https://oktelugu.com/

Kriti Shetty : టాలీవుడ్ కి ‘గుడ్ బై’ చెప్పేసిన కృతి శెట్టి.. కనీసం అక్కడైనా కెరీర్ ఉంటుందా?

కృతి శెట్టి చివరిగా 'మనమే' అనే చిత్రం ద్వారా మన తెలుగు ఆడియన్స్ కి కనిపించింది. ఆ తర్వాత ఈమె పూర్తిగా తన మకాం మార్చేసింది. మలయాళం లో ARM అనే చిత్రం చేసింది. ఇది కూడా కమర్షియల్ గా ఫ్లాప్ అయ్యింది. ఈ సినిమా తర్వాత ఆమెకు తమిళం లో మూడు సినిమాల్లో హీరోయిన్ గా నటించే అవకాశం వచ్చింది.

Written By:
  • Vicky
  • , Updated On : October 25, 2024 / 08:40 PM IST

    Kriti Shetty

    Follow us on

    Kriti Shetty : ఈమధ్య కాలం లో కొంతమంది కుర్ర హీరోయిన్స్ అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ రేంజ్ కి వచ్చేస్తున్నారు. కానీ దానిని కనీసం ఏడాది కూడా నిలబెట్టుకోలేక పోతున్నారు. సమంత కాజల్ అగర్వాల్, అనుష్క, తమన్నా వంటి హీరోయిన్స్ అందరూ కూడా తక్కువ సమయంలోనే స్టార్ స్టేటస్ ని దక్కించుకున్నారు. కానీ వాళ్ళు ఎంతమంది కొత్త హీరోయిన్స్ వచ్చినా ఇప్పటికీ అదే రేంజ్ ని స్టేటస్ ని మైంటైన్ చేస్తున్నారు. కేవలం వీళ్ళను చూసి థియేటర్స్ కి కదిలే ఆడియన్స్ సంఖ్య లక్షల్లోనే ఉంటుంది. అలాంటి స్టేటస్ ని ఇప్పటి స్టార్ హీరోయిన్స్ ని దక్కించుకోలేకపోతున్నారు. ఎంత వేగంగా ఎదిగారో, అంతే వేగంగా క్రిందకి పడిపోతున్నారు. వరుస డిజాస్టర్ ఫ్లాప్స్ రావడంతో కనుమరుగు అయిపోతున్నారు.

    అలాంటి హీరోయిన్స్ లో ముందుగా మనం ‘ఉప్పెన’ హీరోయిన్ కృతి శెట్టి గురించి మాట్లాడుకోవాలి. ఈమెకు తొలి సినిమాతోనే స్టార్ స్టేటస్ వచ్చేసింది. చూసేందుకు ఎంతో అందంగా కనిపించింది, నటన కూడా అద్భుతంగా చేసింది. ఈ అమ్మాయికి భవిష్యత్తులో ఇక తిరుగే లేదని అందరూ అనుకున్నారు. ‘ఉప్పెన’ తర్వాత చేసిన చేసిన ‘శ్యామ్ సింగ రాయ్’, ‘బంగార్రాజు’ వంటి చిత్రాలు కూడా సూపర్ హిట్ అయ్యాయి. కానీ ఆ తర్వాత వచ్చిన సినిమాలన్నీ ఒకదానిని మించి ఒకటి ఫ్లాప్ అవుతూ వచ్చాయి. దీంతో ఈ అమ్మాయికి క్రేజ్ పూర్తిగా పడిపోయింది. స్టార్ హీరోలు తమ సినిమాల్లో అవకాశాలు ఇచ్చే సంగతి పక్కన పెడితే, కనీసం మీడియం రేంజ్ హీరోలు కూడా ఈమెను తమ సినిమాల్లో హీరోయిన్ గా తీసుకునేందుకు ఇష్టపడడం లేదు. ఈమె చివరిగా ‘మనమే’ అనే చిత్రం ద్వారా మన తెలుగు ఆడియన్స్ కి కనిపించింది. ఆ తర్వాత ఈమె పూర్తిగా తన మకాం మార్చేసింది. మలయాళం లో ARM అనే చిత్రం చేసింది. ఇది కూడా కమర్షియల్ గా ఫ్లాప్ అయ్యింది. ఈ సినిమా తర్వాత ఆమెకు తమిళం లో మూడు సినిమాల్లో హీరోయిన్ గా నటించే అవకాశం వచ్చింది.

    ‘లవ్ టుడే’ ఫేమ్ ప్రదీప్ రంగనాథన్ తో ‘లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ’, జయం రవితో ‘జీనీ’, కార్తీ తో ‘వా వాతాయ్’ అనే చిత్రాలు చేస్తుంది. ఈ మూడు సినిమాలు చిత్రీకరణ దశలో ఉన్నాయి. విడుదల అయ్యాక వీటిలో ఒక్క సినిమా సూపర్ హిట్ అయినా కృతి శెట్టి మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయ్యినట్టే. ఇవి షూటింగ్ దశలో ఉన్న సమయంలోనే ఆమెకి హీరోయిన్ గా ఇంకా కొన్ని సినిమాల్లో నటించే అవకాశం వచ్చిందట. వాటిట్లో అజిత్ సినిమా కూడా ఉందని సమాచారం. టాలీవుడ్ లో ఎలాగో సక్సెస్ కాలేకపోయింది, ఇప్పుడు కనీసం కోలీవుడ్ లో అయినా ఈమె సక్సెస్ సాధిస్తుందో లేదో చూడాలి. ఒకవేళ అక్కడ సక్సెస్ అయితే, మళ్ళీ టాలీవుడ్ లో ఆమెకు అవకాశాల వెల్లువ కురవొచ్చు, చూడాలి మరి ఈమె భవిష్యత్తు ఎలా ఉండబోతుంది అనేది.