AP Government: ఏ ప్రభుత్వానికైనా వ్యతిరేకత అనేది సర్వసాధారణం. ప్రతిపక్షాల ఆరోపణలు, విమర్శలకు తోడు.. ప్రభుత్వం కూడా అనుకున్న సమయంలో.. అనుకున్నట్టు చేయకపోతే నెగిటివ్ ఉంటుంది. తప్పనిసరిగా వ్యతిరేకత ప్రారంభం అవుతుంది. ఆ వ్యతిరేకతను అధిగమించి పాజిటివ్ సాధించడం అంత ఈజీ కాదు. అది చాలా కష్టం కూడా. అయితే ఏదైనా తొలినాళ్లలోనే అది ఆధారపడి ఉంటుంది. ‘ఫస్ట్ ఇంప్రెషన్.. బెస్ట్ ఇంప్రెషన్’ అంటారు. ఇందులో నిజం లేకపోలేదు కానీ.. అధికారం చేపట్టే ప్రతి పార్టీలకు ప్రారంభంలోనే కొన్ని రకాల ఇబ్బందులు వస్తాయి. వాటిని అధిగమించి ప్రజల అభిమానాన్ని చురగొనాలి. ఇప్పుడు చంద్రబాబు( AP CM Chandrababu) సర్కార్ కూడా వ్యతిరేకతను దాటి ప్రజల నుంచి అభిమానం పొందుతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయితే వ్యతిరేకత ప్రారంభమైన క్రమంలో చంద్రబాబు తన స్థితప్రజ్ఞత కనబరిచారు. అన్నింటికీ మించి గత అనుభవాల దృష్ట్యా ముందే మేల్కొన్నారు.
Also Read: ‘మిరాయ్’ ట్విట్టర్ టాక్..ప్రభాస్ ఎంట్రీ కి సెన్సేషనల్ రెస్పాన్స్..సినిమా హిట్టా? ఫట్టా?
రెండోసారి అధికారం అరుదు..
అధికారం చేపట్టిన ఒక పార్టీ వ్యతిరేకతను ఎదుర్కొని.. రెండోసారి అధికారంలోకి రావడం అనేది అరుదు. ఉమ్మడి ఏపీ రాజకీయాలు తెలుగుదేశం( Telugu Desam) ఆవిర్భావానికి ముందు.. తరువాత అన్నట్టు ఉంటుంది పరిస్థితి. అయితే 1983లో తొలిసారిగా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి గెలిచింది తెలుగుదేశం. 1985లో సంక్షోభం రెండోసారి పోటీ చేసి గెలిచింది. అయితే అక్కడకు ఐదేళ్లు తిరగకముందే దారుణ పరాజయం చవిచూసింది. ముఖ్యంగా వంగవీటి మోహన్ రంగా హత్యతోపాటు ఇతర వ్యతిరేకంశాలు ఆ ఎన్నికల్లో పనిచేశాయి. అయితే 1994లో తిరిగి అధికారంలోకి రాగలిగింది. కానీ ఏపీ రాజకీయాలను పరిశీలిస్తే ఇలా వరుసగా రెండోసారి అధికారంలోకి వచ్చింది తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీ మాత్రమే. 1995లో అధికారం చేపట్టారు చంద్రబాబు. 1999 ఎన్నికల్లో ఆయన నేతృత్వంలోని తెలుగుదేశం పార్టీ రెండోసారి అధికారంలోకి రాగలిగింది. 2004లో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారు వైయస్ రాజశేఖర్ రెడ్డి. తొలిసారి ముఖ్యమంత్రి పదవిని అధిరోహించారు. 2009లో రెండోసారి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తేగలిగారు. సీఎంగా బాధ్యతలు చేపట్టారు. అటు తెలంగాణలో కెసిఆర్ సైతం రెండుసార్లు వరుసగా తెలంగాణలో అధికారంలోకి వచ్చారు. ఈ ముగ్గురు నేతలు వ్యతిరేకతను ఎదుర్కొని రెండోసారి తమ పార్టీలను అధికారంలోకి తెచ్చిన తీరు నిజంగా అభినందనీయమే.
* 2014లో అదే మాదిరిగా..
2014లో అధికారంలోకి వచ్చింది తెలుగుదేశం పార్టీ. నవ్యాంధ్రప్రదేశ్ కు తొలి ముఖ్యమంత్రిగా చంద్రబాబు బాధ్యతలు స్వీకరించారు. తొలినాళ్లలో అంతా బాగుంది అని అభిప్రాయం వ్యక్తం అయింది. అయితే క్రమేపి అసంతృప్తి ప్రారంభం అయింది. 2019 ఎన్నికల నాటికి వ్యతిరేకత కనిపించింది. 2019 ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress ) పార్టీ గెలిచింది. తొలి రెండేళ్లలో అయితే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి టచ్ చేసేవారు కరువయ్యారు. ప్రజాభిమానం పతాక స్థాయిలో ఉండేది. అయితే ఎప్పుడైతే మూడేళ్ల పాలన పూర్తయిందో.. అప్పటినుంచి అసంతృప్తి మొదలైంది. 2024 ఎన్నికల నాటికి అది వ్యతిరేకత రూపంలో చూపించింది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి దారుణ ఓటమిని మిగిల్చింది.
* వ్యతిరేకత వరకు రాకుండా..
టిడిపి కూటమి( TDP Alliance ) సర్కార్ అధికారంలోకి వచ్చి 15 నెలలు అవుతోంది. తొలి ఆరు నెలలు ప్రభుత్వ పనితీరును ఎవరు అంచనా వేయలేరు. అయితే సంక్షేమ పథకాలు అమలు కాకపోవడంతో ప్రజల్లో ఒక రకమైన అసంతృప్తి రావడం మొదలైంది. దీనికి తోడు రెడ్బుక్ పేరిట ప్రత్యర్థులను వేధిస్తున్నారన్న ఆరోపణలు పెరిగాయి. అయితే 2014 నాటి పరిస్థితులు చంద్రబాబుకు తెలుసు. అందుకే దిద్దుబాటు చర్యలకు దిగారు. రెడ్ బుక్ ను కాస్త పక్కన పెట్టి పాలనపై దృష్టి పెట్టారు. గాడిలో పెట్టే ప్రయత్నం చేశారు. సంక్షేమ పథకాలను అమలు చేయడం ప్రారంభించారు. రాష్ట్రానికి ఏదో చేస్తున్నారన్న చర్చ ప్రజల్లో వచ్చేందుకు కారణం అయ్యారు. తద్వారా అసంతృప్తిని చల్లార్చుకున్నారు. వ్యతిరేకత వరకు వెళ్లకుండా అదుపు చేయగలిగారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం పట్ల ప్రజల్లో సానుకూలత ఉంది. దీనిని ఇలాగే తీసుకెళ్లగలిగితే కూటమికి ప్లస్ గా మారే అవకాశం ఉంది. ప్రజలు కూడా మరోసారి ఛాన్స్ ఇస్తారని అనిపిస్తోంది. విశ్లేషకులు సైతం ఇదే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.