Homeఎంటర్టైన్మెంట్Keerthy Suresh Marriage: ఎవర్రా మీరంతా.. మీకు మీరే డిసైడ్‌ అవుతారా.. కీర్తి సురేశ్‌ పెళ్లిపై...

Keerthy Suresh Marriage: ఎవర్రా మీరంతా.. మీకు మీరే డిసైడ్‌ అవుతారా.. కీర్తి సురేశ్‌ పెళ్లిపై నటి తండ్రి!

Keerthy Suresh Marriage: ప్రముఖ నటి కీర్తి సురేశ్‌ పెళ్లంటూ మళ్లీ రూమర్స్‌ తెరపైకి వచ్చాయి. జవాన్‌ సంగీత దర్శకుడు అనిరుధ్‌ని ఆమె వివాహం చేసుకోబోతున్నారని మరోసారి ఊహాగానాలు చక్కర్లు కొడుతున్నాయి. ఇందుకు కారణం లేకపోలేదు. జవాన్‌ సినిమా డైరెక్టర్‌ అట్టి కుమార్‌ ప్రముఖ నటి కీర్తి సురేశ్‌ స్నేహితుడు. ఆ సినిమా సక్సెస్‌ను కీర్తి కూడా ఎంజాయ్‌ చేస్తోంది. ఈ క్రమంలో ఆ సినిమా మ్యూజిక్‌ డైరెక్టర్‌తో దిగిన ఫొటోలు సోషల్‌ మీడియాలోకి వచ్చాయి. దీంతో పెళ్లి ఫిక్స్‌ అయినట్లు ప్రచారం జరుగుతోంది.

స్పందించిన కీర్తి తండ్రి..
ఇక ఈ రూమర్స్‌పై కీర్తి సురేశ్‌ తండ్రి సురేశ్‌కుమార్‌ స్పందించారు. ఆ వార్తల్లో నిజంలేదంటూ వాటిని ఖండించారు. ‘ఎవరో ఉద్దేశపూర్వకంగానే ఇలాంటి రూమర్స్‌ క్రియేట్‌ చేస్తున్నారు. మీకు మీరే డిసైడ్‌ అయితే ఎలా.. నాతో పని లేకున్నా.. నా కూతురును అయినా అడిగరా’ అని ప్రశ్నించారు. కీర్తి సురేశ్‌ పెళ్లిపై వదంతులురావడం ఇదే తొలిసారి కాదు. గతంలో పలుమార్లు వచ్చిన రూమర్సన్న కీర్తి సురేశ్, ఆమె కుటుంబ సభ్యులు ఖండించినా మళ్లీ రావడం గమనార్హం.

అనిరు«ద్‌తో పెళ్లంటూ..
ఇదిలా ఉంటే.. కీర్తి సురేశ్, అనిరుధ్‌ ప్రేమలో ఉన్నారని, త్వరలోనే వీరిద్దరూ మూడుముళ్ల బంధంతో ఒక్కటికానున్నరంటూ కొన్నాళ్ల క్రితమే పలు ఆంగ్ల పత్రికల్లో వార్తలు, నెట్టింట పోస్టులు వెలిశాయి. ఆ సమయంలో కీర్తి స్పందిస్తూ.. ‘నా పెళ్లి గురించి వస్తోన్న వార్తలు, పోస్టులు చూసి షాక్‌ అయ్యా. కొంతమంది నెటిజన్లు సోషల్‌ మీడియా వేదికగా ఇప్పటికే, మూడు, నాలుగుసార్లు నాకు పెళ్లి చేసేశారు. సమయం వచ్చినప్పుడు తప్పకుండా వివాహం చేసుకుంటా’ అని తెలిపారు. అనిరుధ్‌ తనకు మంచి స్నేహితుడని చెప్పారు. మరోవైపు, తన స్నేహితుడితో కలిసి దిగిన ఫొటోను కీర్తి సురేశ్‌ సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయగా.. ‘కీర్తికి కాబోయే వరుడు ఇతడే’ అంటూ పలు వెబ్‌సైట్లు కథనాలు అల్లాయి. ఆ సమయంలో సురేశ్‌ కుమార్‌ వాటిని ఖండిస్తూ ఓ వీడియో విడుదల చేశారు. ‘కీర్తి సురేశ్‌కు పెళ్లి కుదిరితే మీడియాకు, ప్రజలకు ముందుగా మేమే చెబుతాం. ఇలాంటి సున్నితమైన విషయాలపై రూమర్స్‌ క్రియేట్‌ చేయొద్దు. దీని కారణంగా కుటుంబంలో మనశ్శాంతి కరవవుతుంది‘ అంటూ అసహనం వ్యక్తం చేశారు.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

Related News

Most Popular

Kajal Aggarwal birthday

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...
The Odyssey 3 Day Collections

The Odyssey : ‘ది ఒడిస్సీ’ లో క్రేజీ రోల్ ని మిస్ చేసుకున్న మన హీరో.. పెద్ద...

రీసెంట్ గా భారీ అంచనాల నడుమ విడుదలైన క్రిస్టోఫర్ నోలన్ 'ది ఒడిస్సీ' చిత్రం , బాక్స్ ఆఫీస్ వద్ద ఏ రేంజ్ వసూళ్ల సునామీ ని సృష్టిస్తూ ముందుకు దూసుకెళ్తుందో మన...
Akhil Lenin Movie Release Date

Lenin Movie : 11వ రోజు ఊహించని రికార్డు నెలకొల్పిన ‘లెనిన్’.. ఇప్పట్లో ఈ సునామీ ఆగేలా లేదు..

Lenin Movie : అక్కినేని అఖిల్ హీరో గా నటించిన 'లెనిన్' చిత్రం వసూళ్లు ఇప్పట్లో ఆగేలా కనిపించడం లేదు. మొదటి ఆట నుండే సూపర్ హిట్ టాక్ ని కైవసం చేసుకున్న...
Team India Bowling

Team India : జింబాబ్వే టూర్ కు టీమిండియా ఇదే.. వాళ్ల మీద మనోళ్ళ రికార్డులు ఎలా ఉన్నాయంటే..

Team India : ఐర్లాండ్ చేతిలో వైట్ వాష్.. ఇంగ్లాండ్ చేతిలో టి20.. వన్డే సిరీస్ కోల్పోయిన తర్వాత టీమిండియా పూర్తిగా నిరాశలో కూరుకుపోయింది. బౌలింగ్ దారుణంగా ఉంది. బ్యాటింగ్ చెత్తగా ఉంది....
TTD Trust Board Meeting

TTD : చంద్రబాబు జైల్లో చనిపోతే పొట్టేళ్ల విందు.. అటువంటి అధికారికి తిరుమలలో ఏఈఈ పోస్ట్..

TTD : రాజకీయ నాయకులు రాజకీయాలు చేస్తుంటారు. వాళ్లలో వాళ్లకు వ్యూహాలు ఉంటాయి. ఎత్తులు ఉంటాయి. వాటిని చిత్తు చేసే ఎత్తుగడలు కూడా ఉంటాయి. ఇవన్నీ రాజకీయంలో ఒక భాగం. కానీ ఉద్యోగులు...
Oktelugu Epaper