Devara : దేవర’ చిత్రం ఎన్ని సెంటర్స్ లో 50 రోజులు పూర్తి చేసుకోబోతుందో తెలుసా..? ఈ రికార్డుని భవిష్యత్తులో ఎవ్వరూ ముట్టుకోలేరేమో!

ఇక ఆంధ్ర ప్రదేశ్ లో 150 కి పైగా థియేటర్స్ లో 50 రోజులు పూర్తి చేసుకోనుంది అని, మొత్తం మీద 240 డైరెక్ట్ సెంటర్స్ లో ఈ చిత్రం 50 రోజులు నడవబోతుందని, ఇటీవల కాలంలో వచ్చిన సినిమాలన్నిట్లో ఇది ఆల్ టైం రికార్డు నిలిచిపోతుందని అంటున్నారు.

Written By: NARESH, Updated On : October 25, 2024 8:39 pm

Devara

Follow us on

Devara : ఎన్టీఆర్ నటించిన ‘దేవర’ చిత్రం ఇటీవలే భారీ అంచనాల నడుమ విడుదలై బాక్స్ ఆఫీస్ వద్ద ఎన్నో రికార్డ్స్ ని నెలకొల్పి ఎన్టీఆర్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిల్చిన సంగతి తెలిసిందే. ఫ్యాన్స్ షోస్ నుండి ఈ సినిమాకి తొలుత డివైడ్ టాక్ వచ్చింది. కారణం ఫస్ట్ హాఫ్ రేంజ్ లో సెకండ్ హాఫ్ లేకపోవడమే. కానీ ఆ చిత్రం ఫ్యామిలీ ఆడియన్స్ కి ఎక్కేసింది. ఇక వసూళ్లకు హద్దే లేకుండా పోయింది. ప్రస్తుతం నడుస్తున్న ఓటీటీ కాలం లో ఒక సినిమా మూడు వారాలు నికరంగా నిలబడి వసూళ్లు రాబట్టడం అనేది చాలా కష్టంగా మారింది. అలాంటిది ‘దేవర’ చిత్రానికి ఇప్పటికీ డీసెంట్ స్థాయి వసూళ్లు వస్తుందే ఉన్నాయి. ముఖ్యంగా వైజాగ్ వంటి సిటీస్ లో ఒక్కో థియేటర్ లో రోజుకు లక్ష రూపాయిల గ్రాస్ ని రాబడుతుంది. ఊపు చూస్తుంటే ఈ వీకెండ్ లో కూడా ఈ చిత్రానికి హౌస్ ఫుల్స్ పడేలా ఉంది.

దీపావళి రోజు కోటి రూపాయిల షేర్ వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఎన్టీఆర్ కెరీర్ లో భారీ బ్లాక్ బస్టర్ హిట్స్ ఉన్నాయి కానీ, ఈ స్థాయి లాంగ్ రన్ ఉన్న సినిమా ఒక్కటి కూడా లేదు అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. సింహాద్రి, ఆది వంటి చిత్రాలు కూడా ఇన్ని రోజులు కలెక్షన్స్ ని మైంటైన్ చేయలేదు. ‘దేవర’ చిత్రానికి ముందు ఆంధ్ర ప్రదేశ్ లో సింగిల్ స్క్రీన్ థియేటర్స్ పరిస్థితి దారుణంగా ఉండేది. కారణం పెద్ద హీరోల సినిమాలు విడుదల లేకపోవడమే. ‘దేవర’ చిత్రం విడుదలైన కూడా ప్రస్తుతం ఉన్న ట్రెండ్ కి కేవలం మూడు వారాలు మాత్రమే ఆడుతుంది, ఆ తర్వాత రన్ ఆగిపోతుంది అని అనుకున్నారు. కానీ ఈ రేంజ్ థియేట్రికల్ రన్ వస్తుందని మాత్రం ఈ సినిమాని కొన్న బయ్యర్స్ కూడా ఊహించలేదు. అయితే ‘దేవర’ చిత్రం 50 రోజుల సెంటర్స్ విషయం లో ఆల్ టైం రికార్డు నెలకొల్పే అవకాశం ఉందని అంటున్నారు ట్రేడ్ పండితులు.

ఒక్క హైదరాబాద్ సిటీ లోనే ఈ చిత్రం ప్రస్తుతం 60 థియేటర్స్ లో నడుస్తుంది. భవిష్యత్తులో పెద్ద సినిమాలు విడుదల అవ్వడం లేదు కాబట్టి ఈ థియేటర్స్ నుండి ‘దేవర’ ని తొలగించే అవకాశం లేదు. కాబట్టి కేవలం హైదరాబాద్ సిటీ లోనే 30 నుండి 40 థియేటర్స్ లో అర్థ శతదినోత్సవం జరుపుకునే అవకాశం ఉంది. అలాగే నైజాం ప్రాంతం మొత్తం కలిపి 90 థియేటర్స్ లో 50 రోజులు పూర్తి చేసుకోబోతుందట. ఇక ఆంధ్ర ప్రదేశ్ లో 150 కి పైగా థియేటర్స్ లో 50 రోజులు పూర్తి చేసుకోనుంది అని, మొత్తం మీద 240 డైరెక్ట్ సెంటర్స్ లో ఈ చిత్రం 50 రోజులు నడవబోతుందని, ఇటీవల కాలంలో వచ్చిన సినిమాలన్నిట్లో ఇది ఆల్ టైం రికార్డు నిలిచిపోతుందని అంటున్నారు.