https://oktelugu.com/

Katrina Kaif Divorce : విడాకుల బాట పట్టిన కత్రినా కైఫ్..? అర్థరాత్రి ఏడ్చుకుంటూ ఇల్లు వదిలి వెళ్లిపోయిన కత్రినా!

Katrina Kaif Divorce : బాలీవుడ్ లో రీసెంట్ ఉమర్ సందు అనే క్రిటిక్ బాగా ఫేమస్ అయిపోయాడు.సోషల్ మీడియా లో పాపులారిటీ సంపాదించడం కోసం అడ్డమైన గడ్డి తినడానికి కూడా సిద్దపడే ఏకైక వ్యక్తి ఇతనే,తన రీచ్ వస్తుంది అనిపిస్తే పొగుడుతాడు,రీచ్ రావట్లేదు ఎలా అయిన నెగటివ్ కామెంట్స్ చేసి పాపులర్ అవ్వాలి అనుకుంటే ఒక్క క్షణం కూడా ఆలోచించాడు.అతని నాలుకకి నరం ఉండదు, నోటికి ఏది వస్తే అది వాగేస్తుంటాడు. సెలెబ్రిటీల జీవితాల్లో ఇతను […]

Written By:
  • NARESH
  • , Updated On : April 18, 2023 / 09:31 PM IST
    Follow us on

    Katrina Kaif Divorce : బాలీవుడ్ లో రీసెంట్ ఉమర్ సందు అనే క్రిటిక్ బాగా ఫేమస్ అయిపోయాడు.సోషల్ మీడియా లో పాపులారిటీ సంపాదించడం కోసం అడ్డమైన గడ్డి తినడానికి కూడా సిద్దపడే ఏకైక వ్యక్తి ఇతనే,తన రీచ్ వస్తుంది అనిపిస్తే పొగుడుతాడు,రీచ్ రావట్లేదు ఎలా అయిన నెగటివ్ కామెంట్స్ చేసి పాపులర్ అవ్వాలి అనుకుంటే ఒక్క క్షణం కూడా ఆలోచించాడు.అతని నాలుకకి నరం ఉండదు, నోటికి ఏది వస్తే అది వాగేస్తుంటాడు.

    సెలెబ్రిటీల జీవితాల్లో ఇతను పుట్టించే అలజడి అంతా ఇంత కాదు.అప్పట్లో ప్రభాస్ మరియు ఆదిపురుష్ హీరోయిన్ కృతి సనన్ కి నిశ్చితార్థం జరిగిపోయిందని, త్వరలోనే వీళ్లిద్దరు పెళ్లి చేసుకోబోతున్నారు అంటూ వార్తలు వచ్చాయి.ఆ వార్తలు పుట్టించింది మరెవరో కాదు, ఈ ఉమర్ సందు అనే అతనే.ఈ వార్త పై స్వయంగా కృతి సనన్ సోషల్ మీడియా లో ప్రత్యేకమైన ప్రెస్ నోట్ విడుదల చెయ్యాల్సి వచ్చింది,మరో పక్క ప్రభాస్ కూడా క్లారిటీ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.

    అంతే అప్పటి నుండి ఉమర్ సందు అనే అతను ఇంకా రెచ్చిపోయాడు, ప్రతీ రోజు సెలెబ్రిటీల గురించి చాలా దారుణమైన రూమర్స్ ని ప్రచారం చేస్తూ తన పబ్బం గడుపుకుంటున్నారు.రీసెంట్ గా కత్రినా కైఫ్ మరియు విక్కీ కౌశల్ జంటపై ఒక రూమర్ ని ప్రచారం చేసాడు.వీళ్లిద్దరు నిన్న రాత్రి ఇంట్లో చాలా పెద్ద పెద్ద పెట్టుకున్నారని, కత్రినా కైఫ్ కోపం వచ్చి ఏడ్చుకుంటూ ఇల్లు వదిలి వెళ్ళిపోయింది అంటూ చాలా నీచమైన కామెంట్స్ చేసాడు.

    ఇది చూసిన అభిమానులు ఇతగాడిపై చాలా తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.వాళ్ళ ఇంటి వద్దనే కాపలా కుక్కలాగా కాచుకొని చూస్తూ ఉన్నావా, అంతా కళ్ళతో చూసినట్టు చెప్తున్నావ్ అంటూ ఉమర్ సందు ని తిడుతున్నారు ఫ్యాన్స్.కానీ ఇవన్నీ పట్టించుకునే రకం అయితే ఆయన ఎప్పుడో ఇలాంటి రూమర్స్ ని ప్రచారం చెయ్యడం ఆపేవాడు.నెటిజెన్స్ తిట్లని పట్టించుకోడు కాబట్టే తనకి ఇష్టమొచ్చిన రూమర్స్ ని ప్రచారం చేస్తున్నాడు.ఇతని ఆగడాలకు అడ్డుకట్ట వేసేవాళ్ళు ఎవరో చూడాలి.