వామ్మో కరెంట్ బిల్లు.. షాకైన నటి కార్తీక

లాక్డౌన్ కారణంగా ప్రజలంతా ఇంటికే పరిమితయ్యారు. దీంతో ఇళ్లల్లో కరెంట్ వినియోగం పెరిగిపోవడం కామన్. అయితే ఇదే అదనుగా విద్యుత్ శాఖ ప్రజలపై పెద్దఎత్తున భారంమోపుతోంది. సామాన్యుల నుంచి సెలబ్రెటీల వరకు ఎవరికీ వదలకుండా బాదుడు మొదలెట్టింది. లాక్డౌన్లో విద్యుత్ తీయకుండా నిర్లక్ష్యం చేయడమే కాకుండా బిల్లుల స్లాబ్ లలో తేడాలు చూపించి ఎక్కువ మొత్తంలో వినియోగదారుల నుంచి ఆ శాఖ డబ్బులను దండుకుంటోంది. ప్రతీనెల వచ్చే బిల్లు మాదిరిగానే సిబ్బంది రీడింగ్ తీస్తున్నారనే చెబుతున్నా బిల్లులు […]

Written By: Neelambaram, Updated On : June 26, 2020 9:16 pm
Follow us on


లాక్డౌన్ కారణంగా ప్రజలంతా ఇంటికే పరిమితయ్యారు. దీంతో ఇళ్లల్లో కరెంట్ వినియోగం పెరిగిపోవడం కామన్. అయితే ఇదే అదనుగా విద్యుత్ శాఖ ప్రజలపై పెద్దఎత్తున భారంమోపుతోంది. సామాన్యుల నుంచి సెలబ్రెటీల వరకు ఎవరికీ వదలకుండా బాదుడు మొదలెట్టింది. లాక్డౌన్లో విద్యుత్ తీయకుండా నిర్లక్ష్యం చేయడమే కాకుండా బిల్లుల స్లాబ్ లలో తేడాలు చూపించి ఎక్కువ మొత్తంలో వినియోగదారుల నుంచి ఆ శాఖ డబ్బులను దండుకుంటోంది. ప్రతీనెల వచ్చే బిల్లు మాదిరిగానే సిబ్బంది రీడింగ్ తీస్తున్నారనే చెబుతున్నా బిల్లులు మాత్రం వినియోగదారులకు చుక్కలు చూపిస్తున్నాయి.

మోడీ దెబ్బకు.. నల్లధనం ఖతం..

కరోనా కాలంలో బిక్కుబిక్కుమంటూ ఇంటికే పరిమితమైన ప్రజలపై విద్యుత్ శాఖ నిర్దాక్షిణ్యంగా బిల్లులను వసూలు చేస్తోంది. సామాన్యుల నుంచి సెలబ్రెటీల వరకు విద్యుత్ బిల్లులను చూసి షాక్ తింటున్నారు. విద్యుత్ శాఖ తీరుపై ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చిన్న చిన్న గుడిసెలకే వేలల్లో బిల్లులు వస్తున్నారు. ఇక సెలబ్రెటీల ఇళ్లకైతే ఏకంగా లక్షల్లో బిల్లులు వస్తుండటం గమనార్హం. ఇటీవల హీరోయిన్ స్నేహ ఇంటికి 70వేలకు పైగా కరెంట్ బిల్లు వచ్చింది. దీనిపై ఆమె సోషల్ మీడియాలో స్పందించింది. 70వేల కరెంటు కట్టేందుకు తమకు స్థోమత ఉందని అయితే ఇదే సామాన్యుల వస్తే వారి పరిస్థితి ఏంటని ప్రశ్నించింది. ఆమె వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ కావడం సంబంధిత విద్యుత్ అధికారులు స్పందించి వారి ఇంటికి మరోసారి రీడింగ్ తీసి బిల్లు ఇస్తామని ప్రకటించారు.

పాకిస్థాన్ ప్రపంచానికి ఇచ్చే సందేశం ఇదేనా?

తాజాగా మరోనటి తమ ఇంటికి వచ్చిన విద్యుత్ బిల్లు చూసి షాకైంది. నటి కార్తీక ఇంటికి అక్షరాలా లక్ష రూపాయల కరెంట్ బిల్లు వచ్చినట్లు ట్వీటర్లో వెల్లడించింది. దీనిపై ఆమె స్పందిస్తూ.. ముంబైలో ఏ కుంభ‌కోణం జ‌రుగుతుందని అదానీ ఎలక్ట్రిసిటీ ముంబై లిమిటెడ్‌, మ‌హారాష్ట్ర ప్ర‌భుత్వాన్ని ఆమె ప్రశ్నించింది. భారీ పరిశ్రమలకు సైతం లక్షల్లో కరెంట్ బిల్లులు రావని అలాంటిది ఒక ఇంటికి జూన్ నెలలో లక్ష రూపాయాల కరెంటు బిల్లు రావడం ఏంటని ప్రశ్నించింది. విద్యుత్ సిబ్బంది కరెంట్ మీటర్ రీడింగ్‌ తీయకుండా వాళ్లకు ఇష్టమొచ్చినట్లు వేస్తున్నారని ఆమె ఆరోపించింది. ముంబయివాసుల నుంచి ఇలాంటి ఫిర్యాదులు అనేక వస్తున్నా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనిపై విద్యుత్ శాఖ అధికారులు ఎలా స్పందిస్తారో వేచి చూడాల్సిందే..!