Young Hero : ఈ ఫొటోలో ముసలివాడి గెటప్ లో కనిపిస్తున్న ఈ హీరో ఎవరో గుర్తు పట్టారా..?, గంభీరమైన స్వరం, మంచి క్యారక్టర్ పడాలే కానీ, తనని మించిన నటుడు ఎవ్వరూ లేరు అనే రేంజ్ లో నటిస్తాడు. ఎలాంటి పాత్రలో అయిన తన మార్కుని క్రియేట్ చేస్తూ, అన్ని విధాలుగా స్టార్ హీరో అయ్యేందుకు అర్హత ఉన్న హీరో ఈయన. కానీ సమయం కలిసిరాక పెద్ద రేంజ్ కి వెళ్లలేకపోయాడు. ఆయన మరెవరో కాదు సత్యదేవ్(Satyadev). రీసెంట్ గానే విజయ్ దేవరకొండ(Vijay Devarakonda) ‘కింగ్డమ్'(Kingdom Movie) చిత్రం ద్వారా మన ముందుకొచ్చాడు. ఇందులో విజయ్ దేవరకొండ అన్నయ్య గా ఎంత అద్భుతమైన నటన కనబర్చాడో మనమంతా చూసాము. ఇప్పుడు ఆయన లేటెస్ట్ గా వెంకటేష్ మహా దర్శకతం లో ‘రావు బహద్దూర్'(Rao Bahaddoor) అనే చిత్రం ద్వారా మన ముందుకు రాబోతున్నాడు. ఆ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ నే ఇది.
Also Read: వార్ 2 vs కూలీ సినిమాల్లో ఏ మూవీ హిట్ అయితే తెలుగు సినిమా ఇండస్ట్రీ కి ప్లస్…
సైకలాజికల్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా సూపర్ స్టార్ మహేష్ బాబు(Superstar Rajinikanth) సొంత నిర్మాణ సంస్థ GMB ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై తెరకెక్కుతుంది. GMB తో పాటుగా శ్రీ చక్రాస్ ఎంటర్టైన్మెంట్స్, అప్లోజ్ మూవీస్ ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. అనుమానం, పెనుభూతం అనే ట్యాగ్ లైన్ ముసలి రాజు గెటప్ లో కనిపించిన సత్యదేవ్ ని చూసి నెటిజెన్స్ మొదట్లో గుర్తు పట్టలేకపోయారు. ఆ రేంజ్ లో ఆయన మేకప్ ఉంది. ఇకపోతే ఈ నెల 15 న స్వతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ సినిమా నుండి ఒక స్పెషల్ వీడియో థియేటర్స్ లో విడుదల కాబోతుంది. ‘దీనికి నాట్ ఈవెన్ ఏ టీజర్’ అనే పేరు పెట్టారు. చాలా కొత్తగా ఉంది కదూ, వెంకటేష్ ఆలోచనలన్నీ యిలాగే డిఫరెంట్ గా ఉంటాయి. ఈ సినిమాకు కేవలం ఆయన దర్శకత్వం మాత్రమే కాదు, రచన మరియు ఎడిటింగ్ బాధ్యతలు కూడా తీసుకున్నాడు.
Also Read: ‘వార్ 2’ నుండి 28 సన్నివేశాలను కత్తిరించిన సెన్సార్ బోర్డు..ఎన్టీఆర్ కి అన్యాయం?
ఈమధ్య కాలం లో ఇలాంటి డిఫరెంట్ ఆలోచనలతో వస్తున్న చిన్న సినిమాలకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. పైగా మహేష్ బాబు ఈ చిత్రానికి నిర్మాత కాబట్టి, ఆయన బ్రాండ్ ఇమేజ్ కూడా ప్రొమోషన్స్ కి బాగా పనికొస్తుంది. గతం లో మహేష్ బాబు అడవి శేష్ ని హీరో గా పెట్టి ‘మేజర్’ అనే చిత్రాన్ని నిర్మించాడు. ఈ సినిమా కమర్షియల్ గా పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యింది. అంత పెద్ద హిట్ తర్వాత కొన్నాళ్ళు మహేష్ ప్రొడక్షన్ కి బ్రేక్ ఇచ్చి, ఈ సినిమాతో మళ్ళీ మన ముందుకు రాబోతున్నాడంటే కచ్చితంగా ఇందులో గొప్ప మ్యాటర్ ఉండి ఉంటుంది అనుకోవచ్చు. అయితే మేజర్ సినిమా విడుదలకు ముందు మహేష్ బాబు ప్రొమోషన్స్ లో చాలా చురుగ్గా పాల్గొనేవాడు. ఇప్పుడు ఈ చిత్రానికి కూడా అలా ప్రొమోషన్స్ లో పాల్గొంటాడా?, రాజమౌళి తో సినిమా చేస్తూ బిజీ గా ఉంటున్న మహేష్ కి అంత టైం దొరుకుతుందా అనేది చూడాలి.