Kingdom Closing Collections: ఈ ఏడాది భారీ అంచనాల నడుమ విడుదలైన చిత్రాల్లో ఒకటి ‘కింగ్డమ్'(Kingdom Movie). విజయ్ దేవరకొండ(Vijay Devarakonda), గౌతమ్ తిన్ననూరి(Gowtham tinnanuri) కాంబినేషన్ లో తెరకెక్కిన ఈ సినిమాకు ఆరంభం లో మంచి పాజిటివ్ టాక్ వచ్చింది. కానీ షోస్ గడిచే కొద్దీ టాక్ మారుతూ వచ్చింది, చివరికి డిజాస్టర్ టాక్ వద్ద స్థిరపడింది. ఫస్ట్ వరకు అందరూ బాగానే ఉందని చెప్పారు కానీ, సెకండ్ హాఫ్ మాత్రం బాగాలేదని, డైరెక్టర్ గౌతమ్ పార్ట్ 2 మీద శ్రద్ద చూపించి సెకండ్ హాఫ్ ని చెడగొట్టేసాడని ఈ చిత్రాన్ని చూసిన ప్రతీ ఒక్కరు కామెంట్ చేశారు. ఈ టాక్ వసూళ్లపై తీవ్రమైన ప్రభావం చూపించింది. ఫలితంగా కమర్షియల్ గా ఫ్లాప్ చిత్రం గా మిగిలింది. నేడు వార్ 2 మరియు కూలీ చిత్రాలు విడుదల అవ్వడం తో కింగ్డమ్ ని తెలుగు రాష్ట్రాల్లోని అన్నీ ప్రాంతాల్లోనూ థియేటర్స్ నుండి తీసేశారు.
Also Read: బీరు తాగుదామని.. మూత తెరిచాడు.. షాకింగ్ వీడియో
కాబట్టి ఈ సినిమా క్లోజింగ్ కలెక్షన్స్ వరల్డ్ వైడ్ గా ఎంత వచ్చాయి?, బయ్యర్స్ కి ఎంత నష్టం వచ్చింది అనేది ఇప్పుడు చూద్దాం. ఈ సినిమా విడుదలకు ముందు నుండి కూడా విశ్లేషకులు ఓవర్సీస్ లో అద్భుతమైన టాక్ వస్తుందని, కేవలం రెండు మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ అవుతుందని అనుకున్నారు. కానీ మొదటి దెబ్బ ఓవర్సీస్ లోనే పడింది. తెలుగు రాష్ట్రాల్లో వీకెండ్ వరకు డీసెంట్ స్థాయి వసూళ్లనే నమోదు చేసుకుంది కానీ, ఓవర్సీస్ లో మాత్రం రెండవ రోజు నుండే వసూళ్లు రావడం ఆగిపోయాయి. ట్రేడ్ పండితులు అందిస్తున్న సమాచారం ప్రకారం ఈ చిత్రానికి ఓవర్సీస్ లో కేవలం 9 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. దాదాపుగా 80 లక్షల రూపాయిల నష్టం వచ్చినట్టు చెప్తున్నారు ట్రేడ్ పండితులు. అదే విధంగా నైజాం ప్రాంతం లో ఈ చిత్రానికి కేవలం 12 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు మాత్రమే వచ్చాయి.
ప్రీ రిలీజ్ బిజినెస్ దాదాపుగా 15 కోట్ల రూపాయలకు జరగ్గా మూడు కోట్ల రూపాయిల నష్టం ఈ ప్రాంతం నుండి వచ్చాయి అన్నమాట. అదే విధంగా సీడెడ్ లో నాలుగు కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టిన ఈ చిత్రం,ఉత్తరాంధ్ర నుండి మూడు కోట్ల 72 లక్షలు, తూర్పు గోదావరి నుండి మరియు పశ్చిమ గోదావరి జిల్లాలకు కలిపి 3 కోట్ల 20 లక్షలు,గుంటూరు లో కోటి 90 లక్షలు, కృష్ణ జిల్లాలో కోటి 54 లక్షలు, నెల్లూరు జిల్లాలో కోటి రూపాయిలు, కర్ణాటక + ఓవర్సీస్ + రెస్ట్ ఆఫ్ ఇండియా నుండి 4 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. ఓవరాల్ గా ఈ చిత్రానికి ప్రపంచవ్యాప్తంగా 40 కోట్ల రూపాయిల వరకు షేర్ వసూళ్లు వచ్చాయి. ఓవరాల్ ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ 53 కోట్లకు జరిగింది, అంటే నష్టం 13 కోట్ల రూపాయిలు అన్నమాట.