత్సరంలోనైనా మంచి సినిమాలు చేస్తూ మనవాళ్లు భారీ సక్సెస్లను సాధిస్తూ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో గొప్ప విజయాలను సాధించి పెడతారా? లేదా అనేది తెలియాల్సి ఉంది…
2026వ సంవత్సరంలో మన సినిమాలకు గొప్ప ఆదరణ దక్కితే మాత్రం టాలీవుడ్ ఇండస్ట్రీ ఇండియాలో నెంబర్ వన్ ఇండస్ట్రీ గా పాతుకు పోతుందని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు… స్టార్ హీరోలందరు మూకుమ్మడిగా వస్తున్నారు. కాబట్టి తెలుగు సినిమా హవ భారీ రేంజ్ లో కొనసాగే అవకాశాలైతే ఉన్నాయి…చూడాలి మరి కొత్త సంవత్సరంలో మన హీరోలు, దర్శకులు వాళ్ల సత్తా చాటుతారా లేదా అనేది…