https://oktelugu.com/

చంద్రబాబు బినామీ… టీడీపీకి గుడ్ బై చెవుతున్నాడా?

సాధారణ నటుడిగా ప్రస్థానం ప్రారంభించి టీడీపీ పార్టీ అండతో…రాజకీయ నాయకుడిగా, వ్యాపార వేత్తగా ఎదిగారు మాజీ ఎంపీ మురళీ మోహన్. చంద్రబాబు సొంత సామాజిక వర్గానికి చెందిన మురళి మోహన్ ఆయనకి అత్యంత ఆప్తుడు మరియు సన్నిహితుడు. ఒక విధంగా చెప్పాలంటే ఏళ్లుగా సాగుతున్న చంద్రబాబు అక్రమ ఆర్జనకు అధికారిక కాపలాదారు. చంద్రబాబు ఆస్థులలో సగానికిపైగా ఈయన బినామీ జమానాలోనే ఉన్నాయి. అందుకే ఏళ్ల తరబడి వీరి మధ్య దృఢమైన బంధం కొనసాగుతుంది. మోడీ దెబ్బకు.. నల్లధనం […]

Written By:
  • Neelambaram
  • , Updated On : June 27, 2020 / 10:18 AM IST
    Follow us on


    సాధారణ నటుడిగా ప్రస్థానం ప్రారంభించి టీడీపీ పార్టీ అండతో…రాజకీయ నాయకుడిగా, వ్యాపార వేత్తగా ఎదిగారు మాజీ ఎంపీ మురళీ మోహన్. చంద్రబాబు సొంత సామాజిక వర్గానికి చెందిన మురళి మోహన్ ఆయనకి అత్యంత ఆప్తుడు మరియు సన్నిహితుడు. ఒక విధంగా చెప్పాలంటే ఏళ్లుగా సాగుతున్న చంద్రబాబు అక్రమ ఆర్జనకు అధికారిక కాపలాదారు. చంద్రబాబు ఆస్థులలో సగానికిపైగా ఈయన బినామీ జమానాలోనే ఉన్నాయి. అందుకే ఏళ్ల తరబడి వీరి మధ్య దృఢమైన బంధం కొనసాగుతుంది.

    మోడీ దెబ్బకు.. నల్లధనం ఖతం..

    చంద్రబాబులో సగమైన మురళి మోహన్ పార్టీకి గుడ్ బై చెవుతున్నారనే వార్త ఇప్పుడు టీడీపీ వర్గాలలో కలకలం రేపుతోంది. ఆయన అధికారికంగా రాజకీయ సన్యాసం తీసుకోనున్నారట. ఆరోగ్య కారణాలతో పాటు, తన వ్యాపారాలపై పూర్తి స్థాయిలో ద్రుష్టి కేంద్రీకరించడం కోసం ఆయన టీడీపీ పార్టీకి రాజీనామా చేయాలని అనుకుంటున్నారట. పార్టీ సభ్యుడిగా కొనసాగుతున్న నేపథ్యంలో అనేక విషయాలపై స్పందించాల్సి ఉంటుంది. కావున రాజకీయ నాయకుడనే ముద్ర పోగొట్టుకోవాలని ఆయన ఈ నిర్ణయం తీసుకునట్లు తెలుస్తుంది.

    ‘బీహార్‌ ఎన్నికల కోసం బీజేపీ గల్వాన్‌ నాటకం!’

    గత ఎన్నికల్లోనే మురళీ మోహన్ పోటీ నుండి తప్పుకున్నారు. ఆరోగ్య కారణాలు చూపి రాజమండ్రి పార్లమెంట్ స్థానం నుండి పోటీ చేయలేదు. చంద్రబాబు ఎంత బతిమిలాడినా ఆయన ససేమిరా అన్నారు. బాబు గారి మాట కాదనలేక తన కోడలు రూపా దేవిని రంగంలోకి దింపాడు. వైసీపీ ఎంపీ అభ్యర్థి మార్గాని భరత్ చేతిలో ఆమె ఓటమి చెందారు. 2019 ఎన్నికల ఫలితాల తరువాత మురళీ మొహన్ కానీ ఆయన కుటుంబం కానీ రాజకీయ విషయాలపై స్పందించడం కానీ, టీడీపీ కార్యకలాపాల్లో పాల్గొనడం కానీ చేయలేదు. టీడీపీ మహానాడు వేడుకలలో కూడా మురళీ మోహన్ కనిపించకపోవడం గమనార్హం. ఈ పరిణామాలన్నీ గమనిస్తుంటే మురళీ మోహన్ సైకిల్ దిగుతున్నాడన్న వార్తలలో నిజం ఉందనిపిస్తుంది.