https://oktelugu.com/

Prabhas: అతనికి గ్యాప్ రావడం ప్రభాస్ కి కలిసొచ్చింది !

Prabhas: “రాధేశ్యామ్” నుంచి తాజాగా హిందీ సాంగ్ టీజర్ రిలీజ్ అయింది. ‘ఆశిఖీ ఆగయి” అంటూ సాగిన ఈ పాట కేవలం కొద్ది క్షణాల్లో లక్షల వ్యూస్ తో ట్రెండ్ సెట్ చేస్తుంది. ముఖ్యంగా సాంగ్ లోని విజువల్స్, అండ్ మేకింగ్ షాట్స్ చాలా ఫ్రెష్ గా అనిపించాయి. అలాగే ప్రభాస్ , పూజా కూడా బ్యూటిఫుల్ కపుల్ లాగా చాలా కలర్ ఫుల్ గా కనిపించారు. ఈ సినిమా హిందీ వెర్షన్ కి మిథున్ మ్యూజిక్ […]

Written By:
  • Shiva
  • , Updated On : November 30, 2021 / 11:32 AM IST
    Follow us on

    Prabhas: “రాధేశ్యామ్” నుంచి తాజాగా హిందీ సాంగ్ టీజర్ రిలీజ్ అయింది. ‘ఆశిఖీ ఆగయి” అంటూ సాగిన ఈ పాట కేవలం కొద్ది క్షణాల్లో లక్షల వ్యూస్ తో ట్రెండ్ సెట్ చేస్తుంది. ముఖ్యంగా సాంగ్ లోని విజువల్స్, అండ్ మేకింగ్ షాట్స్ చాలా ఫ్రెష్ గా అనిపించాయి. అలాగే ప్రభాస్ , పూజా కూడా బ్యూటిఫుల్ కపుల్ లాగా చాలా కలర్ ఫుల్ గా కనిపించారు. ఈ సినిమా హిందీ వెర్షన్ కి మిథున్ మ్యూజిక్ అందిస్తున్నాడు.

    Radhe Shyam

    మొత్తమ్మీద ఈ పాటని మిథున్ అద్భుతంగా కంపోజ్ చేశాడు. ఇక ఈ పాటను అర్జిత్ సింగ్ ఆలపించాడు. సహజంగా అర్జిత్ సింగ్ అంటే ఓ రాక్ స్టార్ అని పేరు ఉంది. మనకు సౌత్ లో సిద్ది శ్రీరామ్ కి ఎలా అయితే ప్రేక్షకుల్లో ఆదరణ ఉందో.. బాలీవుడ్ లో అంతకుమించిన క్రేజ్ ఉన్న సింగర్ అర్జిత్. బహుశా అర్జిత్ క్రేజ్ కారణంగా కూడా ఈ పాట అద్భుతంగా హిట్ అయి ఉంటుంది.

    పైగా చాలా రోజుల తర్వాత అర్జిత్ ఈ పాట పాడాడు. అర్జిత్ కి లాంగ్ గ్యాప్ రావడం కూడా రాధే శ్యామ్ కి బాగా కలిసి వచ్చింది. మొత్తానికి ఈ సాంగ్ టీజర్ తో రాధే శ్యామ్ నేను కూడా రేసులో ఉన్నాను అని బాలీవుడ్ లో గట్టిగా చెప్పినట్టు అయింది. నిజానికి సంక్రాంతికి ‘రాధేశ్యామ్’ రిలీజ్ అవుతుందని మేకర్స్ ప్రకటించారు గానీ, పెద్దగా సినిమాకి సంబంధించి అప్ డేట్స్ ను ఇవ్వలేక పోయారు.

    Also Read: Payal Rajput: లోదుస్తులతో అరాచకం.. అవకాశాల కోసమేనా ఈ బరి తెగింపు !

    పైగా ప్రమోషన్స్ కూడా బలంగా చేయలేకపోతున్నారు. ఈ విషయంలో ‘రాధేశ్యామ్’ నిర్మాతలకు బుర్రలో గుజ్జు లేదు అని విమర్శలు కూడా వినిపించాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఈ సాంగ్ టీజర్ రిలీజ్ అయి, సినిమా పై అంచనాలు పెంచడంతో మొత్తానికి ఈ చిత్రం పాన్ ఇండియా సినిమా అని హిందీ జనానికి అర్ధం అయింది.

    ఏది ఏమైనా ఒక భారీ సినిమా తీస్తున్నప్పుడు అన్నీ ముందే అనేసుకోవాలి. సినిమా ప్రచారం కూడా ముందు నుంచీ ముమ్మరంగా చేయాలి. ఎలాగూ ఇప్పటికే, ‘రాధేశ్యామ్’ విషయంలో ప్రభాస్ ఫ్యాన్స్ చాలా నిరుత్సాహానికి గురయ్యారు. ఇక నుంచైనా రాధేశ్యామ్ అప్ డేట్స్ ను రెగ్యులర్ గా ఇస్తే మంచిది.

    Also Read: Sirivennela: సిరివెన్నెల ఆరోగ్యంపై హెల్త్ బులెటిన్​ విడుదల చేసిన వైద్యులు

    Tags