https://oktelugu.com/

Bheemla Nayak Movie: భీమ్లా నాయక్ సినిమా నుంచి గుడ్ న్యూస్… నాలుగవ పాట విడుదల ఎప్పుడంటే ?

Bheemla Nayak Movie: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దగ్గుబాటి రానా కలిసి నటిస్తున్న చిత్రం ‘భీమ్లా నాయక్’. సాగర్ కె చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న ఈ సినిమాకి … తమన్ సంగీతం అందిస్తున్నారు. మలయాళంలో సూపర్ హిట్ గా నిలిచిన ‘అయ్యప్పనుమ్ కోశియుమ్’ సినిమాకి రీమేక్ గా ఈ మూవీని నిర్మిస్తున్నారు. సితార ఎంటర్ టైన్ మెంట్స్ పతాకంపై ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పవన్ కళ్యాణ్, రానా క్యారెక్టర్ల […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : November 30, 2021 / 11:42 AM IST
    Follow us on

    Bheemla Nayak Movie: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దగ్గుబాటి రానా కలిసి నటిస్తున్న చిత్రం ‘భీమ్లా నాయక్’. సాగర్ కె చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న ఈ సినిమాకి … తమన్ సంగీతం అందిస్తున్నారు. మలయాళంలో సూపర్ హిట్ గా నిలిచిన ‘అయ్యప్పనుమ్ కోశియుమ్’ సినిమాకి రీమేక్ గా ఈ మూవీని నిర్మిస్తున్నారు. సితార ఎంటర్ టైన్ మెంట్స్ పతాకంపై ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పవన్ కళ్యాణ్, రానా క్యారెక్టర్ల ప్రోమోలు, పాటలకు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. అయితే ఇప్పుడు తాజాగా ఈ మూవీ నుంచి అదిరిపోయే అప్డేట్ ను చిత్ర బృందం ప్రకటించింది.

    Pawan Kalyan Bheemla Nayak Movie

    Also Read: అతనికి గ్యాప్ రావడం ప్రభాస్ కి కలిసొచ్చింది !

    తాజాగా ఈ సినిమాలోని నాలుగవ పాటను రిలీజ్ చేసేందుకు ముహుర్తం ఖరారు చేసింది చిత్ర బృందం. ”అడవి తల్లి మాట ” అనే లిరిక్స్‌ తో ప్రారంభం అయ్యే ఈ సాంగ్‌ ను డిసెంబర్‌ 1 వ తేదీ 10.08 గంటలకు విడుదల చేస్తున్నట్లు మూవీ యూనిట్ ప్రకటించింది. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ఓ పోస్టర్‌ ను కూడా విడుదల చేశారు. ఇక ఈ అప్డేట్‌ తో పవన్‌ ఫ్యాన్‌ లో ఉత్సాహం నెలకొంది. ఇక ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ సరసన నిత్యామీనన్ హీరోయిన్ గా నటిస్తుండగా… రానా సరసన సంయుక్త మీనన్ నటిస్తోంది. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 12 న ఈ సినిమా థియేటర్లలో సందడి చేయనున్నట్లు ప్రకటించారు. ప్రాస్తుతం ఈ వార్త సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.

    https://twitter.com/SitharaEnts/status/1465538613177843724?s=20

    Also Read: పుష్ప ప్రీరిలీజ్​ ఈవెంట్​ ముఖ్య అతిథిగా ప్రభాస్​?