Malayalam hero Mohanlal : కొన్ని కొన్ని సార్లు ఒక్క సినిమా కూడా ఏడాదికి రిలీజ్ చేయడం లేదు. కానీ అప్పట్లో ఈ స్టార్ హీరో మాత్రం ఒక ఏడాదిలో ఏకంగా 34 సినిమాలను రిలీజ్ చేసి సంచలన చరిత్ర సృష్టించారు. ఒక ఏడాదిలో రిలీజ్ అయిన 34 సినిమాలలో 25 సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ విజయం సాధించడం విశేషం. ప్రస్తుతం 65 ఏళ్ళు ఉన్న ఈ స్టార్ నటుడు ఇప్పటికీ కూడా సినిమాలలో నటిస్తూనే ఉన్నారు. ఇతను 45 ఏళ్ల నుంచి సినిమాలు చేస్తూ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నారు. తన కెరియర్లో ఇప్పటివరకు బాక్సాఫీస్ దగ్గర ఎన్నో ఇండస్ట్రీ హిట్స్ సినిమాలను ప్రేక్షకులకు అందించారు. మన దేశం గర్వించదగ్గ నటులలో ఒకరిగా గుర్తింపు కూడా తెచ్చుకున్నారు. ప్రస్తుతం 65 ఏళ్ల వయసులో కూడా ఆయన కష్టపడి సినిమాలలో నటిస్తున్నారు. వరుసగా హిట్స్ అందుకుంటున్నారు. ప్రస్తుతం ఉన్న యంగ్ హీరోలకు కూడా సాధ్యం కానీ 100 కోట్లు, 200 కోట్ల కలెక్షన్లను బాక్స్ ఆఫీస్ దగ్గర చాలా ఈజీగా దాటేస్తున్నారు ఈ సీనియర్ హీరో. గతంలో ఈ స్టార్ హీరో ఒక ఏడాదిలో ఏకంగా 34 సినిమాలలో నటించారు. అయితే ఆ 34 సినిమాలలో 25 సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి.
Also Read : అందాలతో కవ్విస్తున్న ఉదయ్ కిరణ్ హీరోయిన్.. చూస్తే మతి పోవాల్సిందే..
ఈ రేర్ రికార్డు క్రియేట్ చేసిన స్టార్ నటుడు మరెవరో కాదు మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్. మే 21న మోహన్ లాల్ పుట్టినరోజు సందర్భంగా సోషల్ మీడియా ద్వారా పలువురు సినీ సెలబ్రిటీలు, అభిమానులు అలాగే నేటిజెన్లు ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ క్రమంలోనే స్టార్ నటుడు మోహన్ లాల్ కు సంబంధించిన రేర్ ఫోటోలు, వీడియోలు అలాగే ఆసక్తికరమైన విషయాలు సామాజిక మాధ్యమాలలో వైరల్ అయ్యాయి. మోహన్ లాల్ మంజిల్ వెరింజ పుకల్ అనే సినిమాతో 1980లో సినిమా ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. 45 సంవత్సరాల నుంచి మోహన్ లాల్ సినిమాలలో సక్సెస్ఫుల్గా రాణిస్తున్నారు.
ఈయన నటించిన 25కి పైగా సినిమాలు 1983లో రిలీజ్ అయ్యాయి. అలాగే 20 కి పైగా సినిమాలు 1984లో రిలీజ్ అయ్యాయి. ఇక 20కి పైగా సినిమాలు 1985లో కూడా రిలీజ్ అయ్యాయి. ఆ తర్వాత ఏకంగా 34 సినిమాలు 1986 లో రిలీజ్ అయ్యాయి. ఈ సినిమాలన్నీ సక్సెస్ రేట్ కూడా చాలా ఎక్కువ అని చెప్పొచ్చు. 34 సినిమాలలో ఏకంగా 25 సినిమాలు సూపర్ హిట్ విజయం సాధించాయి. ఈయన ఒక ప్రొఫెషనల్ రెస్లర్ కూడా. పనికొస్తే పోటీలలో పాల్గొని టైటిల్ కూడా గెలుచుకున్నారు. మోహన్లాల్ 1977లో కేరళ రాష్ట్ర రెజ్లింగ్ ఛాంపియన్షిప్ టైటిల్ గెలుచుకున్నారు. ఈయన రీసెంట్ గా నటించినా తుడ్ రూమ్ ఏకంగా బాక్స్ ఆఫీస్ దగ్గర 200 కోట్లకు పైగా కలెక్షన్లను రాబట్టింది.
Viswasanthi Foundation is organising a one-year-long Anti-Drug Campaign titled “Be A Hero”. Dreaming and achieving a successful life is the biggest high one can get, and we are committed to this journey with our youth. Be a Hero in our fight against drugs. Let’s take a pledge… pic.twitter.com/ga2Fo2hmmZ
— Mohanlal (@Mohanlal) May 21, 2025