Keerthy Suresh Telugu Poem Viral Clip: సౌత్ ఇండియా లో ఎలాంటి పాత్ర అయినా అవలీలగా చెయ్యగలను అని నిరూపించుకున్న హీరోయిన్స్ చాలా తక్కువ మంది మాత్రమే ఉన్నారు. ఆ తక్కువ మందిలో ఒకరు కీర్తి సురేష్(Keerthy Suresh). మలయాళం ఫిల్మ్ ఇండస్ట్రీ నుండి టాలీవుడ్ కి ‘నేను శైలజ’ అనే చిత్రం ద్వారా ఎంట్రీ ఇచ్చిన ఈమె నేషనల్ అవార్డుని అందుకునే స్థాయికి ఎలా ఎదిగిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. రీసెంట్ గానే పెళ్లి చేసుకున్న కీర్తి సురేష్, కొంతకాలం సినిమాలకు గ్యాప్ ఇచ్చి మళ్ళీ రీ ఎంట్రీ ఇచ్చింది. కానీ ఈసారి మాత్రం సిల్వర్ స్క్రీన్ పై కాదు, బుల్లితెర పై ఆమె కనిపించబోతుంది. అమెజాన్ ప్రైమ్(Amazon Prime Video) సంస్థ నుండి ‘ఉప్పు కప్పురంబు’ అనే ఒరిజినల్ ఫిల్మ్ తెరకెక్కింది. వచ్చే నెల నాల్గవ తేదీన ఈ చిత్ర అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కాబోతుంది. ఈ సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్ హైదరాబాద్ లో కాసేపటి క్రితమే జరిగింది.
తెలుగు పద్యం చెప్పి క్లాప్స్ కొట్టించుకున్న @KeerthyOfficial pic.twitter.com/oO6mRGL9od
— Rajesh Manne (@rajeshmanne1) June 19, 2025
ఈ ట్రైలర్ కి ఆడియన్స్ నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ముఖ్యంగా డార్క్ కామెడీ థ్రిల్లర్స్ ని ఇష్టపడే వారికి ఈ సినిమా కచ్చితంగా నచ్చుతుంది అని చెప్పొచ్చు. కీర్తి సురేష్, సుహాస్(Suhas) ఈ చిత్రం లో ప్రధాన పాత్రలు పోషించారు. ట్రైలర్ ని చూసిన తర్వాత కథ విషయం లోకి వెళ్తే కొన్ని అనుకోని సంఘటనల కారణంగా కీర్తి సురేష్ ఒక ఊరికి పెద్దగా ఎంపిక అవుతుంది. ఆమె ఎంపికైన వెంటనే ఒక విచిత్రమైన సమస్య వస్తుంది. అదేమిటంటే స్మశానం హౌస్ ఫుల్, కేవలం నలుగురిని మాత్రమే పూడ్చడానికి స్థలం మిగిలి ఉందట. ఈ సమస్యని కీర్తి సురేష్ ఎలా పరిష్కరిస్తుంది అనేదే స్టోరీ. ఏ మధ్యలో వచ్చే సందర్భానుసారంగా పుట్టే కామెడీ కూడా బాగా పేలినట్టు అనిపిస్తుంది. ఇక పోతే ఈ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో కీర్తి సురేష్ మాట్లాడిన మాటలు బాగా వైరల్ అయ్యాయి.
Also Read: Keerthy Suresh: కీర్తి సురేష్ నుండి డబ్బులు లాక్కున్న ఐస్ క్రీం షాప్ ఓనర్..వీడియో వైరల్!
ఆమె మాట్లాడుతూ ‘నా పెళ్లి తర్వాత ఇదే నేను హైదరాబాద్ లో పాల్గొనడం. ఈ సినిమా షూటింగ్ నాకు అద్భుతమైన అనుభూతిని ఇచ్చింది. ఒక నటిగా నాలోని కొత్త కోణాన్ని ఆవిష్కరించింది ఈ చిత్రం. సుహాస్ చాలా మంచి నటుడు. కలర్ ఫోటో నుండి అతని సినిమాలు చూస్తూనే ఉన్నాను. ఈ చిత్రం లో అతనితో కలిసి పని చేయడం కూడా మర్చిపోలేని అనుభూతి. డార్క్ కామెడీ ని ఇష్టపడే వారికి ఈ సినిమా ఒక విజువల్ ఫీస్ట్ గా ఉండబోతుంది. ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ తో మీ ముందుకు వచ్చాము. నచ్చుతుందని ఆశిస్తున్నాము’ అంటూ చెప్పుకొచ్చింది. ఇక చివర్లో ఆమె ‘ఉప్పకప్పురంబు’ పద్యాన్ని ఆపకుండా నాన్ స్టాప్ గా చెప్పడం హైలైట్ గా నిల్చింది. ఆ వీడియో ని మీరు కూడా చూసి మీ అభిప్రాయాన్ని వ్యక్తం చేయండి.
