Homeఎంటర్టైన్మెంట్Karthika Deepam Doctor Babu: కార్తీకదీపం డాక్టర్ బాబుకు ఇంత పెద్ద కొడుకు ఉన్నాడా? హీరో...

Karthika Deepam Doctor Babu: కార్తీకదీపం డాక్టర్ బాబుకు ఇంత పెద్ద కొడుకు ఉన్నాడా? హీరో మెటీరియల్ చూశారా!

Karthika Deepam Doctor Babu: నిరుపమ్ పరిటాల క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బుల్లితెర పై తిరుగులేని స్టార్ డమ్ సంపాదించుకున్నాడు. కార్తీకదీపం సీరియల్ లో డాక్టర్ బాబు గా మంచి పాపులారిటీ దక్కించుకున్నాడు. ప్రస్తుతం కార్తీకదీపం 2 లో నటిస్తున్నాడు. కాగా నిరుపమ్ భార్య మంజులకు కూడా సోషల్ మీడియాలో సైతం మంచి ఫాలోయింగ్ ఉంది. మంజుల పరిటాల సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటారు. తన ఫ్యామిలీ ఫోటోలు, వ్యక్తిగత విషయాలు ఇంస్టాగ్రామ్ వేదికగా షేర్ చేస్తూ ఉంటారు.

తాజాగా మంజుల షేర్ చేసిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి. సదరు ఫొటోల్లో నిరుపమ్ కొడుకు అట్రాక్ట్ చేస్తున్నాడు. నిరుపమ్ పరిటాల తన ఫ్యామిలీతో కలిసి సమ్మర్ వెకేషన్ కి వెళ్లారు. వెకేషన్ ఫోటోలు మంజుల షేర్ చేయగా వారి అబ్బాయి అందరి దృష్టిని ఆకర్షించాడు. మంచి కలర్, ఫిజిక్ తో చాలా చక్కగా ఉన్నాడు. అందంగా కనిపిస్తున్నాడు. టీనేజ్ లోనే హీరోలా ఉన్నాడు అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

Also Read: Son of Satyamurthy child artist: సన్ ఆఫ్ సత్యమూర్తి చిత్రంలోని పాప ఇంత పెద్దది అయ్యిందా… ఆమె లేటెస్ట్ లుక్ చూస్తే షాక్ అవుతారు!

ఫ్యూచర్ లో తండ్రి లాగే హీరో అవుతాడని అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు. కాగా చంద్రముఖి సీరియల్ ద్వారా నిరుపమ్ పరిటాల బుల్లితెర నటుడిగా నిలదొక్కుకున్నాడు. ఆ తర్వాత పలు సీరియల్స్ లో నటించాడు. చంద్రముఖి సీరియల్ లో హీరోయిన్ గా నటించిన మంజులను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వీరి కొడుకు పేరు అక్షరాజ్. హీరోగా సిల్వర్ స్క్రీన్ పై రాణించాలని నిరుపమ్ కలలు కన్నాడు. అక్కడ అవకాశాలు రాలేదు.

Also Read: Actress Hema: జైలు నుంచి విడుదలైన నటి హేమ… ఇప్పుడు ఏం చేస్తుంది? ఆమె భవిష్యత్తు ఏమిటీ?

చేసేది లేక సీరియల్స్ వైపు వచ్చారట. కార్తీకదీపం సీరియల్ తో అతని కెరీర్ టర్న్ అయింది. స్టార్ మా లో ప్రసారమైన కార్తీకదీపం నెలకొల్పిన రికార్డులు అన్నీ ఇన్నీ కావు. ఏళ్ల తరబడి నెంబర్ వన్ సీరియల్ గా అగ్రస్థానంలో కొనసాగింది. నిరుపమ్ పరిటాల బుల్లితెర నటుడిగా అత్యధిక పారితోషికం అందుకుంటున్నాడు. ఇటీవల కార్తీక దీపం 2 మొదలైంది. నిరుపమ్ మరోసారి హీరోగా చేస్తున్నాడు.

Exit mobile version