Jayammu Nischayammu Raa show: సినిమా ఇండస్ట్రీలో చాలా మంచి గుర్తింపు సంపాదించుకున్న నటినటులు చాలామంది ఉన్నారు. అందులో కీర్తి సురేష్ ఒకరు. రామ్ హీరోగా వచ్చిన ‘నేను శైలజ’ సినిమాతో హీరోయిన్ గా మంచి గుర్తింపును సంపాదించుకున్నారు. ఇక ఆ సినిమా సక్సెస్ అవ్వడంతో వరుసగా తెలుగు సినిమాల్లో నటిస్తూ తనను తాను స్టార్ హీరోయిన్ గా ఎలివేట్ చేసుకునే ప్రయత్నం చేశారు. నేను లోకల్, దసర లాంటి సినిమాలతో భారీ పాపులారిటిని సంపాదించుకున్నారు ఇక ప్రస్తుతం ఆమె విజయ్ దేవరకొండ హీరోగా వస్తున్న ‘రౌడీ జనార్ధన్’ సినిమాలో కూడా హీరోయిన్ గా నటిస్తున్నారు…ఇక రీసెంట్ గా ఆమె ‘జయమ్ము నిశ్చయమ్మురా’ అనే షోలో పాల్గొన్నారు…ఇక ఈ షోలో ఆమె ఆంథోనీ తటిల్ పెళ్లి గురించి చెప్పారు.
అలాగే వాళ్ళ పెళ్లికి ఇండస్ట్రీ లో పెద్దగా ఎవ్వరికి చెప్పలేదట. మొత్తానికి ఆంథోనీ తో చాలా సంవత్సరాల పాటు ప్రేమలో ఉన్నానని చెప్పారు. అలాగే తను కతర్ లో ఉండేవాడని నేను ఇక్కడ సినిమాలు చేసేదానిని చెప్పారు. ఇక ఇద్దరు లైఫ్ లో సెటిల్ అయిన తర్వాత ఇంట్లో ప్రేమ వ్యవహారం గురించి చెప్పి పెళ్లి చేసుకుందామని అనుకున్నారట…
ఇక ఇంట్లో వాళ్ళతో చెప్పే కంటే ముందు మా ప్రేమ విషయాన్ని మీతో (జగపతి బాబు) చెప్పాను అప్పుడు మీరు నాకు ధైర్యం చెప్పారు. కానీ మా పెళ్లి కి మాత్రం నేను మీకు చెప్పలేదు అంటూ కీర్తి సురేష్ జగపతి బాబును ఉద్దేశించి మాట్లాడారు. దానికి మీకు క్షమాపణలు చెబుతున్నాను అంటూ ఆ ప్రోగ్రాంలోనే ఆమె జగపతి బాబుకి సారీ చెప్పారు. ఇక ప్రస్తుతం కీర్తి సురేష్ వరుస సినిమాలను చేస్తోంది.
కానీ ఆమెకి సరైన బ్లాక్బస్టర్ హిట్స్ పడడం లేదు. రౌడీ జనార్ధన్ సినిమాతో సూపర్ సక్సెస్ ని సాధించాలని చూస్తున్నట్టుగా తెలుస్తోంది… ఆమె కనక ఈ సినిమాతో భారీ విజయాన్ని అందుకుంటే మాత్రం తనకంటూ ఒక స్పెషల్ ఐడెంటిటిని సంపాదించుకున్న వారవుతారు. లేకపోతే మాత్రం ఆమె కెరియర్ చాలా వరకు ఇబ్బందుల్లో పడే అవకాశాలైతే ఉన్నాయి. ప్రస్తుతం తన తోటి హీరోయిన్లందరు స్టార్ హీరోయిన్స్ గా మారుతుంటే తను మాత్రం ఇంకా మీడియం రేంజ్ హీరోలతోనే సినిమాలు చేస్తోంది. కాబట్టి ఇప్పుడు తనకి ఒక భారీ సక్సెస్ చాలా వరకు అవసరమనే చెప్పాలి…