https://oktelugu.com/

ఫ్యాన్స్ కు ‘బిగ్‌బాస్‌’ షాక్..!

లాక్డౌన్ కారణంగాలో సినిమా షూటింగులు, థియేటర్లు మూతపడిన సంగతి తెల్సిందే. దీంతో సెలబ్రెటీలంతా ఇంటికే పరిమితయ్యారు. స్టార్ హీరోహీరోయిన్లు సోషల్ మీడియాలో సందడి చేస్తున్నారు. క్వారంటైన్లో తమ అనుభవాలను అభిమానులతో పంచుకుంటున్నారు. హీరోలంతా ఫ్యామిలీతో కాలక్షేపం చేస్తున్నారు. ఇక హీరోయిన్లయితే ఫిట్నెస్, యోగా, కుకింగ్, పిల్లో ఛాలెంజ్, మేకప్ ఛాలెంజ్, హాట్ హాట్ ఫొటోలను షేర్ చేస్తూ అభిమానులతో నిత్యం టచ్లో ఉంటూ ఆకట్టుకుంటున్నారు. మోడీ దెబ్బకు.. నల్లధనం ఖతం.. తాజాగా లాక్డౌన్ సడలింపుల నేపథ్యంలో తెలుగు […]

Written By:
  • Neelambaram
  • , Updated On : June 26, 2020 / 09:09 PM IST
    Follow us on


    లాక్డౌన్ కారణంగాలో సినిమా షూటింగులు, థియేటర్లు మూతపడిన సంగతి తెల్సిందే. దీంతో సెలబ్రెటీలంతా ఇంటికే పరిమితయ్యారు. స్టార్ హీరోహీరోయిన్లు సోషల్ మీడియాలో సందడి చేస్తున్నారు. క్వారంటైన్లో తమ అనుభవాలను అభిమానులతో పంచుకుంటున్నారు. హీరోలంతా ఫ్యామిలీతో కాలక్షేపం చేస్తున్నారు. ఇక హీరోయిన్లయితే ఫిట్నెస్, యోగా, కుకింగ్, పిల్లో ఛాలెంజ్, మేకప్ ఛాలెంజ్, హాట్ హాట్ ఫొటోలను షేర్ చేస్తూ అభిమానులతో నిత్యం టచ్లో ఉంటూ ఆకట్టుకుంటున్నారు.

    మోడీ దెబ్బకు.. నల్లధనం ఖతం..

    తాజాగా లాక్డౌన్ సడలింపుల నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో సినిమా, టీవీ షూటింగులకు ప్రభుత్వం అనమతి ఇచ్చింది. అయితే ఇప్పటివరకు సినిమా షూటింగుల సందడి మొదలుకాలేదు. స్టార్ హీరోహీరోయిన్లు కరోనాపై వేచిచూసే ధోరణిలో ఉండటంతో ఇప్పట్లో షూటింగులు ప్రారంభమయ్యేలా కన్పించడం లేదు. సినిమాలు మొదలు కావడానికి ఇంకా సమయం పట్టే అవకాశం ఉంది. అయితే టీవీ సీరియళ్లు, టీవీ షోల సందడి మాత్రం బుల్లితెరపై మొదలైంది.

    బుల్లితెర రియల్టీ షో ‘బిగ్‌బాస్‌’కు చాలామంది అభిమానులున్నారు. ఇప్పటికే బిగ్‌బాస్‌ మూడు సీజన్లను పూర్తి చేసుకుంది. ప్రస్తుతం బిగ్‌బాస్‌-4 సీజన్ ప్రారంభం కానుంది. ఇప్పటికే కాంటెస్టెంట్ ఎంపిక షూరు అయింది. అయితే కరోనా ఎఫెక్ట్ కారణంగా ఈసారి బిగ్‌బాస్‌ నిర్వాహాకులు ఫ్యాన్స్ షాకిచ్చే నిర్ణయం తీసుకున్నారు. బిగ్‌బాస్‌ మొదటి సీజన్ 70రోజులు కొనసాగింది. ఆ తర్వాత వచ్చిన బిగ్‌బాస్‌-2, బిగ్‌బాస్‌-3 సీజన్లు వంద రోజులు సాగింది. అయితే నాలుగో సీజన్ మాత్రం కేవలం 50రోజులకే పరిమితం చేయనున్నారని సమాచారని ఫిల్మ్ నగర్లో టాక్ విన్పిస్తోంది.

    ‘బీహార్‌ ఎన్నికల కోసం బీజేపీ గల్వాన్‌ నాటకం!’

    ఇక సీజన్ జూలై లేదా ఆగష్టులో ఈ సీజన్‌ను ప్రారంభించాలని నిర్వాహకులు భావిస్తున్నారు. బిగ్‌బాస్‌-4కు హోస్ట్‌గా నాగార్జునను ఫైనల్ అయినట్లు తెలుస్తోంది. ఇప్పటికే కంటెస్టెంట్‌ ఎంపిక పూర్తినట్లు టాక్ విన్పిస్తోంది. 12మంది కంటెస్టెంట్‌లతో బిగ్‌బాస్ 4 ఉండనుందట. కరోనా నేపథ్యంలో కంటెస్టెంట్‌లకు బెడ్‌రూమ్‌ నుంచి బాత్‌రూమ్‌ల వరకు అన్నీ సెపరేట్‌గా ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నారట. టాస్క్‌లు కూడా భౌతిక దూరం పాటించేలా ప్లాన్ చేస్తున్నారని సమాచారం.

    ఇప్పటికే బిగ్‌బాస్‌-4కు సంబంధించిన సెట్‌ను హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోలో వేసినట్లు సమాచారం. త్వరలోనే బిగ్‌బాస్‌-4 ప్రారంభ తేదిని నిర్వాహాకులు అధికారికంగా ప్రకటించేందుకు సిద్ధమవుతున్నారు.