Actress Hema: జైలు నుంచి విడుదలైన నటి హేమ… ఇప్పుడు ఏం చేస్తుంది? ఆమె భవిష్యత్తు ఏమిటీ?

Actress Hema: జైలు నుంచి విడుదలైన నటి హేమ... ఇప్పుడు ఏం చేస్తుంది? ఆమె భవిష్యత్తు ఏమిటీ?

Written By: S Reddy, Updated On : June 15, 2024 4:30 pm

Actress Hema Released from Jail

Follow us on

Actress Hema: నటి హేమ బెంగళూరు జైలు నుండి విడుదల అయ్యారు. కోర్టు ఆమెకు గురువారం షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. శుక్రవారం ఆమె జైలు నుంచి బయటకు వచ్చారు. హేమ జైలు నుంచి రిలీజ్ అయిన వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. హేమ బెంగళూరు రేవ్ పార్టీ కేసులో అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. రేవ్ పార్టీలో డ్రగ్స్ తీసుకున్నట్లు నిర్ధారించిన పోలీసులు హేమను అరెస్టు చేశారు.

ఆమెను రిమాండ్ కి తరలించారు. నటి హేమ బెయిల్ కోసం అప్లై చేసుకోగా .. ఆమె తరుపు న్యాయవాది వాదనలు వినిపించారు. హేమ దగ్గర నుండి ఎటువంటి డ్రగ్స్ స్వాధీనం చేసుకోలేదు. అలాగే హేమను అరెస్ట్ చేసిన పది రోజుల తర్వాత ఆమెకు వైద్య పరీక్షలు నిర్వహించారని, ఈ డ్రగ్స్ వ్యవహారంతో హేమకు ఎటువంటి సంబంధం లేదని ఆయన వాదించారు. న్యాయవాది వాదనలు విన్న కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది.

దీంతో హేమకు కాస్త ఊరట లభించినట్లయింది. కోర్టు విధించిన నిబంధనల ప్రకారం ఆమె పోలీసులు పిలిచిన వెంటనే విచారణకు రావాలి. అనుమతి లేకుండా విదేశాలకు వెళ్ళకూడదు అని షరతులు విధించినట్లు సమాచారం. మే 19న బెంగళూరులోని ఓ ఫార్మ్ హౌస్ లో రేవ్ పార్టీ జరిగింది. ఎలక్ట్రానిక్ సిటీ సమీపంలో బీఆర్ ఫార్మ్ హౌస్ లో బర్త్ డే పార్టీ పేరుతో రేవ్ పార్టీ నిర్వహించారు. ఇందులో దాదాపు వంద మంది వరకు పాల్గొన్నారు.

Also Read: Ramya Krishnan: రమ్యకృష్ణ ఆస్తుల విలువ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే

వీళ్లందరినీ టెస్ట్ చేయగా .. 57 మంది పురుషులు, 27 మంది మహిళలకు పాజిటివ్ వచ్చింది. ఇందులో నటి హేమ కూడా డ్రగ్స్ తీసుకున్నారని తేలడంతో విచారణకు హాజరు కావాలని నోటీసులు పంపించారు. ఆమె విచారణకు రాకపోవడంతో అదుపులోకి తీసుకున్నారు. హేమ అసలు తాను పార్టీ కి వెళ్లలేదని .. హైదరాబాద్ లోనే ఉన్నాను అంటూ వీడియోలు రిలీజ్ చేసి పోలీసులను బురిడీ కొట్టించే ప్రయత్నం చేసింది. కానీ చివరికి దొరికిపోయింది.

Also Read: Shobana: ఆ హీరో మోసం చేయడం వల్లే పెళ్లి చేసుకోకుండా ఒంటరి గా ఉన్న ఒకప్పటి స్టార్ హీరోయిన్…

జైలు నుండి విడుదలైన హేమ హైదరాబాద్ కి చేరుకున్నట్లు సమాచారం. రేవ్ పార్టీలో హేమ పాల్గొన్నట్లు పోలీసులు నిర్ధారించిన నేపథ్యంలో మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు మంచు విష్ణు ఆమెపై చర్యలకు పాల్పడ్డాడు. హేమ మా సభ్యత్వం రద్దు చేసిన సంగతి తెలిసిందే. నటిగా హేమ కెరీర్ నెమ్మదించిన సూచనలు కనిపిస్తున్నాయి. ఈ పరిణామం ఆమె కెరీర్ పై తీవ్ర ప్రభావం చూపనుంది.