Khaleja movie : మహేష్ బాబు సినిమా విడుదలను ఆయన అభిమానులు ఒక పండగ లాగా జరుపుకుంటారు. ఇప్పటివరకు మహేష్ బాబు పాన్ ఇండియా సినిమా చేయకపోయినప్పటికీ ఆయనకు దేశవ్యాప్తంగానే కాకుండా ఇతర దేశాల్లో కూడా చాలామంది అభిమానులు ఉన్నారు. ముఖ్యంగా అయితే హీరో మహేష్ బాబుకు అమ్మాయిలలో ఫాలోయింగ్ ఓ రేంజ్ లో ఉంది. ప్రతి అమ్మాయి కూడా తమకు కాబోయే వాడు మహేష్ బాబు లాగా హ్యాండ్సమ్ గా ఉండాలని కలలు కంటుంది. ఇక మహేష్ బాబు సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం మహేష్ బాబు దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు. జనవరి నెల నుంచి ఈ సినిమా షూటింగ్ ప్రారంభం అయ్యింది. ఈ సినిమాలో మహేష్ బాబు మునుపెన్నడు కనిపించని సరికొత్త లుక్ లో కనిపించబోతున్నారు అంటే గతంలోనే పలు వార్తలు సామాజిక మాధ్యమాలలో వైరల్ అయ్యాయి. మహేష్ బాబు తన కెరియర్లో ఇప్పటివరకు నటించిన అన్ని సినిమాలు కూడా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఇప్పటివరకు మహేష్ బాబు నటించిన సినిమాలలో ఖలేజా సినిమాకు ప్రత్యేక ఫ్యాన్ బేస్ ఉంది అని చెప్పడంలో సందేహం లేదు. థియేటర్లో రిలీజ్ అయిన ఈ సినిమాకు మిక్స్డ్ టాక్ వచ్చింది. కానీ ఇప్పటికి కూడా ఈ సినిమా చాలామందికి ఫేవరెట్ మూవీ. కానీ అప్పట్లో థియేటర్లలో రిలీజ్ అయిన ఈ సినిమా ఎందుకు ఆడలేదు అని చాలామందికి అర్థం కాలేదు. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించిన ఈ సినిమా లోని డైలాగులు మరియు మహేష్ బాబు నటన అన్ని కూడా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి.
Also Read : వణుకు పుట్టిస్తున్న తమన్నా ‘ఓదెల 2’ ట్రైలర్..మరో అరుంధతి కానుందా?
మణిశర్మ అందించిన సంగీతం కూడా ఈ సినిమాకు బాగా హైలైట్. ఇక ఈ సినిమాలో హీరో మహేష్ బాబుకు జోడిగా అనుష్క హీరోయిన్ గా నటించింది. ఈ సినిమాలోని కొంత భాగం రాజస్థాన్లో జరుగుతుంది. టాక్సీ డ్రైవర్ అయినా హీరో కారుపై పైనుంచి పడి చనిపోయిన దిలావర్ సింగ్ అనే వ్యక్తి కుటుంబాన్ని కలవడానికి హీరో రాజస్థాన్ కి వెళ్తాడు. ఈ సన్నివేశాలు అన్నీ కూడా ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. అయితే ఈ సినిమాలో దిలావర్ సింగ్ భార్యాగా నటించినా నటి గురించి చాలామంది సామాజిక మాధ్యమాలలో ఆరా తీస్తున్నారు.
సోషల్ మీడియాలో ఆమె ఎవరో చెప్పండిరా అంటూ చేసిన ఫన్నీ వీడియోలు నిత్యం వైరల్ అవుతూనే ఉంటాయి. ముఖ్యంగా కుర్రాళ్ళు అయితే ఆమె కోసం గూగుల్లో ఓ రేంజ్ లో గాలిస్తున్నారు. ఆమె పేరు దివ్య మేరి సిరియాకర్. ఆమె గతంలో పలు సినిమాలలో నటించి ప్రేక్షకులను మెప్పించింది. ప్రస్తుతం దివ్య సినిమాలకు దూరంగా ఉంటుంది. కానీ సోషల్ మీడియాలో మాత్రం ఈమె చాలా యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన ఫోటోలను షేర్ చేస్తూ ఉంటుంది.
View this post on Instagram