Kingdom Collection Day 4: వరుస డిజాస్టర్ ఫ్లాప్స్ లో ఉన్న యంగ్ హీరో విజయ్ దేవరకొండ(Vijay Devarakonda), లేటెస్ట్ గా కింగ్డమ్(Kingdom Movie) చిత్రం తో మరో డిజాస్టర్ ని అందుకున్నాడు అనడంలో ఎలాంటి సందేహం లేదు. సోషల్ మీడియా లో రివ్యూస్ బాగానే వచ్చాయి కానీ, ఆడియన్స్ మాత్రం ఈ చిత్రాన్ని మొదటి రోజు మ్యాట్నీ షోస్ నుండే రిజెక్ట్ చేయడం మొదలుపెట్టారు. ఫలితంగా వసూళ్లు క్రమంగా తగ్గుతూ వచ్చాయి. ఓవర్సీస్ లో అయితే ఈ చిత్రానికి మొదటి రోజు నుండి మంచి వసూళ్లు నమోదు చేసుకున్నాయి. కానీ రెండవ రోజు నుండి క్రమంగా వసూళ్లు తగ్గిపోయాయి. ఇప్పుడు ఆ ప్రాంతం లో కూడా బ్రేక్ ఈవెన్ అవ్వడం అసాధ్యం అని అక్కడ ట్రేడ్ పండితులు అంటున్నారు. విడుదలై నాలుగు రోజులు పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రాంతాల వారీగా ఎంత వసూళ్లను రాబట్టింది, బ్రేక్ ఈవెన్ మార్కుని దాటి సూపర్ హిట్ కి చేరాలంటే ఇంకా ఎంత వసూళ్లు రాబట్టాలి అనేది వివరంగా చూద్దాం.
Also Read: బుమ్రా ను మర్చిపోండి భయ్యా.. ఇకపై సిరాజే మన రేసుగుర్రం..
ట్రేడ్ పండితులు అందిస్తున్న సమాచారం ప్రకారం నాల్గవ రోజున ఈ చిత్రానికి తెలుగు రాష్ట్రాల నుండి 4 కోట్ల 54 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. అందులో కేవలం ఒక్క నైజాం ప్రాంతం నుండే కోటి 72 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. అదే విధంగా ఆంధ్ర ప్రదేశ్ లోని సీడెడ్ నుండి 76 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు రాగా, ఉత్తరాంధ్ర నుండి 69 లక్షల రూపాయిలు వచ్చింది. ఓవరాల్ గా చూస్తే నాలుగు రోజులకు నైజాం ప్రాంతం నుండి 11 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు రాగా, సీడెడ్ నుండి 3 కోట్ల 94 లక్షలు, ఉత్తరాంధ్ర నుండి 3 కోట్లు, తూర్పు గోదావరి నుండి కోటి 67 లక్షలు, పశ్చిమ గోదావరి నుండి కోటి 16 లక్షలు, గుంటూరు నుండి కోటి 70 లక్షలు, కృష్ణా జిల్లా నుండి కోటి 44 లక్షలు, నెల్లూరు నుండి 90 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి.
ఓవరాల్ గా రెండు తెలుగు రాష్ట్రాలకు కలిపి ఈ సినిమాకు నాలుగు రోజుల్లో 24 కోట్ల 80 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు రాగా, ఓవరాల్ వరల్డ్ వైడ్ గా 37 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. ఈ సినిమా పూర్తి స్థాయిలో బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకోవాలంటే మరో 17 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు రావాలి. అంటే కచ్చితంగా నేటి నుండి డీసెంట్ స్థాయి వసూళ్లను రాబట్టాలి. కానీ నేడు ఈ చిత్రానికి నమోదు అవుతున్న వసూళ్లను చూస్తుంటే అది దాదాపుగా అసాధ్యం అనే అనిపిస్తుంది. బుక్ మై షో యాప్ లో కూడా గంటకు వెయ్యి కంటే తక్కువ టిక్కెట్లు అమ్ముడుపోతున్నాయి. కాబట్టి ఈ సినిమా విజయ్ కెరీర్ లో మరో ఫ్లాప్ గా మిగిలే అవకాశాలే ఎక్కువ.