Kingdom Movie: సినిమా ఇండస్ట్రీ లో ఒక్కో దర్శకుడు ఒక్కో జానర్ లో సినిమాలను చేస్తూ ఉంటాడు…కమర్షియల్ సినిమాలని డైరెక్ట్ చేయడం అందరి వల్ల కాదు. ముఖ్యంగా ఆర్ట్ సినిమాలను చేస్తున్న వాళ్లు అలాగే ఫీల్ గుడ్ సినిమాలను తెరకెక్కించే దర్శకులు కమర్షియల్ సినిమాలను హ్యాండిల్ చేయడం అనేది చాలా పెద్ద టాస్క్ అనే చెప్పాలి…రీసెంట్ గా విజయ్ దేవరకొండ హీరోగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో వచ్చిన కింగ్డమ్ సినిమా మొదటి రోజు డివైడ్ టాక్ ను సంపాదించుకుంది. కమర్షియల్ సినిమా గా తెరకెక్కించినప్పటికి దర్శకుడు గౌతమ్ తిన్ననురుడిన్ని హ్యాండిల్ చేయడం లో కొంతవరకు తడబడ్డాడు. ఆయన ఇంతకుముందు చేసిన మళ్లీ రావా, జెర్సీ లాంటి సినిమాలు ఫీల్ గుడ్ సినిమాలు కావడంతో ఆయన దానిని హ్యాండిల్ చేశాడు. కానీ ఫుట్ లెంత్ కమర్షియల్ సినిమా లని హ్యాండిల్ చేయడం తన వల్ల కాలేదు అనే విమర్శలైతే వస్తున్నాయి. మరి ఈ సినిమాని తను కాకుండా వేరే దర్శకులైతే చాలా బాగా హ్యాండిల్ చేసేవారని మరికొంత మంది చెబుతున్నారు. ఇదే కథని ప్రశాంత్ నీల్ కి ఇచ్చుంటే ఆయన భారీ ఎలివేషన్స్ తో సినిమా మొత్తాన్ని నింపేసి ఒక సక్సెస్ ఫుల్ సినిమాగా మార్చేవాడు అంటూ కొంతమంది కామెంట్లు చేస్తున్నారు.
Also Read: ఆ స్టార్ హీరో చేయాల్సిన రెండు సినిమాలను చేసి సూపర్ స్టార్ అయిన మహేష్ బాబు…
ఇక మరి కొంతమంది మాత్రం రాజమౌళి అయితే ఈ సినిమాని నెక్స్ట్ లెవల్లో తీసి విజయ్ దేవరకొండ కెరియర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ సక్సెస్ గా తీర్చిదిద్దేవాడు అంటూ మరి కొంతమంది కామెంట్స్ చేస్తుండటం విశేషం…మరి ఏది ఏమైనా కూడా విజయ్ దేవరకొండ ఇప్పటివరకు ఫ్లాపుల్లో ఉన్నాడు.
ఇక ఈ సినిమా అయిన అతనికి భారీ సక్సెస్ ని కట్టబెడుతుంది అనుకుంటే ఈ సినిమా కూడా పెద్దగా ఆశించిన మేరకు ప్రేక్షకులను మెప్పించకపోవడంతో ప్రస్తుతం ఆయన భారీ సక్సెస్ ని అందుకోవాలనే కల కలగానే మిగిలిపోయింది. మరి ఇకమీదటైనా రాబోయే సినిమాలతో ఆయన మంచి గుర్తింపు సంపాదించుకుంటాడా? లేదా అనేది తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…
మరి ఏది ఏమైనా కూడా ఇకమీదట తన తోటి హీరోలతో పోటీ పడాలంటే భారీ సక్సెస్ ని అందుకోవడం ఒక్కటే మార్గం…తన మార్కెట్ ని కోల్పోకుండా మంచి సక్సెస్ ని అందుకున్న రోజున ఆయన టైర్ వన్ హీరోల జాబితాలో చేరిపోతాడు…ఇక అప్పటి వరకు ఆయన మీడియం రేంజ్ హీరో గానే కొనసాగుతాడని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు…