Khaleja re-release : సూపర్ స్టార్ మహేష్ బాబు(Super Star Mahesh Babu) కెరీర్ లో అట్టర్ ఫ్లాప్ అయిన సినిమాలకు కూడా ఒక ప్రత్యేకమైన విలువ ఉంటుంది. ఆరోజుల్లో మహేష్ బాబు సినిమాలు చాలా అడ్వాన్స్ గా ఉండేవి. ఆ కారణం చేత అప్పటి ఆడియన్స్ మైండ్ కి పెద్దగా ఎక్కేవి కావు. ఫలితంగా అవి పెద్ద ఫ్లాప్స్ అయ్యాయి. అలాంటి వాటిల్లో ఒకటి ‘ఖలేజా'(Khaleja Movie). మహేష్, త్రివిక్రమ్(Trivikram Srinivas) కాంబినేషన్ లో వచ్చిన రెండవ సినిమా ఇది. విడుదలకు ముందు ఈ చిత్రం మీద ఉన్న హైప్ గురించి ఇప్పటికీ మాట్లాడుకుంటూ ఉంటారు. కచ్చితంగా అప్పటి ఇండస్ట్రీ హిట్ ‘మగధీర’ కలెక్షన్స్ ని దాటేస్తుందని అంతా అనుకున్నారు. అంతటి భారీ అంచనాలు ఏర్పడడం వల్ల విడుదల రోజు ఆ అంచనాలను అందుకోవడంలో ఈ చిత్రం పూర్తిగా విఫలం అయ్యింది. ఫలితంగా ఘోరమైన డిజాస్టర్ ఫ్లాప్ గా నిల్చింది.
కానీ కాలం గడిచే కొద్దీ ఈ సినిమా ఆడియన్స్ కి తెగ నచ్చేసింది. ముందుగా టీవీ టెలికాస్ట్ లో సెన్సేషనల్ రెస్పాన్స్ ని సొంతం చేసుకుంది. సోషల్ మీడియా వృద్ధిలోకి వచ్చి యూట్యూబ్ వంటివి అందుబాటులోకి వచ్చిన తర్వాత నేటి తరం ఆడియన్స్ కూడా ఈ సినిమాకు బాగా కనెక్ట్ అయ్యారు. ఒక్కసారి ఈ చిత్రాన్ని థియేటర్స్ లో చూసే అదృష్టం కలిగితే బాగుండును అని మహేష్ ఫ్యాన్స్ తో పాటు మూవీ లవర్స్ కూడా సోషల్ మీడియా ద్వారా కోరుకునేవారు. రోజురోజుకి సోషల్ మీడియా లో ఈ చిత్రంపై పెరుగుతున్న క్రేజ్ ని గమనించి మేకర్స్ ఈ చిత్రాన్ని గ్రాండ్ గా రీ రిలీజ్ చేసేందుకు సిద్ధమయ్యారు. ఈ నెల 31 న సూపర్ స్టార్ కృష్ణ పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా మరోసారి గ్రాండ్ గా రీ రిలీజ్ చేస్తున్నారు. నిన్న రాత్రి నుండి ఈ సినిమాకు సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ ని ఓవర్సీస్ లో మొదలు పెట్టారు.
Also Read : షాక్ అయ్యేలాగా మారిపోయిన ఖలేజా సినిమాలో దిలావర్ సింగ్ భార్య…
రెస్పాన్స్ ఊహించిన దానికంటే ఎక్కువే వచ్చింది. కొన్ని థియేటర్స్ లో అయితే బుకింగ్స్ ఓపెన్ చేసిన రెండు మూడు నిమిషాలకే హౌస్ ఫుల్స్ అయ్యాయి. కొత్త సినిమాలకు కూడా ఈ రేంజ్ బుకింగ్స్ ఈమధ్య కాలం లో జరగలేదు. దీనిని బట్టే అర్థం చేసుకోవచ్చు ఈ చిత్రం కోసం అభిమానులు ఎంత ఆతృతగా ఎదురు చూస్తున్నారు అనేది. ట్రేడ్ విశ్లేషకుల అంచనా ప్రకారం, బుకింగ్స్ మొదలు పెట్టిన అతి తక్కువ షోస్ నుండే ఈ చిత్రానికి నాలుగు వేల డాలర్ల గ్రాస్ వసూళ్లు వచ్చినట్టు తెలుస్తుంది. రీసెంట్ గా విడుదలైన రీ రిలీజ్ చిత్రాలన్నిటికంటే ఇది ఎక్కువ అని చెప్పొచ్చు. ప్రస్తుతం నార్త్ అమెరికా లో ‘గబ్బర్ సింగ్’ పేరిట ఆల్ టైం రికార్డు ఉంది. ‘ఖలేజా’ ఆ రికార్డుని బద్దలు కొడుతుందో లేదో చూడాలి.