Karthika Deepam: దీపను తప్పించే ప్లాన్ లో ఉన్న మోనిత.. చాటుగా తన ప్లాన్ ఏంటో తెలుసుకున్న ప్రియమణి!

Karthika Deepam: బుల్లితెరపై ఎంతో రసవత్తరంగా కొనసాగుతున్న కార్తీకదీపం సీరియల్ ఈ రోజు రోజుకు విశేషమైన ప్రేక్షకాదరణ దక్కించుకుంటుంది.ఇలా ఉండగా నేటి ఎపిసోడ్ లో భాగంగా దీప కార్తిక్ బస్తీలోని ఒక సైట్ కొని అక్కడ ఇల్లు కట్టుకోవాలని భావించినట్లు సౌర్య హిమ తో చెప్పడంతో ఇద్దరూ ఎంతో హ్యాపీగా ఫీలవుతారు. ఇక మనం బస్తీలో కొద్ది రోజులు ఇక్కడ ఉండవచ్చు అంటూ పిల్లలు సంతోష పడతారు. బస్తీలో మోనితకి తనకి జరిగిన అవమానం గురించి తెలుసుకుని […]

Written By: Navya, Updated On : November 30, 2021 11:54 am
Follow us on

Karthika Deepam: బుల్లితెరపై ఎంతో రసవత్తరంగా కొనసాగుతున్న కార్తీకదీపం సీరియల్ ఈ రోజు రోజుకు విశేషమైన ప్రేక్షకాదరణ దక్కించుకుంటుంది.ఇలా ఉండగా నేటి ఎపిసోడ్ లో భాగంగా దీప కార్తిక్ బస్తీలోని ఒక సైట్ కొని అక్కడ ఇల్లు కట్టుకోవాలని భావించినట్లు సౌర్య హిమ తో చెప్పడంతో ఇద్దరూ ఎంతో హ్యాపీగా ఫీలవుతారు. ఇక మనం బస్తీలో కొద్ది రోజులు ఇక్కడ ఉండవచ్చు అంటూ పిల్లలు సంతోష పడతారు. బస్తీలో మోనితకి తనకి జరిగిన అవమానం గురించి తెలుసుకుని సంతోష పడుతూ ఉంటుంది. అది చూసిన ప్రియమణి షాక్ అవుతూ ఇంత అవమానం జరిగిన సంతోషపడుతున్నారు ఏంటి అని అడుగుతుంది.

Karthika Deepam

నా ప్రేమ ఎంతో నిజమైనది నేను ఎవరికీ ఊహించని విధంగా ఆ దీపకు షాక్ ఇస్తా చూడు అంటూ చాలెంజ్ చేయడంతో మీ పంతం కార్తీక్ బాబు మీద కదా మధ్యలో దీపమ్మ ఏం చేసింది అంటూ అనడంతో కాస్త చలిగా ఉంది ఫ్యాన్ ఆఫ్ చేయమని చెబుతుంది.దాంతో ప్రియమణి స్విచాఫ్ చేయడంతో చూసావా నేను ఫ్యాన్ ఆఫ్ చేయమంటే నువ్వు స్విచ్ దగ్గరికి వెళ్లావు అలాగే కార్తీక్ లైట్ అయితే ద్వీప స్విచ్. కనుక కార్తీక్ నా దగ్గరకు రావాలంటే దీప ఉండకూడదు ఎలాగైనా ఈ దీపను తపిస్తాను అంటూ ప్లాన్ వేస్తుంది.

ఇక సౌందర్య తన కుటుంబాన్ని ఇలా సంతోషంగా ఉంచినందుకు దేవుడికి కృతజ్ఞతలు తెలుపుతూ తన కుటుంబం మొత్తం తిరుపతికి వస్తానని మొక్కుతుంది.ఆ సమయంలోనే దీప అందరికీ టీ తీసుకురావడంతో వెంటనే కార్తీక్ తొందరగా రెడీగా వెళ్లి సైట్ చూద్దాం అని చెబుతారు. అలాగే డాక్టర్స్ అసోసియేషన్ మీటింగ్ఉంది అక్కడికి వెళ్లాలి నాకు ఇష్టం లేకపోయినా ఏకగ్రీవంగా నన్ను ప్రెసిడెంట్ గా ఎన్నిక చేస్తున్నారు అనడంతో అందుకు సంతోషమే కదా ఒప్పుకోరా అంటూ సౌందర్య అంటుంది.

Also Read: బిగ్ బాస్ టైటిల్ మా క్యాస్ట్ వాడే కొట్టాలి… అరె ఎటు పోతుందిరా ఈ సమాజం!

ఈ సమయంలోనే భారతీ మోనితకి ఫోన్ చేసి మీటింగ్ కి వస్తున్నావా అని అడగడంతో తను రావడం లేదని చెబుతోంది. దీంతో కార్తీక్ భారత్ కి ఫోన్ చేసి తను వస్తుందని అడగగా రావట్లేదు ఇప్పుడే కనుక్కున్నాను అని చెబుతుంది. మోనిత కార్తీక్ బొమ్మ గీసే తన బొమ్మ ఎదుట అన్ని మాట్లాడుతూ ఉంటుంది. దీప కేవలం వంట చేసుకుంటూ ఉంటుంది కదా అనుకుంటే నాకే ఇలాంటి ట్విస్ట్ ఇస్తుంది. ఎలాగైనా తననీ కార్తీక్ నుంచి నుంచి తప్పిస్తాను.. ఎలా తప్పించాలి అంటూ పథకం వేస్తుంది. ఇదంతా ప్రియమణి దొంగచాటుగా వింటూ ఉండడంతో ప్రియమణి అని గట్టిగా అరవడంతో ప్రియ మని భయపడటంతో ఏంటి చాటుగా ఉండి అన్ని వింటున్నావా అని అడిగి నాది చాటు మాటు ప్రేమ కాదు ప్రియమణి నాది లీగల్ ప్రేమ ఎలాగైనా కార్తీక్ ను దక్కించుకుంటానని చాలెంజ్ చేస్తుంది.ఇక డాక్టర్స్ మీటింగ్ కి రానని చెప్పిన మోనిత ఊహించని విధంగా అక్కడికి వెళ్లి అందరికీ షాక్ ఇస్తుంది. అయితే తర్వాత ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో తెలియాల్సి ఉంది

Also Read: ఆమె కేసులో తేలు కుట్టిన దొంగల్లా టాలీవుడ్ సెలబ్రిటీలు.. కారణం అదే !