Katrina Kaif- Vicky Kaushal: ‘మా ఆవిడ గురించి ఏమో అనుకున్నా.. ఆవిడ శాస్త్రవేత్త’ అని ప్రముఖ బాలీవుడ్ నటి కత్రినా కైఫ్ భర్త విక్కీ కౌశల్ మురిసిపోయారు. ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ జంట వివాహం జరిగినప్పటి నుంచి ఎంతో అన్యోన్యంగా జీవిస్తున్నారు. వివాహం జరిగినా సినిమాల్లో నటిస్తూ ప్రత్యేకంగా నిలుస్తున్నారు. ఒకరి ఆరోగ్యంపై మరొకరు శ్రద్ధ వహిస్తూ చాలా కేర్ తీసుకుంటున్నారు. ఈ సందర్భంగా తన ఆరోగ్యం గురించి కత్రినా నిత్యం ఆలోచిస్తుందని అన్నారు.
Katrina Kaif- Vicky Kaushal
బాలీవుడ్ నటుడు విక్కీ కౌశల్, కత్రినా కైఫ్ ల వివాహం 2021 డిసెంబర్ లో జరిగింది. రాజస్థాన్ లో నిర్వహించిన వీరి వివాహానికి అతికొద్దిమంది సెలబ్రెటీలు మాత్రమే హాజరయ్యారు. వీరి వివాహానికి సంబంధించిన ఫొటోలు అప్పట్లో నెట్లో హల్ చల్ చేశాయి. అప్పటి నుంచి ఈ బ్యూటిఫుల్ కపుల్ ఎంతో అన్యోన్యంగా ఉంటుంది. ఇటీవల వీరిద్దరూ కలిసి ఓ ఈవెంట్ కు హాజరయ్యారు. ఈ సందర్భంగా విక్కీ కౌశల్ చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ గా మారాయి.
ఇటీవల జరిగిన ఓ ఈవెంట్ లో పాల్గొన్న విక్కీ కౌశల్ కత్రీనా గురించి చెప్పమని కొందరు అడిగారు. దీంతో ఆయన ‘కత్రినా ఎప్పుడూ ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకుంటుంది. ఆమెకు ‘కుచ్ జ్యాదా హీ గ్యాన్’ ఉంది. మీకందరికి ఓ విషయం తెలియదు. ఆమె ఒక సైంటిస్ట్. ఉన్హే బోహోట్ గ్యాన్ హై ఔర్ కుచ్ జ్యాదా హీ గ్యాన్ హై.. కానీ ఆమె నాకు చాలా సహాయం చేస్తుంది. నేను ఎప్పుడు తిన్నాను..? ఏం తింటాను..? అనే విషయాలపై శ్రద్ధ పెడుతుంది.’ అని చేసిన వ్యాఖ్యలపై ఫ్యాన్స్ ఖుషీ అయ్యారు.
Katrina Kaif- Vicky Kaushal
విక్కీ కౌశల్ నటించిన ‘గోవింద నామ్ మేరా’ విడుదలకు రెడీ అవుతోంది. డిసెంబర్ 16 నుంచి దీనిని డిస్నీ+హాట్ స్టార్ లో రన్ చేయనున్నారు. ఇందులో భూమి పెడ్నేకర్, కియారా అద్వానీ ప్రధానంగా నటించనున్నారు. అలాగే ‘సామ్ బహదూర్’ సినిమాలో నటిస్తున్నాడు. అటు కవిత చివరిసారిగా ‘పోన్ భూత్’లో నటించింది. హారర్ కామెడీ నేపథ్యం ఉన్న ఈ సినిమా నవంబర్ 4న రిలీజ్ అయింది. అయితే అంచనాలను అందుకోవడంలో విఫలమైంది. అలాగే సల్మాన్ ఖాన్ తో కలిసి టైగర్ 3 లో నటిస్తోంది. దీనిని 2023లో థియేటర్లోకి తీసుకురానున్నారు.