Salaar
Salaar : రెబల్ స్టార్ ప్రభాస్(Rebel Star Prabhas) కెరీర్ లో మైల్ స్టోన్ గా నిల్చిన చిత్రాలలో ఒకటి ‘సలార్'(Salaar Movie). ఈ సినిమా 2023 వ సంవత్సరం డిసెంబర్ నెలలో విడుదలై సంచలన విజయం సాధించి దాదాపుగా 600 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. అదే ఏడాది ఆయన చేసిన ‘ఆదిపురుష్’ చిత్రం ఘోరమైన డిజాస్టర్ ఫ్లాప్ గా నిల్చింది. దేశమంతటా ఈ సినిమాపై విమర్శలు తీవ్రంగా వచ్చాయి. ప్రభాస్ అభిమానులకు ఒక చేదు జ్ఞాపకం లాగా మిగిలిపోయింది ఈ చిత్రం. అలాంటి చిత్రం విడుదలైన సంవత్సరం లోనే, ఆ చేదు జ్ఞాపకాలను మర్చిపోయే విధంగా చేసింది ‘సలార్’. సాధారణంగా స్టార్ హీరోల పాత సినిమాలను రీ రిలీజ్ చేస్తుంటారు. ఎందుకంటే పాత సినిమాలను నేటి తరం ఆడియన్స్ చూసి ఉండరు కాబట్టి, అవి థియేటర్స్ లో విడుదలైతే చూడాలని కోరుకుంటారు కాబట్టి.
Also Read : సలార్ రీరిలీజ్ డేట్: ఫ్యాన్స్ కి పూనకాలే, ఈ సమ్మర్ ప్రభాస్ దేనా?
కానీ ‘సలార్’ చిత్రం విడుదలై రెండేళ్లు కూడా పూర్తి కాలేదు. అలాంటి సినిమాని రీ రిలీజ్ చేసి సక్సెస్ చేయడం అనేది చిన్న విషయం కాదు. ట్రేడ్ పండితులు అందించిన సమాచారం ప్రకారం ఈ చిత్రానికి మొదటి రోజు ఇండియా లో 3 కోట్ల 20 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ఓవర్సీస్ లో ఈ చిత్రాన్ని విడుదల చేయలేదు, ఒకవేళ చేసుంటే కచ్చితంగా నాలుగు కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లకు దగ్గరగా వెళ్ళేది. కచ్చితంగా ఇది బ్యాడ్ లక్ అనుకోవాలి. అయితే ఎట్టకేలకు థియేట్రికల్ రన్ ని రీ రిలీజ్ లో దాదాపుగా పూర్తి చేసుకున్న ఈ చిత్రానికి ఇప్పటి వరకు 4 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయట. ఇప్పటి వరకు విడుదలైన టాప్ 10 టాలీవుడ్ సినిమాలలో ‘సలార్’ చిత్రం 6 వ స్థానం లో నిల్చింది. మొదటి స్థానంలో మురారి, రెండవ స్థానంలో గబ్బర్ సింగ్, మూడవ స్థానంలో బిజినెస్ మ్యాన్ చిత్రాలు నిలిచాయి.
అదే విధంగా నాల్గవ స్థానంలో ఆరెంజ్ చిత్రం నిలబడగా, ఐదవ స్థానం లో సింహాద్రి చిత్రం, ఆరవ స్థానంలో సాలార్ చిత్రం నిల్చింది. ఎలాంటి అకేషన్ లేకుండా విడుదలై ఇంత గ్రాస్ వసూళ్లు ఒక రీ రిలీజ్ కి రావడం అనేది మామూలు విషయం కాదు. ప్రభాస్ ఫ్యాన్ బేస్ కి ఉన్న పవర్ ని మరోసారి బాక్స్ ఆఫీస్ కి రుచి చూపించింది ఈ సినిమా. అంతే కాకుండా ఇప్పటి వరకు రీ రిలీజ్ అయిన అన్ని ప్రభాస్ సినిమాలకంటే, ఈ చిత్రానికే ఎక్కువ గ్రాస్ వసూళ్లు వచ్చాయని అంటున్నారు ట్రేడ్ పండితులు. ఈ ఏడాది రాజాసాబ్ సినిమా విడుదల లేకుండా, ప్రభాస్ నుండి మరో రీ రిలీజ్ ని ఆశించవచ్చు. ప్రస్తుతం ఆయన హను రాఘవపూడి మూవీ షూటింగ్ తో ఫుల్ బిజీ గా ఉన్నాడు.
Also Read : రాసి పెట్టుకోండి ‘సలార్ 2’ వచ్చాక ఏ రికార్డ్ ఉండదు : ప్రశాంత్ నీల్…