Uttar Pradesh Transgenders: వేదం సినిమా చూశారా.. అందులో అనుష్క వేశ్యగా కనిపిస్తుంది. ఓ సన్నివేశంలో అనుష్క వెంట ఓ పాత్రధారి ఉంటుంది. ఆ పాత్ర పేరు కర్పూరం. అంటే ఈపాటికే మీకు అర్థమై ఉంటుంది.. ఆ పాత్ర ద్వారా చాలా బలమైన సన్నివేశాలను చూపించారు క్రిష్. సాధారణంగా అటువంటి వారిని మన సమాజం చీత్కరిస్తుంది. ఇప్పటికి సరైన భృతి లేక అలాంటివారు రైళ్లల్లో.. బస్సుల్లో యాచిస్తూ బతుకుతూ ఉంటారు. కొన్ని సందర్భాలలో డబ్బు సంపాదన కోసం అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతుంటారు. అడ్డగోలు వ్యవహారాలు చేస్తూ ఉంటారు.
Also Read: ‘మిరాయ్’ ట్విట్టర్ టాక్..ప్రభాస్ ఎంట్రీ కి సెన్సేషనల్ రెస్పాన్స్..సినిమా హిట్టా? ఫట్టా?
అలాంటి కొందరు చేసిన పని వల్ల.. వారి జాతి మొత్తానికి చెడ్డపేరు వస్తుంది. అందువల్లే మన సమాజం వారిని పెద్దగా లెక్కలోకి తీసుకోదు. అయితే వారు చేసిన పని ప్రస్తుతం అభినందనలకు కారణమైంది. శుభకార్యాలలో.. రైళ్లల్లో డబ్బులు డిమాండ్ చేయడం వారికి పరిపాటే. పైగా ప్రయాణికులను ఇబ్బంది పెడుతూ ఉంటారు. కొన్ని సందర్భాలలో దారుణాలకు పాల్పడుతుంటారు. అయితే అటువంటి వారిలో కొంతమంది కష్టాల్లో ఉన్నోళ్లకు సహాయం చేయడానికి ముందుకొచ్చారు. ఏకంగా 25 లక్షల విరాళం ఇచ్చారు. ఉత్తర ప్రదేశ్ లోని ఆగ్రా ప్రాంతానికి చెందిన ట్రాన్స్ జెండర్ కమ్యూనిటీ వరద బాధితుల కోసం 25 లక్షల విరాళం అందించింది. ఈ విరాళం మొత్తాన్ని వారు ఈ యాచించి ఇవ్వడం విశేషం. డబ్బుల వసూలుకు వారు ఎవరినీ ఇబ్బంది పెట్టలేదు. అయిదు లక్షలు ఇచ్చి మానవత్వానికి జాతి, లింగ బేధాలు ఉండవని నిరూపించారు.
ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో ఇటీవల వరదలు విపరీతంగా వచ్చాయి. అక్కడ ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. వరదలు తాకిడి వల్ల చాలామంది సర్వం కోల్పోయారు. చూస్తుండగానే గృహాలు కొట్టుకుపోవడంతో చాలామంది కట్టుబట్టలతో మిగిలారు. ఇప్పటికీ అక్కడ వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. ప్రభుత్వం తరఫున కార్యక్రమాలు నిర్వహిస్తున్నప్పటికీ ఇంకా ఆర్తనాధాలు వినిపిస్తూనే ఉన్నాయి. వారందరి బాధ చూడలేక ట్రాన్స్ జెండర్లు ఈ పనికి శ్రీకారం చుట్టారు.. డబ్బులు యాచించినప్పటికీ.. తమ వద్ద అంటి పెట్టుకోకుండా విరాళం అందించారు. తాము అందించిన ఈ డబ్బులతో సేవా కార్యక్రమాలు నిర్వహించాలని ప్రభుత్వాన్ని కోరారు. ట్రాన్స్ జెండర్లు చేసిన ఈ పని పట్ల సోషల్ మీడియాలో అభినందనలు వ్యక్తమవుతున్నాయి.