Kingdom Review : తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు చాలామంది హీరోలు వాళ్ళకంటూ ప్రత్యేకమైన ఐడెంటిటిని క్రియేట్ చేసుకుంటూ ముందుకు దూసుకెళ్తున్న విషయం మనకు తెలిసిందే. విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) లాంటి స్టార్ హీరో సైతం ‘కింగ్ డమ్’ (Kingdom) సినిమాతో మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. జులై 4వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాతో ఆయన మరోసారి పెను ప్రభంజనాన్ని సృష్టించాలని చూస్తున్నాడు. ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ రివ్యూ వచ్చేసింది. ఈ సినిమాలో విజయ్ దేవరకొండ అద్భుతమైన పర్ఫామెన్స్ ని ఇచ్చాడని సినిమాలో ఫస్టాఫ్ లో రెండు సీన్లు, సెకండ్ హాఫ్ లో రెండు ఎపిసోడ్లు ఈ సినిమాకి హైలెట్ గా మారబోతున్నాయి అంటూ వార్తలైతే వస్తున్నాయి. మరి మొత్తానికైతే విజయ్ దేవరకొండ ఈ సినిమాతో మాస్ హీరోగా తనను తాను మార్చుకునే ప్రయత్నం చేశాడు. మరి ఈ సినిమా అతనికి ఒక గొప్ప గుర్తింపు తీసుకొస్తుందని భారీ అంచనాలైతే పెట్టుకున్నాడు. జూలై 4 వ తేదీన రాబోతున్న ఈ సినిమాని ప్రేక్షకులు ఎలా ఆదరిస్తారు అనే దానిమీదనే ఆయన మాస్ హీరోగా మారతాడా? లేదా అనేది డిసైడ్ అవ్వబోతుంది అంటూ మరి కొంతమంది కామెంట్స్ చేస్తూ ఉండటం విశేషం…
ఇక ఏది ఏమైనా కూడా ఈ సినిమా మీద ప్రతి ఒక్కరికి పాజిటివ్ వైబ్స్ ఉండడంతో సినిమా అల్టిమేట్ విజయాన్ని సాధిస్తోంది అంటూ మరి కొంతమంది వాళ్ల అభిప్రాయాల్ని తెలియజేస్తున్నారు. ఇక ఏది ఏమైనా కూడా యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో విజయ్ దేవరకొండ కి చాలా మంచి గుర్తింపైతే ఉంది.
Also Read : విజయ్ దేవరకొండ ‘కింగ్ డమ్’ సినిమా పరిస్థితి ఏంటి..?రిలీజ్ డేట్ మార్చారా..?
ఇక ఆ గుర్తింపును కాపాడుకుంటూ ముందుకు దూసుకెళ్తాడా? లేదా అనేది తెలియాల్సి ఉంది. మొత్తానికైతే ఆయన చేసిన ప్రతి సినిమా ఏదో ఒక వైవిధ్యాన్ని సంతరించుకుంటూ ముందుకు దూసుకెళ్తుందని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. అలాంటి సందర్భంలోనే ఆయన నుంచి వస్తున్న చాలా సినిమాలు ప్రేక్షకుల్లో ఒక సపరేట్ ఐడెంటిటిని క్రియేట్ చేసి పెడతాయా లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది…
ఇక ఇంతకు ముందు విజయ్ దేవరకొండ చేసిన ప్రతి సినిమా ఫ్లాప్ అవుతూ వస్తుంది కాబట్టి ఈ సినిమాతో ఆయన భారీ విజయాన్ని సాధించి మరోసారి తనని తాను ప్రూవ్ చేసుకుంటేనే ఇండస్ట్రీలో ఎక్కువ రోజులు పాటు స్టార్ హీరోగా కొనసాగే అవకాశాలు అయితే ఉంటాయి లేకపోతే మాత్రం ఇండస్ట్రీ నుంచి ఫెయిర్ ఔట్ అయిపోయి అవకాశాలు ఉన్నాయనే చెప్పాలి…